ముహమ్మద్ బిన్ తుగ్లక్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 35:
 
== రాజ్య సంక్రమణ ==
1324లో గియాసుద్దీన్ తుగ్లక్ లక్నౌతీపై దండయాత్రకు వెళుతూ, దేవగిరిలో ఉన్న రాకుమారుడు ఉలుఘ్‌ఖాన్ ను వెనక్కి రప్పించి తన తరుఫున రాజ్యవ్యవహారాలను చూసుకునేందుకు రాజప్రతినిధిగా ఢిల్లీలో నియమించి వెళ్ళాడు. 1325లో బెంగాల్ దండయాత్రనుండి తిరిగివస్తున్న గియాసుద్ధీన్ తుగ్లక్ ను ఆహ్వానించటానికి ఢిల్లీ శివార్లలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక పెద్ద ఎత్తైన వేదిక ఏర్పాటు చేశాడు. అయితే ఊరేగింపు జరిగేటప్పుడు ఏనుగు తగిలితే మొత్తం కూలేటట్లు దాని రూపకల్పన జరిగింది. వేదిక పథకం ప్రకారం గియాసుద్ధీన్ పై కూలి ఆయన మరణించడంతో మహమ్మద్ బిన్ తుగ్లక్‌కు రాజ్యం సంక్రమించింది. కాకతీయ ప్రతాపరుద్రుడి రాజ్యం అంతమైన తరువాత అదే దుర్జయ వంశీయుడైన ముసునూరి ప్రోలయ్య నాయుడితో గోదావరిలో జిల్లాలో జరిగిన యుద్దాల్లో ఘియాజుద్దీన్ తుగ్లక్ మరణించాడని అసలయిన వాస్తవంగా ఎక్కువ మంది చరిత్రకారులు చెపుతున్నారు. దీనికి కారణం తూర్పు పచ్చిమ గొదావరి జిల్లాలోని దేవాలయాలను ధ్వంశం చేస్తున్న తుగ్లక్ పై ఆగ్రహించిన ప్రోలభూపతి 75 మంది సామంతులను ఏకం చేసి కత్తిసాము, కర్రసాము, గుర్రపుస్వారి, గజ శిక్షణ తదితర అస్త్ర శస్త్ర విద్యాలను నేర్పి కాపుగాసి గొదావరి జిల్లాలోని డిల్లీ సుల్తానుల పై గెరిలా యుద్ద బేరితో విరుచుపడ్డాడు (విలస, గురుజ, అనితల్లి, పెంటపాడు శాసనాలు వీరు డిల్లీ సుల్తానులతో జరిపిన యుద్ధబేరిని తెలియ జేస్తాయి). మరో కథనం ప్రకారం తనయుడు ఒక చెక్క బాల్కనీ కట్టించి అది తండ్రిపై కూలేట్టు చేశాడని చెబుతారు. ఘియాసుద్దీన్ తుగ్లక్ గోదావరి జిల్లాలో జరిగిన యుద్దంలో ముసునూరి ప్రోలయ్య నాయుడు సంహరించి వుంటాడనేది అవగతం అవుతుంది దీనికి ప్రతీకారేచ్చగా బహ్మనీ సుల్తానులతో డిల్లీ సుల్తానులు చేతులు కలిపి ఇతడి తమ్ముడు కుమారుడు ముసునూరి వినాయకదేవుడిని సంహరించి ఉంటారు. ఇతడి తండ్రి ముసునూరి కాభానాయుండుని తెలింగ వాలి అని డిల్లీ సుల్తానుల ఆస్ధాన కవుల పేర్కొన్నారు అంతే కాకుండగా బుక్కరాయ ఇతడి బందు అని పేర్కొన్నారు. <ref>{{Cite web |url=http://india.mapsofindia.com/culture/monuments/tughlaqabad.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-07-12 |archive-url=https://web.archive.org/web/20080512041026/http://www.india.mapsofindia.com/culture/monuments/tughlaqabad.html |archive-date=2008-05-12 |url-status=dead }}</ref> ఈ ప్రమాదంలో తండ్రికి ప్రియ తనయుడు మరియు వారసత్వంలో జునా ఖాన్ కంటే ముందుగా ఉన్న మహుమూద్ ఖాన్ కూడా మరణించాడు. ఆ తరువాత శిధిలాలని తొలగిస్తున్నప్పుడు గియాసుద్దీన్ శరీరము మహుమూద్ ఖాన్ పైన చేయూతనిచ్చి రక్షించే ప్రయత్నం చేసినట్టు కనిపించినట్టు తారీఖ్-ఎ-ఫిరూజ్‌షాహీలో సమకాలిక చరిత్రకారుడు జియావుద్దీన్ బరానీ ఉల్లేఖించాడు<ref>Studies in Medieval Indian Architecture By R. Nath పేజీ.22 [http://books.google.com/books?id=KSiNuxJ3JeYC&pg=RA1-PA19-IA1&lpg=RA1-PA19-IA1&dq=muhammed+bin+tughlak&source=web&ots=bgm9qHTyVl&sig=DTEZP39Rpv1fZ18uGOCRkca41K8&hl=en&sa=X&oi=book_result&resnum=10&ct=result#PRA1-PA19-IA1,M1]</ref>.
 
== పరిపాలన ==