నందమూరి తారక రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| భార్య_భర్త = బసవరామ తారక రామారావు, లక్ష్మీపార్వతి
}}
[[తెలుగు]]వారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే '''నందమూరి తారక రామారావు''' ([[en:]]Nandamuri Taraka Rama Rao / NT Rama Rao / NTR) ([[1923]] [[మే 28]] - [[1996]] [[జనవరి 18]]) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. '''రామారావు''', '''ఎన్.టి.ఆర్''', '''ఎన్.టి.రామారావు''' గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, [[తెలుగు]], [[తమిళం]] మరియు [[హిందీ]] భాషలలో కలిపి దాదాపుగా 302 [[సినిమా|చిత్రాలలో]] నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. '''విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు'''గా బిరుదాంకితుడైన ఆయన, అనేక [[జానపద చిత్రాలు|జానపద]], [[సాంఘిక చిత్రాలు|సాంఘిక]] చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, [[రాముడు]], [[కృష్ణుడు]] వంటి [[పౌరాణిక చిత్రాలు|పౌరాణిక]] పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా నిలచిపోయారు. రామారావు [[1982]] లో [[తెలుగుదేశం|తెలుగుదేశం]] పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసారు. పార్టీని స్థాపించిన కేవలం 9 నెలలలోనే [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[భారత జాతీయ కాంగ్రెసు|కాంగ్రెస్ పార్టీ]] ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు [[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా]] పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచారు.
 
==బాల్యము, విద్యాభ్యాసము==