కాంచీపురం: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 49:
[[దస్త్రం:Kamakshi.jpg|thumb|left|కంచి కామాక్షి అమ్మవారు]]
 
[[పార్వతి]]దేవి కంచి పట్టణంలో కామాక్షిగా పూజలు అందుకొంటున్న ఈ కంచి కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. [[ఆదిశంకరులు]] ఇక్కడ ఉన్న కామాక్షి దేవికి పూజలు జరిపారు. [[మధుర]] మీనాక్షి, [[తిరువనైకవల్]]లో ఉన్న అఖిలాండేశ్వరి, [[కాశీ]]లో ఉన్న [[విశాలాక్షి]] దేవాలయాలవలే ఈ కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది. కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరిస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింది హస్తాలతో [[చెరకు]]గడ, మరియు [[తామర (పువ్వు)|తామర]] పుష్పాన్ని మరియు [[చిలుక]]ను, పై చేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది. కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు. కామాక్షివిలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించి [[మన్మధుడు|మన్మధుని]]లో ఆవహింపజేస్తుందని, మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండటం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తులమీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు. కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రింద మట్టితో [[శివలింగం]]న్ని ప్రతిష్ఠచేసి ఈశ్వరుని పాణి గ్రహణం చేసిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు చాల ఉగ్రతతో ఉండి బలులు తీసుకొంటూ ఉంటే [[ఆదిశంకరాచార్యులు]] అమ్మవారి ఉగ్రత తగ్గించే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్రానికే పూజలు జరుగుతాయి.భగవత్ శ్రీఆదిశంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్ళవద్దని అభ్యర్థించిన కారణంగా, ఉత్సవ కామాక్షి, ప్రాంగణంలోనే ఉన్న శ్రీఆదిశంకరాచార్యులు అనుమతి తీసుకొని, ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది. ఈ [[కోవెల]] ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొనిఉంది. ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవ మూర్తిని మేలుకొలిపి, ప్రాతఃకాల నైవేధ్యం సమర్పించి హారతి ఇచ్చి, కామాక్షిదేవి ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వెళ్తారు. ఆతర్వాత కామాక్షి దేవికి ఎదురుగా గోపూజ చేస్తారు. గోపృష్ట భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు. గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలిగించి హారతి యిస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీకామాక్షిదేవి ఆలయానికి ప్రాతఃకాలం 5 గంటలకే వెళ్తే గోపూజ చూడవచ్చు.<ref>[{{Cite web |url=http://www.srikanchikamakshi.org/kanchi-temple.htm |title=కామాక్షి దేవాలయం వెబ్ సైటు నుండి] |website= |access-date=2007-08-19 |archive-url=https://web.archive.org/web/20070811233648/http://www.srikanchikamakshi.org/kanchi-temple.htm |archive-date=2007-08-11 |url-status=dead }}</ref>
 
=== వరదరాజస్వామి దేవాలయం ===
1053 సంవత్సరం [[చోళులు]] ఈ ఆలయ నిర్మాణం జరిపారని తెలుస్తోంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని [[విష్ణుకంచి]] అని పిలుస్తారు. ఇక్కడ ఈ దేవాలయంలోనే [[రామానుజాచార్యులు]] నివసించారని చెబుతారు. ఈ దేవాలయం 23 ఎకరాల సముదాయంలో ఉంది. ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బంగారు బల్లి మరియు వెండి బల్లులు ఉన్నాయి. ఈ బల్లులను తాకితే మనిషి ఒంటిమీద బల్లి పడితే కలిగే దోషం పోతుందని నమ్మకం. దేవాలయ ప్రాకారం ఉండే అన్ని పైకప్పుల మీద బల్లులు చెక్కబడి ఉంటాయి. ఇతిహాసం ప్రకారం ఇక్కడ ఒక ఋషి కుమారున్ని, అతని తండ్రి దేవతార్చనకు నీళ్ళు తీసుకొని రమ్మనగా ఆ కుమారుడు తెలియక తీసుకొని వచ్చిన ఉదకంలో బల్లి కనిపిస్తుంది. తండ్రి దానికి కోపించి కుమారున్ని బల్లిగా మారిపొమ్మని శపిస్తాడు. తరువాత కుమారుడు వేడుకొనగా ఇక్కడ బల్లిగా వెలసి, అతన్ని ముట్టుకొంటే బల్లి ఒంటి మీద పడే పాపం పోయేటట్లు ఆశీర్వదిస్తాడు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి ఈ వెండి, బంగారు బల్లులు తాకి, తమ మీద బల్లి పడితే కలిగే దోషాన్ని నివారించుకొంటారు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఆసందసరోవరం మరియు బంగారు తామర తటాకం ఉbjన్నాయి. ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో జలాంతర్భగాన [[అత్తి]] చెక్కతో చేయబడిన అత్తి దేవతా మూర్తి విగ్రహాలు ఉంటాయి. ప్రతి 40 సంవత్సరాలకొకసారి కోనేరులో నుంచి తీసి 40 రోజులు దర్శనానికి అనుమతిస్తారు. 1979వ సంవత్సరంలో అత్తి శ్రీవరదరాజ పెరుమాళును [[కోనేరు]] నుంచి బయటకి తీసి దర్శనానికి అనుమతించారు.మళ్ళీ 2019వ సంవత్సరం జూన్ నేలలో అత్తి శ్రీవరదరాజ పెరుమాళును దర్శించగలం . ఈ దేవాలయ ప్రాకారాలు పదకొండొవ శతాబ్దం తరువాత చోళ రాజులైన మెదటి [[కుత్తోంగ చోళ]], విక్రమ చోళ తరువాత విజయనగర రాజుల చేత నిర్మించబడ్డాయి మరియు పునరుద్ధించబడ్డాయి. ఈ దేవాలయంలో కూడా వెయ్యి స్తంభాల మండపం ఉంది. ఇతిహాసం ప్రకారం ఇక్కడ వరదరాజస్వామిని [[కృత యుగము]]లో [[బ్రహ్మ]], [[త్రేతా యుగము]]లో గజేంద్రుడు, [[ద్వాపరయుగము]]లో [[బృహస్పతి]], [[కలి యుగము]]లో అనంతశేషుడు పూజించారని చెబుతారు. ఈ దేవాలయ మహాత్మ్యం '''హస్తిగిరి మహాత్మ్యం'''లో వివరించబడింది. ఇక్కడ మూలవిరాట్టుగా ఉన్న వరదరాజ పెరుమాళ్ విగ్రహం అత్యంత ఎత్తైన దేవతా విగ్రహాలలో రెండవది.<ref>{{cite web|url = http://www.geocities.com/~kanchipuram/temples/varada.html|title = Kanchipuram on the web|archiveurl = https://web.archive.org/web/20000420005136/http://www.geocities.com/~kanchipuram/temples/varada.html|archivedate = 2000-04-20|website = |access-date = 2007-08-19|url-status = livedead}}</ref>.
 
== కంచి పట్టుచీరలు ==
"https://te.wikipedia.org/wiki/కాంచీపురం" నుండి వెలికితీశారు