భండారు సదాశివరావు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 41:
'''భండారు సదాశివరావు''' [[క్రోధన]] నామ సంవత్సరం [[జ్యేష్ఠ శుద్ధ షష్ఠి]]కి సరియైన [[1925]], [[మే 29]]వ తేదీన భండారు వీరరాజేశ్వరరావు, వెంకురామమ్మ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఐదుగురు [[అన్నదమ్ములు]], ఐదుగురు అక్కచెల్లెళ్లు. ఇతడు ఆరువేల నియోగి. పరాశర గోత్రీకుడు. [[కృష్ణా జిల్లా|కృష్ణాజిల్లా]]<nowiki/>లోని వేములపల్లి అగ్రహారం ఇతని స్వగ్రామం. ఇతడు కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో కొంతకాలం చదివాడు. తరువాత తండ్రి ఉద్యోగరీత్యా సూర్యాపేట, జనగామలలో చదువు కొనసాగించాడు. పిదప హనుమకొండ కాలేజియేట్ హైస్కూలులో చదివాడు. అనంతరం [[హైదరాబాదు]]<nowiki/>లో తన అన్న భండారు చంద్రమౌళీశ్వరరావు వద్ద ఉండి వెస్లీ స్కూలులో ఫిఫ్త్ ఫారంలో చేరాడు. ఆ తరువాత ఇస్లామియా స్కూలులో చదివాడు. ఆ సమయంలో స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జరిగిన క్విట్ ఇండియా ఊరేగింపులో పాల్గొన్న కారణంగా అరెస్టు కాబడి జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషను జైలులో 15 రోజులు డిటెన్షన్‌లో ఉన్నాడు. [[కారాగారము|జైలు]] నుండి వచ్చిన తరువాత [[వార్ధా]] వెళ్లి సర్వోదయనాయకుడు ప్రభాకర్‌జీని కలిసి అతని సలహా మేరకు విద్యనభ్యసించడానికి కాశీ వెళ్లాడు. అక్కడ ఉపకార వేతనం పొంది [[హిందీ భాష|హిందీ]] పరీక్షలు వ్రాసి సాహిత్యరత్న వరకు చదివాడు.
===ఆర్.ఎస్.ఎస్.తో అనుబంధం===
1942 లో కాశీ వెళ్లిన సదాశివరావుకు ఓరుగంటి సుబ్రహ్మణ్యంతో పరిచయమైంది. అతని ద్వారా [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్|రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో]] చేరాడు. స్వయంసేవక్‌గా కాశీలో శాఖలో శిక్షక్, ముఖ్యశిక్షక్‌గా బాధ్యతలు నిర్వహించాడు. అక్కడే ఇతడికి ఒటిసి ప్రథమవర్ష పూర్తి అయ్యింది. వరంగల్లుకు తిరిగి వచ్చి రెండవ సంవత్సరం ఒటిసిలో పాల్గొన్నాడు. తరువాత నందిగామలో ప్రచారక్‌గా నియమించబడ్డాడు. ఆర్.ఎస్.ఎస్.పై మొదటి నిషేధం సమయంలో 6 నెలలు రాజమండ్రి, బందరు జైళ్లలో నిర్భంధంలో ఉన్నాడు.నిషేధం తొలగించబడ్డాక అనంతపురం జిల్లా ప్రచారక్‌గా 8 నెలలపాటు పనిచేసి 1948లో [[జాగృతి]] పత్రికను ప్రారంభించి దానికి ఆయన సహాయ సంపాదకుడిగా సేవలందించాడు. 1952-54 మధ్యలో గుంటూరు జిల్లాలో వేర్వేరు చోట్ల ప్రచారక్‌గా ఉన్నాడు. 1954-58ల మధ్య విశాఖ ప్రచారక్‌గా నియమించబడ్డాడు. [[విశాఖవిశాఖపట్నం]]<nowiki/>లో ప్రచారక్‌గా ఉన్నప్పుడే భారత్ ట్యుటోరియల్ కాలేజీని నెలకొల్పి దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇది ఆ తరువాత భారతీయ విద్యా కేంద్రంగా మారింది. 1959లో సంఘ బాధ్యతలనుండి తప్పుకున్నాడు. ఆ విధంగా 1946 నుండి 1959వరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారకుడిగా 13 సంవత్సరాలు పనిచేశాడు.
 
===అనంతర జీవితం===
పంక్తి 72:
 
==రాజకీయరంగం==
ఆర్.ఎస్.ఎస్. ఆదేశాలమేరకు రాజకీయ రంగంలో సంఘభావాలను వ్యాప్తి చేయడానికి ఇతడు ఎన్నికల సమయంలో అనేక వేదికలపై ఉపన్యాసాలను ఇచ్చాడు. [[జనసంఘ్ పార్టీ|జనసంఘ్]] పార్టీ తరఫున కేంద్రం నుండి వచ్చిన దీనదయాళ్‌జీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, దత్తోపంత్ ఠేంగ్డీ, జగన్నాథరావు జోషీ, దేవీప్రసాద్ ఘోష్ మొదలైన నాయకులతో తిరిగి, అనేకానేక వేదికలపై వారు ఇచ్చిన ఉపన్యాసాలను [[తెలుగు]]<nowiki/>లో అనువదించేవాడు. 1971లో [[వరంగల్లు]] నుండి [[లోక్‌సభ|లోకసభ]]<nowiki/>కు నాలుగు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేశాడు. ఎమర్జన్సీ సమయంలో వరంగల్లు జైలులో ఈయన 19 నెలలు [[శిక్ష]]<nowiki/>ను అనుభవించాడు. అక్కడ సంఘకార్యకర్తలతో, కమ్యూనిస్టు నాయకులతో కూడా ఉపనిషత్ సిద్ధాంతాలను, సందేశాలను వివరించేవాడు. ఇతని వద్ద జైలులో సంస్కృత పాఠాలు నేర్చుకున్నవారిలో [[వరవరరావు]], ఎం.ఓంకార్ మొదలైనవారున్నారు.
==మరణం==
చివరి దశలో ఈయన తన చిన్నకుమారుడు దగ్గరకు అమెరికా వెళ్ళాడు. అక్కడే ఈయన [[2010]], [[ఏప్రిల్ 3]] శనివారం కన్నుమూసాడు.<ref>[http://archives.andhrabhoomi.net/state/badaaru-death-912 సాహితీ వేత్త భండారు కన్నుమూత]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
"https://te.wikipedia.org/wiki/భండారు_సదాశివరావు" నుండి వెలికితీశారు