జీన్-పాల్ సార్ట్రే: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ె → ే (2), స్వేఛ్చ → స్వేచ్ఛ
ట్యాగు: 2017 source edit
పంక్తి 33:
సార్ట్రే నవలలూ, నాటకాలే కాదు పెక్కు కథలు కూడా వ్రాశాడు.అయితే ఆచిన్న కథలను, కథలుగా ఆధునికులు, కొంతమంది సమకాలీకులు ఒప్పొకోలేదు.కారణం ఈకథలలో [[ఓ హెన్రీ]] కథలలో కనిపించే ముగింపు బిగింపు కానీ సొమర్సెట్ మాం రచనలలో కొట్టొచ్చినట్లు కనబడే కథాక్ధనంగానీ, మనకు కనిపించవు.పైగా కొన్ని కొన్ని పూర్వ సంప్రదాయాలలో కట్టుబాట్లలో సాంఘిక నిబంధనలలో చాందస మానస్తత్వాలలో పెరిగిన వారికి ఈ కథలు చదవగానే జుగుప్స, సాహిత్యమంటే భయం, సార్ట్రేమీద కోపం అనుకోకుండానే కలుగుతాయి.
ఉదాహరణకు: అది ఒక మాహానగరం లో, అనుక్షనం అరక్షణం విశ్రాంతి నెరుగని నాలుగురోడ్ల కూడలిలో, కూడలికి ఓప్రక్కగా ఎనిమిదంతస్తుల రాజ ప్రాసాదం లాంటి భవనం లో, చిట్ట చివరి అంతస్తుమీద పిట్టగోడమీదకువంగీ, కిందరోడ్డుమీద పోతున్న జనాన్ని ముఖ్యంగా ఆడవాళ్ళను, మగవాళ్ళనూ నిశితంగా పరిశీలుస్తున్న ఓయువకుడు, యువకుడిమనస్సులో కొన్నికొన్ను విషపుటూహలూ కదిలిపోతున్నాయి. ఈఆడవారినీ, మగవారినీ నగ్నదేహులను చేసి వీధులలో నడిపిస్తే... ఆయువకుడి తాపత్రయం రేణువులుగానున్న ఆస్త్రీపురుషుల జఘనభాగాలను నగ్నంగా చూడాలను. ఇంత రాక్షస ప్రవృత్తి కల ఆయువకుడి మనస్థితిని అంత రాక్షసం గానూ చిత్రిస్తాడు సార్ట్రే. ఆయువకుడు ఆతరువాత స్త్రీ సౌఖ్యాన్వేషణలో ఒక చీకటి గదిలోకి జొరబడతాడు.ఆచీకటి గదిలో పట్టపగల్లా కోటి వోల్టుల దీపాలు ప్యారిస్ నగర స్త్రీ సౌందర్యమంతా అక్కడే కుప్పపోసినట్లుంది. ఒక యువతిని ఎన్నిక చేస్తాడు ఈ ఆధునిక ఉన్మాది.ఆస్త్రీ ఆతనివైపు అర్ధంకాని కనులతొ చూస్తుంటుంది.ఇంత ధర పెట్టీ యువకుడు తన నెందుకు కొన్నట్లా అని. అతడామెను మెల్ల మెల్లగా సమీపిస్తాడు. ప్రణయక్రీడా విశేషంకన్నా, ఆతడనిమిషుడై చూడడమే ఆమెకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉన్నట్లుండి ఆమెను నగ్నదేహం కమ్మంటాడు.తదుపరి ఆగదిలో ఒక మూలనుండి మరిక మూలకు నడవమంటాడు. ఇటువంటి సంఘటనలు సార్ట్రే రచనలలో చాలా వరకు కనిపిస్తాయి. సార్ట్రే నేటి సివిలైజేషన్ మోజును సిపిలైజైషన్ గా చూపించి ఆకర్షిస్తాడు.
 
===పుస్తకాలతో- శబ్దమయం జగత్తు===
సార్ట్రే కు పుస్తకాలతో తనశబ్దప్రపంచాన్నే నిర్మించుకున్నాడు, అందుకే ఈప్రపంచం అంతా శబ్దమయం లేదా శబ్దమయం ప్రపంచం అంటాడు సార్ట్రే. తన డైరీలో పుస్తకాలతో తన జీవితానికి ఉన్న అనుబంధాన్ని ఇలా వ్రాసుకున్నాడు.
