నహుషుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 1:
'''[[నహుషుడు]]''' ([[సంస్కృతం]]: नहुष) చంద్ర వంశంలో జన్మించిన [[రాజు]]. ఇతఁడు చంద్రవంశస్థుఁడు అగు ఆయువునకు స్వర్భానవియందు పుట్టినవాఁడు. పురూరవుని పౌత్రుఁడు. ఇతడు [[ప్రభ]] - ఆయువుల పుత్రుడు.ఈతని భార్య ప్రియంవద. [[ప్రియంవద]] ద్వారా [[యతి]], [[యయాతి]], సంయాతి, యాయాతి, [[ధ్రువుడు|ధ్రువులనే]] పుత్రులను కన్నతండ్రి. నహుషుడు రాజ్యపాలన చేస్తూ నూరు [[యాగాలు]] చేశాడు.(శ్రీమద్భాగవతమునందును, విష్ణుపురాణమునందును నహుషుని కొడుకులు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అని ఆఱుగురు చెప్పఁబడి ఉన్నారు)
 
[[దేవేంద్రుడు]] స్వర్గానికి అధిపతి. ఒకసారి ఇంద్రుడు [[వృత్రాసురుడు|వృత్రాసురుణ్ణి]] సంహరించాడు. అందువల్ల బ్రహ్మహత్యాదోషం పట్టుకుంది. తాను స్వర్గాధిపత్యానికి అనర్హుడన్ననుకొని ఆచూకి తెలియని సరస్సులో తామరతూడులో దాగున్నాడు. అప్పుడు స్వర్గాధిపత్యానికి అర్హులెవరా అని అలోచించి మునులతో సంప్రదించి నహుషుడే తగినవాడని నిర్ణయించి, అందుకు ఆతడంగీకరించగా [[దేవతలు]] నహుషుని స్వర్గాధిపతిని చేశారు. పదవి లభించగానే గర్వాంధుడై [[శచీదేవి]]ని కోరుకుంటాడు. ఆమె [[విష్ణువు|విష్ణు]]ముర్తిని వేడుకొనగా, ఆతని సలహా మేరకు నహుషున్ని తనవద్దకు [[సప్తర్షులు]] పల్లకీ మోయగా రమ్మని కోరుతుంది. తప్పని పరిస్థితిలో పల్లకీ మోస్తున్న సప్తర్షులలో [[అగస్త్య మహర్షి]]ని నషుషుడు కాలితో తంతాడు. అందుకు ముని నహుషున్ని పదివేల సంవత్సరాలు [[సర్పం]]గా పడివుండమని శపిస్తాడు. అగస్త్యున్ని క్షమించమని కోరగా ఎవరయితే నీ ప్రశ్నలకు జవాబిస్తారో ఆనాడే నీకు శాపవిముక్తి అని చెబుతారు. ఆనాటి నుండి నహుషుడు సర్పరూపంలో ద్వైతవనంలో తిరుగుతున్నాడు.
 
[[పాండవులు]] అరణ్యవాసం చేస్తున్న కాలంలో వారు గంధమాదన పర్వతాన్ని దాటి ద్వైతవనంలో ప్రవేశిస్తారు. అక్కడ సంచరిస్తున్న [[భీముడు|భీమున్ని]] నహుషుడు తన తోకతో బంధిస్తాడు. తమ్మున్ని వెతుక్కుంటూ [[ధర్మరాజు]] అది చూచి ఆశ్చర్యపోతాడు. అతన్ని వదిలిపెట్టమని కోరిన [[ధర్మరాజు|ధర్మరాజుని]] ప్రశ్నలకు [[సమాధానం]] చెబితే విడిచిపెడతానంటాడు. అతని ప్రశ్నలన్నింటికి సరైన సమాధానాలిచ్చిన ధర్మరాజుకు కృతజ్ఞత తెలియజేసి శాపవిముక్తుడౌతాడు.
"https://te.wikipedia.org/wiki/నహుషుడు" నుండి వెలికితీశారు