నందమూరి తారక రామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 39:
[[తెలుగు]]వారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే '''నందమూరి తారక రామారావు''' ([[మే 28]], [[1923]] - [[జనవరి 18]], [[1996]]) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన [[ఎన్.టి.ఆర్]], [[ఎన్.టి.రామారావు]]గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, [[తెలుగు]], [[తమిళం]] మరియు [[హిందీ]] భాషలలో కలిపి దాదాపు 400 [[సినిమా|చిత్రాలలో]] నటించారు. తన [[ప్రతిభ]]<nowiki/>ను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. '''విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు'''గా బిరుదాంకితుడైన ఆయన, అనేక [[పౌరాణిక చిత్రాలు|పౌరాణిక]], [[జానపద చిత్రాలు|జానపద]], [[సాంఘిక చిత్రాలు|సాంఘిక]] చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, [[రాముడు]], [[కృష్ణుడు]] వంటి [[పౌరాణిక చిత్రాలు|పౌరాణిక]] పాత్రలతో [[తెలుగు]] వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో [[ఎన్.టి.ఆర్]] 13 [[చరిత్ర ఆధారిత చిత్రాలు|చారిత్రకాలు]], 55 [[జానపద చిత్రాలు|జానపద]], 186 [[సాంఘిక చిత్రాలు|సాంఘిక]] మరియు 44 [[పౌరాణిక చిత్రాలు|పౌరాణిక]] చిత్రాలు చేసారు. రామారావు [[1982]] [[మార్చి 29]]న [[తెలుగుదేశం]] పేరుతో ఒక [[రాజకీయ పార్టీ|రాజకీయ]] పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే [[ఆంధ్ర ప్రదేశ్]]లో [[భారత జాతీయ కాంగ్రెసు|కాంగ్రెస్ పార్టీ]] ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు [[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా]] పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు.<ref name=ntr.telugudesam />
 
==బాల్యము, విద్యాభ్యాసము==
నందమూరి తారక రామారావు [[1923]], [[మే 28]] వ తేదీన, సాయంత్రం 4:32కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని [[కృష్ణా జిల్లా]], [[పామర్రు]] మండలంలోని, [[నిమ్మకూరు]] గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య [[విజయవాడ]] మునిసిపలు ఉన్నత పాఠశాలలో చదివాడు. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరాడు. ఇక్కడ [[విశ్వనాథ సత్యనారాయణ]] తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి 'ససేమిరా' అన్నాడు. మీసాలతోటే నటించడం వలన ఆయనకు "మీసాల నాగమ్మ" అనే పేరు తగిలించారు. [[1942]] మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నాడు. వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు. తర్వాత [[గుంటూరు]] [[ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల]]లో చేరాడు. అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే [[నేషనల్ ఆర్ట్ థియేటర్]] గ్రూప్ (NAT) అనే నాటక సంస్థను స్థాపించి [[కొంగర జగ్గయ్య]], [[ముక్కామల]], [[నాగభూషణం]], [[కె.వి.ఎస్.శర్మ]] తదితరులతో [[చేసిన పాపం (నాటకం)|చేసిన పాపం]] వంటి ఎన్నో నాటకాలు ఆడాడు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి [[చిత్రకారుడు]] కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో ఆయనకు బహుమతి కూడా