అమరావతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 160:
 
==వివాదాలు==
[[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం|జగన్ ప్రభుత్వం]] నియమించిన జియన్ఆర్ కమిటీ రాజధాని వికేంద్రీకరణ ను సూచించింది. దీనిలో భాగంగా అమరావతి ని శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా మార్పు ప్రతిపాదించారు. దీనికి అమరావతి రాజధాని ప్రాంతం రైతులనుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. రిలే నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి.<ref>{{cite web |last1=వి |first1=శ్రీనివాసరావు |title=రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వికేంద్రీకరణ |url=http://www.prajasakti.com/Article/Editorial/2197030 |publisher=ప్రజాశక్తి |accessdate=28 December 2019 |archiveurl=https://web.archive.org/web/20191228062044/http://www.prajasakti.com/Article/Editorial/2197030 |archivedate=2019-12-28}}</ref> బిసిజి నివేదిక అందిన తరువాత తుది నిర్ణయం వెలువడనుంది. బిసిజి నివేదిక తరువాత హైపవర్ కమిటీ నియామకమైంది. హైపవర్ కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది. 2020 జనవరి 20 న శాసనసభలో ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రవేశపెట్టాడు. ఆ తరువాత సిఆర్డిఎ ను రద్దు చేస్తూ అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత ప్రణాళిక, అభివృద్ధి బోర్డు బిల్లును బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టాడు. తెలుగు దేశం సభ్యులను సస్పెండ్ చేసినతరువాత బిల్లులు ఆమోదం పొందాయి. అమరావతి ప్రాంత వాసుల వ్యతిరేకతను చల్లబరిచే ఉద్దేశంతో 10 సంవత్సరాల కౌలు ను 15 సంవత్సరాలకు, ఆ ప్రాంత రైతు కూలీలకు ఇచ్చే ఫించనును 2500 నుండి 5000 కు పెంచటం బిల్లులోే చేర్చారు. ప్రాంత రైతుల అసెంబ్లీ ముట్టడి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు<ref>{{Cite web |title=చలో విశాఖ! |url=https://www.andhrajyothy.com/artical?SID=1014714|date=2020-01-21|publisher=ఆంధ్రజ్యోతి}}</ref> <ref>{{Cite web |title=రాజధాని రైతులకు వరాలు |url=https://www.sakshi.com/news/andhra-pradesh/ap-government-announces-special-offers-capital-people-1257109|date=2020-01-21|publisher=సాక్షి}}</ref>. శాసనమండలిలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ ఉపసంహరణ బిల్లులపై వైకాప, తెదేపా సభ్యుల మధ్య తీవ్ర చర్చ జరిగింది. తెదేపా రూల్ 71 ను ఉపయోగించి బిల్లులను ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని చూసింది. రూల్ 71 పై చర్చ పూర్తయిన తర్వాత, బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రకటించాడు <ref>{{Cite web |title=సెలెక్టు కమిటీకి బిల్లులు|url=http://www.prajasakti.com/Article/AndhraPradesh/2203185|publisher=ప్రజాశక్తి|date=2020-01-23}}</ref>. సెలెక్ట్ కమిటీ నిర్ణయానికి కనీసం మూడు నెలలు పట్టే అవకాశంవుంది. దీనిని ఎదుర్కొనటానికి శాసనసభ శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదించింది<ref>{{Cite web |title=మండలి రద్దు తీర్మానం.. కీలక పరిణామం.. వైసీపీ సర్కార్ తాజా నిర్ణయం ఏంటంటే...|url= https://www.andhrajyothy.com/artical?SID=1021046|date=2020-01-28|publisher=ఆంధ్రజ్యోతి}}</ref>
 
కమిటీల పూర్తి నివేదికలను గోప్యంగా ఉంచడం, అనుమానాలకు దారితీసింది<ref>{{Cite web |title=బోగస్ కమిటీలు తప్పుడు నివేదికలు|url=https://www.eenadu.net/apmukyamshalu/mainnews/general/25/220018186 |publisher=ఈనాడు|date=2020-01-30}}</ref>.
"https://te.wikipedia.org/wiki/అమరావతి" నుండి వెలికితీశారు