పి. వాసు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వ్యక్తిగత జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
== వ్యక్తిగత జీవితం ==
వాసు తండ్రి పీతాంబరన్ నాయర్ ఎం. జి. ఆర్. ఎన్. టి. ఆర్ లాంటి ప్రముఖ నటులకు మేకప్ మాన్ గా పనిచేసేవాడు.<ref>{{cite news| url=http://www.hindu.com/mp/2006/09/09/stories/2006090900630100.htm | location=Chennai, India | work=The Hindu | title=In the right direction | date=9 September 2006}}</ref> తల్లి కమల. తండ్రి 30 ఏళ్ళపాటు తమిళనాడు మేకప్ కళాకారుల సంఘానికి అధ్యక్షుడుగా పనిచేశాడు. తర్వాత నిర్మాతగా మారాడు. తమిళ, తెలుగు భాషల్లో సుమారు 25 కి చిత్రాలకి పైగా నిర్మించి అప్పట్లో దక్షిణాదిలో అత్యధిక చిత్రాలు నిర్మించిన వారిలో ఒకడిగా నిలిచాడు. తన సోదరుడు సినిమాటోగ్రాఫర్ అయిన ఎం. సి. శేఖర్ తో కలిసి సినిమాలు నిర్మించేవాడు. ఎం. సి శేఖర్ సుమారు 150 చిత్రాలకు పైగా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించాడు. తండ్రి పీతాంబరన్ 2011, ఫిబ్రవరి 21 న మరణించాడు.<ref>[http://www.behindwoods.com/tamil-movie-news-1/feb-11-03/p-vasu-m-peethambaram-21-02-11.html P. Vasu's Father Peethambaram Passes Away]. Behindwoods.com (2011-02-21). Retrieved on 2012-04-20.</ref>
 
వాసు చెన్నైలో వెస్లీ స్కూల్ లో చదువుకున్నాడు. వాసు భార్య పేరు శాంతి. వీరికి శక్తి అనే కుమారుడు, అభిరామి అనే కుమార్తె ఉన్నారు. శక్తి నటుడు. ఈయనకు విద్యాసాగర్, విమల్ అనే సోదరులు, విజయలక్ష్మి, వసంత, వనజ అనే సోదరీమణులున్నారు.<ref>[http://entertainment.oneindia.in/tamil/news/2011/p-vasu-peethambaram-passes-away-220211-aid0017.html P Vasu's father Peethambaram passes away] Entertainment.oneindia.in (2011-02-22). Retrieved on 2012-04-20.</ref>
"https://te.wikipedia.org/wiki/పి._వాసు" నుండి వెలికితీశారు