పుస్తకాలతో నాజీవితం ప్రారంభం అయ్యింది. అనుమానం ఏమీలేదు పుస్తకాలతోనే ముగుస్తుంది.మాతాతగారికి ఒక అధ్యయన మందిరం ఉండేది. అందులో పుస్తకాలు ఎక్కడపడితే అక్కడ ఉండేవి. సంవత్సరానికి ఒక్కసారిగాని వాటి దుమ్ముదులపరాదు. అదికూడా అక్టోబరు రాకముందు జరగాలి. ఇదోనిషేధం. నేను ఇంకాచహ్దవడం నేర్వకముందే నేను ఆపుస్తకాలను ముట్టుకొని పవిత్రం అయినాను. పుస్తకాలు నిలిచిన రాళ్ళనుపోలేవి. లైబ్రరీ అరల్లో ఇటుకలు పేర్చినట్లు ఉండేవి. హుందాగా ఉండేవి.మా వంశం ఆస్తిఅంతా అదేనని మాకుటుంబం అదృష్టం అంతా వాటిమీదే ఆధారపడి ఉండేదని అనుకుంటూ ఉండేవాడిని. అవి ఉన్నచోట నాకు దేవాలయం. నేను అందులో గాలిలో తేలిపోతూ ఉండేవాడిని. ఆగుడిలో పురాణస్మృతి చిహ్నాలను పోలి ఆ పుస్తకాలు అట్లా పడిఉండేవి. నేను పుట్టడం వాటికి తెలుసు. అవి అందుకు సాక్షీభుత్తలు. అట్లా నామృతిని కూడా చూస్తాయి. అవి అంత శాశ్వతమైనవి. అవి శాశ్వతమైనవి కనుక నాభవిష్యత్తు సంబంధించిన చింతనాకులేదు. జరిగిన కాలాన్ని గూర్చి నామనస్సు ఎంత శాంతంగా ఉంటుందో భవిష్యత్తుని గూర్చికూడా ఈ పుస్తకాలు నాకు అదే ధైర్యాన్నిస్తాయి. వాటి దుమ్ము నాచేతికి అంటితే చాలు నేను పునీతుణ్ణి అవితాను.
 
మాఅమ్మగది సంగతి. అది ఇంకో విధంగా ఉండేది. పుస్తకాలు అక్కడ నేలమీద పడుకొన్నట్లు పడిఉండేవి.ఆవిడ పుస్తకాల్ను బయటనుంచి, లైబ్రరీ లోంచి తెచ్చుకొనేది. రెండు పుస్తకాలను మించి ఆవిడ తీసుకురాదు. వాటిని చూస్తే ఉగాది పండుగనాడు పిల్లలకోసం తెచ్చే మిఠాయి పొట్లాలు నాకు గుర్తుకువచ్చేవి. నాలో నాకు ఇన్ని రహస్యాలు ఉన్నవి కదా! వాటికి ఇవి ఏమో కారణాలు అయినట్లు భావించేవాడిని. ప్రతిశుక్రవారం మాఅమ్మ మంచి బట్టలు వేసుకొని అట్లా బయటకు వెళ్ళేది. వాటిని తీసుకురావడానికి వెళుతున్నాము అనేది. ఎప్పుడూ అదేమాట తిరిగి వచ్చి, తలమీంచి నల్లని టోపీని, మేలుముసుగు తొలగించేది. అప్పుడు చేతి సంచిలోంచి వాటిని తీసేది. వాటిని అట్లా ఆవిడ బయటకి తీసునప్పుడల్లా ఇవి ఆపాత పుస్త్కకాలేనా? అని నాకు అనిపిస్తూ ఉండేది. ఆవిడకేమో ఆ పుస్తకాలు ఎంతో భద్రం.భద్రంగా దాచుకునేది. చూడనిచ్చేది కాదు. అప్పుడప్పుడు నా సంతోషానికి పగాలు ఉండేవికావు. అడవులను గూర్చి, మృగాలను, పక్షులనుగూర్చి పుస్తకాలు ఉన్నాయి నా లైబ్రరీలో. అవి ఎప్పుడు ఏదో కలకలం చేస్తున్నట్లు ఉంటాయి. ఎండిపోయిన కంఠాలు అన్నీను. ఒక్కసారి అట్లా చూస్తేచాలు, తాతయ్యకు అన్ని ప్రోతలు వినిపిస్తాయి. నాకు మొదట్లో వినిపించేవికావు. ఇప్పుడు అవి నాసొంతం అయ్యాక తాతయ్యలా నాకూ వినిపిస్తున్నాయి. నేను ఇప్పుడు బయట లైబ్రరీకి పోవచ్చు. అక్కడే కాలం గడపవచ్చ్చు.