భక్త మార్కండేయ (1938 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

209 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
 
సినీ పరిశ్రమలో మొదట ఎడిటర్‌గా ప్రవేశించి, ఆ తర్వాత దర్శకుడిగా మారిన చిత్రపు నారాయణమూర్తి మొట్టమొదటగా దర్శకత్వం వహించిన చిత్రం ఈ భక్త మార్కండేయ. ఇందులో మార్కండేయగా జి.ఎన్‌.స్వామి, యముడుగా వేమూరి గగ్గయ్య, మృకండ మహామునిగా ఘంటసాల రాధాకృష్ణయ్య, శివుడిగా రాయప్రోలు సుబ్రహ్మణ్యం, బ్రహ్మగా ఘంటసాల శేషాచలం, నారదుడిగా టి.రామకృష్ణశాస్త్రి, విష్ణుమూర్తిగా విశ్వనాధం, మరదృతిగా శ్రీరంజని, పార్వతిగా కుమారి, భూదేవిగా రమాదేవిలు నటించారు.
 
కుబేరా పిక్చర్స్‌ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రానికి ఘంటసాల బలరామయ్య, వెంకరెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. విశ్వనాథ కవి మాటలు రాయగా, బలిజేపల్లి వినసొంపైన పాటలు రచించారు. ఎ.గోపాలరావు, జె.నన్నయ్య అద్భుతమైన సంగీతాన్ని అందించారు. బొమ్మన్‌ డి.ఇరానీ ఫొటోగ్రఫీని సమకూర్చారు. దర్శకులుగా వ్యవహరించిన చిత్రపునారాయణమూర్తి చిత్రరంగానికి రాకముందు నేషనల్‌ థియేటర్స్‌ అనే నాటక సంస్థను నెలకొల్పి, 'మార్కండేయ'తోపాటు పలు నాటకాలను ప్రదర్శించారు. ఆ అనుభవం ఈ సినిమాకు ఎంతో ఉపకరించింది. నారాయణమూర్తి, ఘంటసాల బలరామయ్య సోదరులిద్దరూ ఈ చిత్రంలో ప్రధానపాత్రలు పోషించడం విశేషం. 1938 జూన్‌ 17న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడింది.<ref>[{{Cite web |url=http://www.visalaandhra.com/movieworld/article-58135 |title=అలనాటి అపురూప చిత్రం భక్తమార్కండేయ - విశాలాంధ్ర జూలై 30, 2011] |website= |access-date=2013-07-30 |archive-url=https://web.archive.org/web/20160304203849/http://www.visalaandhra.com/movieworld/article-58135 |archive-date=2016-03-04 |url-status=dead }}</ref>
 
మృకండ మహర్షి గొప్పతపశ్శాలి. చాలారోజులుగా సంతానం కోసం తపస్సు చేస్తుంటాడు. వారి దీక్షకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై, వారికో అవకాశమిస్తాడు. సకల శాస్త్ర ప్రావీణ్యుడైన అల్పాయుష్కుడు కావాలో, పరమమూర్ఖుడు, దీర్ఘాయుష్కుడైన కొడుకు కావాలో వారినే తేల్చుకోమంటాడు ఈశ్వరుడు. ఆ దంపతులు ఆలోచించి కాకిలా కలకాలం జీవించడం కంటే, హంసలా కొంతకాలం బతికినా చాలని అల్పాయుష్కుడైన కుమారుడిని ప్రసాదించమని పరమేశ్వరుని కోరుకుంటారు. అలా లభించిన పిల్లవాడికి మార్కండేయుడని పేరుపెట్టి గారాబంగా పెంచుతుంటారు. ఆ బాలుడు పున్నమి చంద్రుడిలా ఎదుగుతుంటే, కన్నవారి ముఖాల్లో దిగులు చోటు చేసుకుంటుంది. అయిదవ ఏడు వస్తుంది. విద్యనేర్చుకోవాలని ఉబలాటపడుతుంటాడు. తనను గురుకులానికి పంపమని తల్లిదండ్రులను అడుగుతాడు. ఆ మాట విని తల్లి భోరున ఏడుస్తుంది. తండ్రి కంటనీరు పెడతాడు. చదువుకోవడానికి పంపమంటే వారెందుకు ఏడుస్తున్నారో అర్థంకాక తరచి తరచి అడిగే సరికి, మార్కండేయుడికి గల పదహారేళ్ల అల్పాయుష్షును గురించి చెబుతారు. సహజజ్ఞానం గల మార్కండేయుడు తన మరణం గురించి భయపడడు. అయితే తల్లిదండ్రుల దు:ఖం చూడలేకపోతాడు. తనను పుట్టించిన ఆ పరమేశ్వరుడిని ప్రార్థించి, మెప్పించి దీర్ఘాయుష్షును పొందడానికి తల్లిదండ్రుల అనుమతి inతీసుకుంటాడు.
63,703

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2824661" నుండి వెలికితీశారు