"గుండమ్మ కథ" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎అభివృద్ధి: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎అభివృద్ధి: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను)
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
జానపద బ్రహ్మగా పేరొందిన [[బి.విఠలాచార్య|విఠలాచార్య]] కన్నడంలో ''మనె తుంబిద హెణ్ణు'' పేరిట కుటుంబ కథాచిత్రాన్ని తెరకెక్కించాడు. చిత్ర నిర్మాణానికి విఠలాచార్య నిర్మాత, వాహినీ స్టూడియోస్ అధినేత [[బి.నాగిరెడ్డి]] సహకారం పొందాడు. ఆ కృతజ్ఞతతో నాగిరెడ్డి అడగగానే సినిమా హక్కుల్ని విఠలాచార్య ఆయనకి ఇచ్చేశాడు. ''మనె తుంబిద హెణ్ణు'' సినిమాలో గుండమ్మ అనే గయ్యాళికి, నోరుమెదపలేని భర్త ఉంటాడు. ఆమె తన సవతి కూతురుని ఓ పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళిచేస్తుంది. ఆ విషయం తెలిసిన సవతి కూతురు మేనమామ గుండమ్మపై పగబడతాడు. అతను గుండమ్మ స్వంత కూతురికి నేరాలకు అలవాటుపడ్డ జైలుపక్షికి ఇచ్చి పెళ్ళిజరిగేలా పథకం ప్రకారం చేయిస్తాడు. ఇలా సాగుతుంది ఆ సినిమా. అయితే ఇందులో గుండమ్మ కుటుంబ వ్యవహారాలు నాటకీయంగా సాగుతూ, నాగిరెడ్డికి చాలా తమాషాగా అనిపించాయి. విజయా ప్రొడక్షన్స్ చరిత్రలోనే తొలి రీమేక్ చేయడానికి అందుకే సిద్ధపడ్డాడు.<br />
కథలో చిన్న చిన్న మార్పులు చేసి [[డి.వి.నరసరాజు]]తో ట్రీట్మెంట్, మాటలు రాయించేశాడు నాగిరెడ్డి. సినిమాకు దర్శకునిగా నాగిరెడ్డి సోదరుడు [[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్.రెడ్డి]]ని అనుకున్నాడు. అయితే బి.ఎన్.రెడ్డి కళాత్మక చిత్రాల తరహా దర్శకుడు కావడమూ, ఇది ఆయన తరహా సినిమా కాకపోవడంతో పాటు బి.ఎన్.రెడ్డి లాంటి అగ్ర దర్శకుడు ఓ రీమేక్ సినిమా చేస్తే బాగోదన్న అనుమానం రావడంతో నాగిరెడ్డే వేరే దర్శకునితో చేద్దామని నిర్ణయించుకున్నాడు. [[పి.పుల్లయ్య]] దర్శకత్వం వహిస్తే బావుంటుందని, ఆయనకు నరసరాజు సిద్ధం చేసిన డైలాగ్ వెర్షన్ ఆయనకు పంపాడు. అది చదివిన పుల్లయ్య ఈ కథ, ట్రీట్మెంట్ నాకు నచ్చలేదు అని ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దాంతో సినిమా నిర్మాణం మళ్ళీ వెనుకబడింది.<br />
ఈ స్క్రిప్ట్ తన సన్నిహితుడు, సహ నిర్మాత, రచయిత అయిన [[చక్రపాణి]]కి ఇచ్చాడు నాగిరెడ్డి. చక్రపాణికి వికలాంగులు, పిచ్చివాళ్ళతో హాస్యం చేస్తూ సీన్లు నడపడం అంతగా నచ్చదు. దాంతో హీరో పిచ్చివాడు కావడమే ప్రధానమైన పాయింట్ అయిన ఈ సినిమా స్క్రిప్ట్ ఆయనకు నచ్చలేదు. కానీ గుండమ్మ కుటుంబ వ్యవహారాలు, ఆ పాత్రలు బాగా నచ్చిన నాగిరెడ్డి మాత్రం ఎలాగైనా సినిమా తీయాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నాడు. దాంతో చక్రపాణి మొత్తం స్క్రిప్టును తిరగరాసే పనిలో పడ్డాడు. [[విలియం షేక్‌స్పియర్]] రాసిన ''ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ'' నాటకంలో కథానాయికల పాత్రలను, వారి స్వభావాలను ఆధారం చేసుకుని చక్రపాణి కథను తిరగరాశాడు.<br />
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2827539" నుండి వెలికితీశారు