సురేష్ రైనా: కూర్పుల మధ్య తేడాలు

→‎అంతర్జాతీయ క్రికెట్: వ్యాసం విస్తరణ
పంక్తి 3:
13 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ ఆటపై దృష్టి పెట్టినాడు. చిన్న వయస్సులోనే అండర్-16 ఉత్తర ప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పదిహేనున్నర సంవత్సరాల ప్రాయంలో అండర్-19 జట్టుకు ఎంపైకై [[ఇంగ్లాండు]] పర్యటించి రెండు అర్థసెంచరీలు సాధించాడు.<ref>http://www.cricinfo.com/db/ARCHIVE/2002/OTHERS+ICC/IND-U19_IN_ENG/STATS/IND-U19_IN_ENG_JUL-AUG2002_AVS_IND-U19.html</ref> ఆ తదుపరి సంవత్సరం అండర్-17 టీం తరఫున [[శ్రీలంక]] పర్యటించాడు. [[2003]]లో 16 సంవత్సరాల వయస్సులోనే ఉత్తర ప్రదేశ్ తరఫున తొలిసారిగా [[రంజీ ట్రోఫి]] అస్సాంపై ఆడినాడు. ఆ తదనంతరం అండర్-19 ఆసియా కప్‌లో పాల్గొనడానికి [[పాకిస్తాన్]] పర్యటించాడు. [[2004]]లో అండర్-19 ప్రపంచ కప్ పోటీలలో కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఆ ప్రపంచ కప్ పోటీలలో కేవలం 38 బంతుల్లో 90 పరుగులు సాధించడమే కాకుండా మొత్తం 3 అర్థసెంచరీలు సాధించాడు. [[2005]] ప్రారంభంలో ఛాలెంజర్ సీరీస్‌కు ఎంపైకైనాడు.<ref>http://content-usa.cricinfo.com/ci/content/story/144355.html</ref> [[సచిన్ టెండుల్కర్]] గాయపడటంతో 2005 లో శ్రీలంకలో జరిగిన ఇండియన్ ఆయిల్ కప్ లో పాల్గొన్నాడు.<ref>http://content-usa.cricinfo.com/ci/content/story/213706.html</ref>
==అంతర్జాతీయ క్రికెట్==
రైనా అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభం నిరాశజనకంగా ప్రారంభమైంది. [[ముత్తయ్య మురళీధరన్]] చేతిలో గోల్డెన్ డకౌట్ అయి <ref>http://content-usa.cricinfo.com/ci/content/story/242579.html</ref> టోర్నమెంటు మొత్తం కలిపి 12.33 సగటుతో కేవలం 37 పరుగులు మాత్రమే సాధించాడు. [[సౌరవ్ గంగూలీ]] మళ్ళీ జట్టులోకి రావడంతో ఇతనికి అవకాశం రాలేదు. అప్పటి కోచ్ [[గ్రెగ్ చాపెల్]] గంగూలీని తప్పించడంతో మరియు [[మహ్మద్ కైఫ్]] కు గాయం కావడంతో భారత్ పర్యటించిన శ్రీలంకతో 5 వన్డేల సీరీస్‌లో స్థానం సంపాదించినాడు. తుది జట్టులో ఒక సారి స్థానం పొంది భారత్ గెలిచిన నాలుగవ వన్డేలో 39 (నాటౌట్) పరుగులు సాధించాడు. ఆ తరువాత గంగూలీ మళ్ళీ జట్టులో చేరడం [[గౌతం గంభీర్]] ఓపెనర్‌గా స్థానం పొందడంతో ఇతనికి అవకాశం లభించలేదు. ఇంగ్లాండుతో జరిగిన టెస్ట్ సీరీస్‌కు ఎంపైకైననూ టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు. [[ఫరీదాబాదు]]లో జరిగిన వన్డేలో 81 (నాటౌట్) పరుగులు చేసి తొలి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు. ఇదే అతని అత్యధిక వన్డే స్కోరు. ఆ తర్వాత మరో రెండు అర్థసెంచరీలు సాధించడంతో బిసిసిఐ సి-గ్రేడు (కాంట్రాక్టు) ప్రధానం చేసింది.
==వన్డే గణాంకాలు==
సురేష్ రైనా 36 వన్డేలు ఆడి 26.60 సగటుతో 612 పరుగులు సాధించాడు. అందులో 3 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 81 (నాటౌట్).
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సురేష్_రైనా" నుండి వెలికితీశారు