ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయులు తొలగించబడింది; వర్గం:పశ్చిమ బెంగాల్ వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎జీవిత చరిత్ర: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 42:
''ఈశ్వర్ చంద్ర'' [[బిర్సింగా]] గ్రామము (నేటి [[పశ్చిమ బెంగాల్]]) లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. బాల్యమంతా పేదరికముతో గడుపుతూ ఎంతో పుస్తకజ్ఞానము సంపాదించెను. తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు కావడము చేత కొడుకు కూడా ఆదే వృత్తిని అవలంబించాడు. మొదట గ్రామములో పాఠశాలలో చదివిన ఈశ్వర్ ఆ తరువాత తండ్రికి కలకత్తాలో 1828 లో ఉద్యోగము దొరకడముతో [[కలకత్తా]]కు మారెను. ఒక చుట్టము మధుసూదన్ వాచస్పతి, ఈశ్వర్ ను [[సంస్కృత కళాశాల]]కు పంపమని కోరగా అక్కడికి పంపబడెను.
 
1839 లో హిందూ న్యాయశాస్త్రములో ఉత్తీర్ణుడై [[విద్యాసాగర్]] బిరుదును పొందెను. రెండు సంవత్సరముల తరువాత [[ఫోర్ట్ విలియమ్ కాలేజి]]లో ప్రధాన సంస్కృత పండిత్ పదవిని పొందెను. అక్కడ ఆయన సంస్కృత కళాశాలలో అన్ని కులముల బాలకులకు విద్య నేర్పించాలని, మహిళలను కూడా విద్యాభ్యాసానికి ప్రోత్సహించాలని పోరాటము మొదలు పెట్టెను. ఈశ్వర్ చంద్రకు భయము లేకపోవడము చేత, ఆతను తమ వాడు (బ్రాహ్మణుడు) కావడము చేత సంస్కృత కాలేజీ యాజమాన్యమునకు ఇబ్బంది పెరిగెను.
 
1849 లో కాలేజీ నుండి రాజీనామా చేసి, అభిమానుల ప్రోద్బలముతో ఒక సంవత్సరము తరువాత విద్యా విభాగములో అతని కోసము ఏర్పరిచిన సాహిత్య టీచర్ పదవిని వరించెను. ఆతను కాలేజీలో పైన చెప్పిన మార్పులు జరుగ వలెనని కోరెను. పాఠశాల ఇన్స్‌పెక్టర్ పదవిలో 20 స్కూళ్ళను స్థాపించెను. ఆ తరువాత ఫోర్ట్ విలియమ్స్ కాలేజీ మూతబడి కలకత్తా విశ్వవిద్యాలయము ప్రారంభము కాగా విద్యాసాగర్ స్థాపక సభ్యుడయ్యెను. ఆ తరువాత సంస్కృత ప్రెస్ అత్యంత సాఫల్యము చెంది అతని శక్తులన్నిటినీ వాడుకొనెను. ఆప్పటికే ఈశ్వర్ చంద్ర మహిళల హక్కుల కొరకు పోరాటము ప్రారంభించెను.