రోహిణి (నటి): కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 27:
 
== డబ్బింగు ఆర్టిస్ట్ ==
డబ్బింగు ఆర్టిస్ట్ గా చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ లకు స్వర సహాయం చేసింది. "లేచి పోదామా" అని కవ్వించే గీతాంజలి నాయిక గొంతు, "చాయ్ పిలాతే" అనే "శివ" నాయిక గొంతు రోహిణిదే. నాలుగు స్తంభాలాట సినిమాకి సహాయ దర్శకులుగా పనిచేసిన పాణి షూటింగ్లో రోహిణిని గమనించి, గీతాంజలిలో గిరిజ డబ్బింగ్ కోసం ఆర్టిస్టును వెతుకుతుంటే రోహిణిని అడగమని సలహా ఇచ్చాడట. సినిమా ఆర్టిస్టుగా బదులు డబ్బింగ్ ఆర్టిస్టుగా ముద్రపడిపోతుందేమోనని భయంతో చేయకూడదని అనుకున్నది, మణిరత్నం సినిమాలో అవకాశం కాదనలేక ఈ సినిమాకు డబ్బింగు చేసింది. గీతాంజలి తర్వాత "శివ"లో అమల పాత్రకు డబ్బింగ్ చేయమని రాంగోపాల్ వర్మ అడిగితే రోహిణి ఒప్పుకోలేదు. ఒక మూడు రీళ్ళు చూసి నచ్చితే చేయమన్నారు. అది చూసి నచ్చాక అమలకు కూడా డబ్బింగ్ చెప్పారు. ఆ సినిమా పెద్ద హిట్టై పోవడంతో ఇక అలాగే డబ్బింగు రంగంలో కొనసాగింది. ఒక్క విజయశాంతికి తప్ప దాదాపు తెలుగులో అందరు హీరోయిన్లకు డబ్బింగు చెప్పింది రోహిణి.<ref>[{{Cite web |url=http://www.telugucinema.com/c/publish/stars/rohini_interview.php |title=telugucinema.com Interview with Rohini (Telugu Text)] |website= |access-date=2013-07-02 |archive-url=https://web.archive.org/web/20130401223330/http://www.telugucinema.com/c/publish/stars/rohini_interview.php |archive-date=2013-04-01 |url-status=dead }}</ref>
 
==నటిగా గుర్తింపు==
పంక్తి 36:
సినీరంగంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే బుల్లితెరలో ప్రవేశించింది. వివిధ సీరియల్ కథలకు స్క్రిప్టులు రాశారు. "వీరుక్కు నీర్" అనే టెలీ ఫిల్మ్‌ కోసం అమెకు 2005లో సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వరించింది.<ref>[http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/0802/13/1080213016_1.htm నటి రోహిణి సృజనకు ప్రతిరూపం "సైలెంట్ హ్యూస్" - వెబ్ దునియా 14 ఫిబ్రవరి 2008]</ref>
 
రోహిణి [[ఎయిడ్స్]] వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించడానికి అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నది.<ref>http://www.hindu.com/mp/2004/01/07/stories/2004010700480400.htm</ref><ref>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/mp/2005/11/26/stories/2005112600660400.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-05-13 |archive-url=https://web.archive.org/web/20080323154953/http://www.hinduonnet.com/thehindu/mp/2005/11/26/stories/2005112600660400.htm |archive-date=2008-03-23 |url-status=dead }}</ref> తమిళనాడు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డాక్టర్ ఎంజిఆర్ విశ్వవిద్యాలయం తరపున నిర్మించిన ఎయిడ్స్ అవగాహన షార్ట్‌ ఫిల్మ్స్‌కు ఆమె దర్శకత్వం వహించింది. అంతేకాకుండా సామాజిక అంశాలను ప్రతిబింభించే అంశాలపై చర్చా వేదికలు నిర్వహించింది.
 
స్వయంగా బాల్యనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రోహిణి బాల్యనటుల అంతరంగంపై "సైలెంట్ హ్యూస్" అనే 52 నిమిషాల నిడివి కల డాక్యుమెంటరీని నిర్మించి దర్శకత్వం వహించింది.<ref>http://www.hindu.com/2008/01/09/stories/2008010957170200.htm</ref><ref>{{Cite web |url=http://www.indianfilmfestival.org/movies08/silenthues.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-05-13 |archive-url=https://web.archive.org/web/20090415172551/http://www.indianfilmfestival.org/movies08/silenthues.html |archive-date=2009-04-15 |url-status=dead }}</ref>
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/రోహిణి_(నటి)" నుండి వెలికితీశారు