జెండర్ డిస్ఫోరియా: కూర్పుల మధ్య తేడాలు

గుర్తులూ లక్షణాలూ
ఉదహరింపు పొరపాటు సరిచేసాను
పంక్తి 10:
పుట్టినపుడు మగ శిశువుగా గుర్తించిన వారికి వచ్చే జెండర్ డిస్ఫోరియాని సాధారణంగా రెండు వర్గాలుగా వర్గీకరించవచ్చు, ఒకటి చిన్నతనంలో వచ్చేది, రెండోది కౌమార్యంలో వచ్చేది. చిన్నతనంలో మొదలయ్యే జెండర్ డిస్ఫోరియా, సాధారణంగా ఆ పిల్లల నడవడికలో స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళు సాధారణంగా మగవాళ్ళకి లైంగికంగా ఆకర్షితులు అవుతారు. అయితే కుమార్యంలో మొదలయ్యే జెండర్ డిస్ఫోరియా యొక్క గుర్తులు మాత్రం సాధారణంగా చిన్నతనంలో కనిపించవు కానీ ఇతర జెండర్ లా ఉండాలి అనే కోరికలు రహస్యంగా చిన్నతనంలో ఉన్నట్టు కొంతమంది అంటుంటారు. వీళ్ళు సాధారణంగా ఆడవాళ్ళకి లైంగికంగా ఆకర్షితులౌతారు. పుట్టినపుడు ఆడ శిశువుగా గుర్తించిన వారికి వచ్చే జెండర్ డిస్ఫోరియా మాత్రం సాధారణంగా చిన్నతనంలోనే మొదలౌతుంది. వీళ్ళు కూడా సాధారణంగా ఆడవారికి లైంగికంగా ఆకర్షితులౌతారు.<ref name=dsm5>{{Cite book |title=Diagnostic and Statistical Manual of Mental Disorders |last= |first= |publisher=American Psychiatric Publishing |year=2013 |isbn=978-0-89042-554-1 |edition=Fifth |location=Arlington, VA |pages=451–460}}</ref><ref name="Guillamon">{{cite journal | vauthors = Guillamon A, Junque C, Gómez-Gil E | title = A Review of the Status of Brain Structure Research in Transsexualism | journal = Archives of Sexual Behavior | volume = 45 | issue = 7 | pages = 1615–48 | date = October 2016 | pmid = 27255307 | pmc = 4987404 | doi = 10.1007/s10508-016-0768-5 }}</ref>
 
ఇతర లింగానికి చెందిన పిల్లలు మామూలుగా ఆడుకునే బొమ్మలు, ఆటలు ఆడాలనుకోవడం మరియు వారి స్వంత జననాంగాలపై విపరీతమైన ద్వేషం ఉండటం లాంటివి చిన్నపిల్లలలో జెండర్ డిస్ఫోరియా యొక్క లక్షణాలు.<ref name="DSM5">{{cite book |author1=American DSM5Psychiatry Association |title=Diagnostic and Statistical Manual of Mental Disorders (DSM-5) |date=2013 |publisher=American Psychiatric Publishing |location=Washington, DC and London |isbn=978-0-89042-555-8 |pages=451–460 |edition=5th}}</ref> ఈ సమస్య ఉన్న కొంతమంది పిల్లలను ఇతర పిల్లలు దూరం పెట్టడం, ఒంటరితనం మరియు డిప్రెషన్ లాంటివి మానసికంగా కృంగదీయవచ్చు.<ref name="Davidson-2012">{{Cite book |title=A Nurse's Guide to Women's Mental Health |last=Davidson |first=Michelle R. |publisher=Springer Publishing Company |year=2012 |isbn=978-0-8261-7113-9 |page=114}}</ref> అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రకారం ట్రాన్స్ జెండర్ పిల్లలు వాళ్ళు చదువుకునే స్కూల్లు మరియు ఇతర ప్రదేశాలలో విపరీతమైన వివక్ష, వేధింపులు మరియు హింసని ఎదుర్కోవాల్సి వస్తోంది.<ref>{{cite web | title=Resolution on transgender, gender identity, and gender expression non-discrimination| author=American Psychological Association| year=2008| url = https://www.apa.org/about/policy/resolution-gender-identity.pdf}}</ref>
"https://te.wikipedia.org/wiki/జెండర్_డిస్ఫోరియా" నుండి వెలికితీశారు