కోణార్క సూర్య దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 23:
 
==మందిర వర్ణన==
ఈ దేవాలయం, మొగసాల (An entrance hall)- రెండూనూ పీఠంపైన [[రథం]] లాగా చెక్కిఉంది. పీఠంలో 24 చక్రాలు, ఒక్కొక్కచక్రం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మొగసాలసమ్ముఖంలో ఏడుగుర్రాలు. శాస్త్రోక్తంగా సూర్యభగవానుడు సప్తాశ్వరధారూఢుడై ప్రపచంప్రపంచం చుట్టూ తిరుగుతున్నాడు. అవన్నెఅవన్ని ఇప్పుడు అంతగాలేవు. ఒరిసా దేవాలయములు నాలుగురకాలు: రేఖ, భద్ర, ఖఖారా, గౌరీయ. ఈదేవాలయమును, పూరి భువనేశ్వరాలయాలును రేఖా దేవాలయములు. కోణార్కము ఐదు రథాలమందిరము. మందిరంధ్యభాగములోమందిరం మధ్యభాగములో సుచారుకారు ఖచితమగు సింహాసనమొకటున్నది. దానిపైనసూర్యభగవానుడు. దేవాలయముతోపాటు మొగసాల ఒక తామరపూవు మీద చెక్కివున్నది. మొగసాలకు నాల్గువైపులా ద్వారాలు. ఎంతో చక్కగా లలితకళలాగు రాయిమీద సుత్తిపెట్టిచెక్కివున్నది. ఆశ్రేణీలు, తామరపువ్వులు, లతలు అవన్నీ చూస్తే రమ్యముగా ఉండును. మొగసాలమ్ముఖాన మోరొక స్వతంత్రపీఠం మీద "నాట్యమందిరం" నిర్మింపబడిఉన్నది. దీనిని కొందరు భొగమంటపమని, మరికొదరుమరికొందరు నాట్యమందిరమని అంటారు. ఎచటా అశ్లీలాలు లేవు. అన్నివైపులా నర్తకులు భాజభజంత్రీలతో దేవార్చంబచేయటం కనబడుతోంది. ఆభంగిమలు ఈనాటి భరతనాట్యకళా ప్రదర్శకులు అనుకరించటానికి ఎంతో అనుకూలమని చెప్పవచ్చును. అంతేకాదు ఈ నాట్యమందిరము తామరపువ్వులతో నిండి ఉంది. దేవార్చనకు, భూషణానికి ప్రాచీనులు ఈపువ్వులనే వాడేవారు.
 
ఈనాట్యమందిరం దగ్గిరగా ఒక పెద్దబండరాయి క్రిందపడి ఉంది. దానిమీద పెద్ద తామరపువ్వు చెక్కబడివున్నది. పూవు వ్యాసము 5 అడుగులు. పూదళాలు అప్సరసలు గానాభజానా చేస్తున్నత్లు కనిపిస్తారు. కేద్రంలో కూడా ఒక చిన్నపువ్వు. దీనిలో సూర్యభగవానుడు సప్తాశ్వరధారూఢుడై కూర్చొని ఉన్నాడు. ఇరువైపులా పరిచారికలు. చేతుల్లో పువ్వులు. శిల్పి ఎంత సూక్షంగా, రసవంతంగా చెక్కినాడో! ఈరాయి నాట్యమందిరం యొక్క గర్భముద్ర అని చెప్పుతారు.