పరమాత్మ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 8:
ఆత్మ విషయంలో కానీ పరమాత్మ విషయంలో కానీ మనం [[చీకటి]]<nowiki/>లో ఉన్నాం. చీకటిలో ఉండటం అంటే ఏమిటంటే కన్ను ఉంటుంది, వస్తువు ఉంటుంది కానీ ఆకాన్ను వస్తువుని చూసే శక్తి చాలదు. మధ్యలో ఆవరించి ఉన్న చీకటిని తొలగించి కంటికి ఆ వస్తువుని కన్పింపజేసేట్టుగా మధ్యలో వెలుతురు కావాలి. వెలుతురునిచ్చే దీపం కావాలి. అనాదిగా అంటి పెట్టుకున్న కర్మ వాసనల దొంతరలు లెక్క లేనన్ని పేరుకొని ఉన్నాయి. మనలో జ్ఞానం సహజంగానే ఉంది కానీ, ఆ జ్ఞానాన్ని పైకి తెచ్చుకోవడానికి గురువులు తమ జ్ఞానాన్ని తోడుగా ఇచ్చి పైకి తెస్తారు. ఇదివరకు మనల్ని అడ్డే పొరలని దాటి వచ్చే శక్తిని గురువులు ఉపదేశం ద్వారా ఇస్తారు. వారి ఉపదేశం లోనికి వెళ్ళి క్రమేమి కర్మ వాసనలు తొలగుతాయి. "అధ్యాత్మ దీపమ్", దీపం కొత్తగా వస్తువులని తెచ్చి చూపదు. వస్తువు అక్కడే ఉంటుంది కానీ దీపాన్ని వెలిగించి పెట్టుకుని ఉన్నంత వరకు ఆవస్తువుని కనిపించేట్టు చేస్తుంది. [[ఆత్మ]] స్వరూపాన్ని [[పరమాత్మ]] స్వరూప స్వభావాల్ని స్పష్ట పరిచే దీపాన్ని మహర్షి వెలిగించి పెట్టాడు,
 
వేదముల సారాంశం. అది ఎంత గొప్పదైనా వేదాన్ని అనుసరించేదే కావాలి, అప్పుడే ప్రమాణయోగ్యం. అట్లాంటి దాన్నే ఉపదేశం చేసాడు. వేదం రెండు భాగాలు. పూర్వ భాగం మనం చేసే కర్మలని ప్రతిపాదిస్తుంటుంది. రెండవది మనకి ఆనందాన్ని కలిగించే బ్రహ్మ తత్వాన్ని తెలుపుతుంది. ఇవి రెండు ఒకటే శాస్త్రం. [[బ్రహ్మ]] అనేది తెలియాల్సిన తత్వం, అది తెలిసిన తర్వాత ఆ తత్వన్ని ఎట్లా పొందాలో తెలుపుతుంది రెండూ ఒకటే. కనుక ఆరాధన స్వరూపాన్ని ఒకటి ఆరాధ్య స్వరూపాన్ని ఒకటి తెలుపుతుంది. రెండు కలిపి అది [[చతుర్వేదాలు|వేదం]].
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పరమాత్మ" నుండి వెలికితీశారు