కాశీ: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 26:
[[గంగా నది|గంగానది]], [[హిందూమతము]], హిందూస్తానీ [[సంగీతము]], పట్టు వస్త్రాల [[నేత]], [[హిందీ]] మరియు సంస్కృత పండితుల పీఠం - ఇవి వారాణసి నగరపు సంస్కృతీ చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. [[హరిశ్చంద్రుడు]], [[గౌతమ బుద్ధుడు]], [[వేదవ్యాసుడు]], [[తులసీదాసు]], [[శంకరాచార్యుడు]], [[కబీర్ దాసు]], [[ప్రేమ్‌చంద్|మున్షీ ప్రేమ్‌చంద్]], [[లాల్ బహదూర్ శాస్త్రి]], పండిట్ [[రవిశంకర్]], [[బిస్మిల్లా ఖాన్]], కిషన్ మహరాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రిక, [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] ప్రముఖులు [[వారాణసి]] నగరం లేదా దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి [[గంగా నది|గంగానది]] ఆవలివైపున రామనగరం ఉంది. వారాణసి సమీపంలో [[సారనాథ్]] బౌద్ధ క్షేత్రం ఉంది.
 
విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, [[విశాలాక్షి]] [[ఆలయం]], వారాహీమాతాలయం, తులసీ మానస మందిరం, సంకట మోచనాలయం, కాల భైరవాలయం, దుర్గా మాత [[దేవాలయం]], [[భారతమాత]] మందిరం - ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి. [[కాశీ హిందూ విశ్వవిద్యాలయం]] ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది. వారాణసిని "మందిరాల నగరం", "దేశపు ఆధ్యాత్మిక రాజధాని", "దీపాల నగరం", "విద్యా నగరం", "సంస్కృతి రాజధాని" వంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు.<ref>{{cite web |url=http://www.bhu.ac.in/varanasi.htm |title=Varanasi: The eternal city |publisher=[[Banaras Hindu University]] |accessdate=2007-02-04 |website= |archive-url=https://web.archive.org/web/20120620142336/http://www.bhu.ac.in/varanasi.htm |archive-date=2012-06-20 |url-status=dead }}</ref>
అమెరికన్ రచయిత [[మార్క్ ట్వేన్]] ఇలా వ్రాశాడు - "బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది. సంప్రదాయంకంటే పురాతనమైనది. గాధలకంటే ముందుది. వీటన్నింటినీ కలిపినా బెనారస్ నగరం కంటే తరువాతివే అవుతాయి."<ref>{{cite book |last=Twain |first=Mark |authorlink=Mark Twain |title=Following the Equator: A journey around the world |url=http://www.literaturecollection.com/a/twain/following-equator/ |accessdate=2007-02-07 |origyear=1897 |year=1898 |publisher=Hartford, Connecticut, American Pub. Co. |isbn=0404015778 |oclc=577051 |chapter=L |chapterurl=http://www.literaturecollection.com/a/twain/following-equator/51/ |archive-url=https://web.archive.org/web/20080228225229/http://www.literaturecollection.com/a/twain/following-equator/ |archive-date=2008-02-28 |url-status=dead }}</ref>
[[దస్త్రం:People on a ghat in Varanasi.jpg|right|thumb|300px|వారాణసిలో ఒక స్నాన ఘట్టం]]
పంక్తి 73:
 
=== వాతావరణం ===
వారాణసి వాతావరణం తేమగా ఉన్న సమోష్ణ వాతావరణం (humid subtropical climate). వేసవి, శీతాకాలం ఉష్ణోగ్రతల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్-అక్టోబరు మధ్య వేసవి కాలంలో ఋతుపవనాల వల్ల అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి. హిమాలయ ప్రాంతంనుండి వచ్చే చలి తెరగలు (Cold waves) కారణంగా డిసెంబరు - ఫిబ్రవరి మధ్య శీతాకాలంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. [[వేసవి కాలం|వేసవి]]<nowiki/>లో నగరం ఉష్ణోగ్రతలు 32 - 46&nbsp;°C మధ్య, చలికాలంలో 5° - 15&nbsp;°C మధ్య ఉంటాయి.<ref name=varanasiairtrip/> సగటు వర్షపాతం 1110&nbsp;మిల్లీమీటర్లు<ref name=delhitourism>{{cite web |url=http://www.delhitourism.com/varanasi-tourism/ |title=Varanasi tourism |accessdate=2006-08-18 |publisher=DelhiTourism.com}}{{Verify credibility|date=February 2008}}</ref> చలికాలంలో దట్టమైన పొగ మంచు, [[వేసవి కాలం|వేసవి]] కాలంలోలో [[:en:Loo (wind)|వడ గాడ్పులు]] ఉంటాయి.
 
నగరంలో వాతావరణ (గాలి) [[కాలుష్యం]] ఇప్పటికి అంత తీవ్రమైన సమస్య కాదు. కాని నీటి కాలుష్యం మాత్రం బాగా ఎక్కువగా ఉంది. ఇందువలనా, నది పైభాగంలో కడుతున్న ఆనకట్టల వలనా గంగానదిలో నీటి మట్టం తగ్గుతున్నది. నది మధ్యలో మట్టి మేటలు బయటపడుతున్నాయి.
"https://te.wikipedia.org/wiki/కాశీ" నుండి వెలికితీశారు