బంగాళాఖాతం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 11:
బంగాళాఖాతం భారతదేశానికి తూర్పున ఉండటం వల్ల చాలా కాలం వరకూ "తూర్పు సముద్రం" అనీ, లేదా దాని తత్సమం అయిన ప్రాచ్యోదధి అని పిలిచేవారు. ఇప్పటికీ మన చరిత్ర పుస్తకాలలోని ఇండియా మ్యాపులలో, బ్రిటీషు వారి రాకకి పూర్వం, ఈ సముద్రాన్ని ఇదే పేరుతో సూచిస్తారు. ముఖ్యముగా గుప్తుల కాలం, విజయనగరకాలం నాటి మ్యాపులు కాని, ఆ నాటి సాహిత్యం కాని చూడండి!
 
బ్రిటీషు వారు వచ్చినప్పుడు బెంగాలు చాలా పెద్దగా ఉండేది, దానిని బెంగాలు ప్రావిన్సు అని పిలిచేవారు. ఇందులో ప్రస్తుతపు [[పశ్చిమ బెంగాల్]], [[బంగ్లాదేశ్]], ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని భాగాలు, [[ఒడిషా]] రాష్ట్రము, బీహార్‌ రాష్ట్రము, [[జార్ఖండ్]] రాష్ట్రములు అంతర్భాగములుగా ఉండేవి. ఈ పెద్ద బెంగాలు ప్రావిన్సు బెంగాలు విభజన వరకూ కొనసాగింది. తరువాత ముక్కలైంది. ఇంత పెద్ద బెంగాలు ప్రావిన్సు ఉండుటం వల్ల, దానికి కోస్తాగా చాలావరకూ ఈ సముద్రం ఉండటం వల్ల ఈ సముద్రాన్ని వారు '''బే ఆఫ్ బెంగాల్''' అని పిలిచారు. అదే స్థిరపడిపొయినది. తరువాత తెలుగులో అదే అనువాదం చెంది బంగాళాఖాతం(బెంగాల్+అఖాతం) అయినది.
 
==ఉనికి==
"https://te.wikipedia.org/wiki/బంగాళాఖాతం" నుండి వెలికితీశారు