అక్కడ మరింత మానవ విజ్ఞానం సొరగులలో దాగి ఉంది. నేను ఇంతవాణ్ణయ్యాని అందుకు కారణం ఈ పుస్తకాలే. నా పుస్తకాలే నా ప్రపంచం అవే నా కొనసాగించే సంభాషణలు, అవే నా జంతువులు, పల్లుటూళ్ళు, జంతువులు ఉండే చోట్లు. లైబ్రరీలే నాకు సర్వస్వమూ!!అద్దంలో అది పెద్ద అద్దం. ప్రపంచమంతా అందులో అద్దబడి ఉన్నది. దాని పరిణామం దానికి ఉంది. దాని వైశాల్యం దానికి ఉంది. ఇదమిద్ధమని చెప్పడానికి దైవస్థితి అని ఒకటి ఉంటే, అట్టి దాని స్థితి దీనికీ ఉంది. నేను ఒక మహా సాహసం చేస్తున్నూను. అందులో కుర్చీలు ఎక్కడం. బల్లలు దూకడం ఘనకార్యాలు. అందులోనూ ప్రమాదాలున్నాయి. ఈ ఎక్కడంలో, ఈ దూకడంలో ఏమైనా తప్పు జరిగినా పుస్తకాలు మంచుకొండలు విరిగినట్లు ఒరిగి పడతాయి. నేను క్రిందకి త్రూలక తప్పదు. చాలా చదవని పుస్తకాలు ఇంకా ఉన్నాయి. చదివినవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేననుకుంటాను. మళ్ళే వాటి ముఖం చూడాలంటే రోజులకు రోజులు పట్టేవి. వారాలకు వారాలు గడిచేవి. ఒక్కొక్కప్పుడు పెద్ద యుద్ధాలే జరిగేవి. ఆల్బమ్ములు తెరిచేవాడిని అందులో రంగురంగుల బొమ్మలు ఉండేవి. ఒక బొమ్మ దగ్గరకు వచ్చేవాణ్ణి. వికృతమైన కీటకాలు పొడిచినట్లు ఉండేది. కళ్లముందు అవి ఒకటే ఆడేవి. వీటితో జాగ్రత్తగా పక్కకు తప్పుకు పోతూఉండేవాడిని. ఇక్కడ బోలెడన్ని రహస్యాలు అంతు పట్టేవి కావు. ఒక్కోసారి నేను వాస్కోడిగామా అయిపోయేవాడిని.విచిత్రమైన దేశాలకు పోయి, విచిత్రమైన జనాల్ని కనుక్కొనేవాడిని.
 
నామతం ఏమిటో, నాధర్మం ఏమిటో నాకు తెలిసిపోయింది. పుస్తక ప్రపంచం కన్నా నాకు వేరే ప్రపంచం తెలీది. వేరే మతం లేదు. పుస్తకం ముందు అన్నే తీసికట్టే. యేదీ ముఖ్యం కాదు అంటాడు సార్ట్రే. లైబ్రరీ నాకు దేవాలయం. నేను ఒక మతాధికారి మనవణ్ణి. ప్రపంచం యొక్క శిఖరస్థానంలో నా నివాసం. అంది కేంద్ర స్థానంలో మహా వృక్షం లాంటిది. అక్కడ నేను చెట్టుమీద పక్షి గూడు చేసుకున్నట్లు నివాసం ఏర్పాటుచేసుకున్నాను. శైశవదశలో ఉన్నపిల్లవాళ్ళలో కూడా స్త్రీ సహజమైన మెత్తని లక్షణం ఒకటి ఉంటుంది. అది ఆ వయస్సులో నాలోనూ ఉంది. మా అమ్మ నన్ను లగ్జంబర్గ్ గార్డెంస్ కు తీసుకుపోతూ ఉండేది, అప్పుడు మాత్రమే నేను అధోలోకాలకు అడుగు పెట్టడం జరుగుతుంది. కాని నా కాయం మాత్రం నాగూట్ళోనే ఉంటుంది. అదే చెట్టు మీద చిటారు కొమ్మమీద. ప్రతీ మనిషికి సహజమైన స్థానం, సహజమైన తీరు అంటూ ఉంటాయి. మరియు మనిషి ఔన్నత్యం, అభిమానం వంటివి విలువైన వస్తువులతో నిర్ణయించలేము. వీటి అన్నింటిని మనిషి శైశవదశ నిర్ణయిస్తుంది. అందరి జాతకాలు అక్కడే తేలుతాయి. అక్కడ పుస్తకాల ప్రాముఖ్యం చాలా ముఖ్యం అంటాడు సార్ట్రే.
 
==తెలుగులో సార్ట్రే==
"https://te.wikipedia.org/wiki/జీన్-పాల్_సార్ట్రే" నుండి వెలికితీశారు