మాయలోడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 9:
starring = [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్రప్రసాద్]],<br>[[సౌందర్య]]|
}}
'''మాయలోడు''' [[ఎస్. వి. కృష్ణారెడ్డి]] దర్శకత్వంలో 1993 లో విడుదలైన ఒక హాస్యభరిత చిత్రం. ఇందులో రాజేంద్రప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రలు పోషించారు. మనీషా ఫిల్మ్స్ పతాకంపై కె. అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రానికి 1993 లో కుటుంబ సమేతంగా కలిసి చూడదగిన చిత్రంగా నంది పురస్కారం లభించింది.
 
== కథ ==
పంక్తి 15:
 
తప్పి పోయిన పాప వీరబాబు ఇంట్లో ఉందని తెలుసుకున్న అప్పలకొండ ఆమెను తనకు అప్పగించమని కోరతాడు. దానికి వారు అంగీకరించకపోవడంతో వీరబాబు మీద కక్ష కడతాడు. పాప ఆపరేషన్ కోసం అనుకున్నంత ధనం సమకూరడంతో దానిని తీసుకోవడం కోసం పద్మనాభం దగ్గరికి వెళతాడు వీరబాబు. తన కూతురు వీరబాబును ప్రేమిస్తుందని ముందే తెలుసుకున్న ఆయన తన కూతురు అతన్ని మరిచిపోయేదాకా డబ్బులు ఇవ్వనని నిరాకరిస్తాడు. వీరబాబు కోపంతో ఆయన నోట్లో గుడ్డలు కుక్కి కత్తితో బెదిరించి కూర్చీకి కట్టేసి తన డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. చాటునుంచి ఇదంతా గమనిస్తున్న అప్పలకొండ ఆ మిగతా డబ్బును కూడా కాజేసి కత్తితో పద్మనాభాన్ని హత్య చేసి ఆ నేరాన్ని వీరబాబు మీద వేస్తాడు. వీరబాబు జైలుకి వెళతాడు. పాపకు ఆపరేషన్ ఆగిపోతుంది. కానీ పాపను జాగ్రత్తగా ఒక చోట దాచిపెడతాడు. ఈలోగా అప్పలకొండ తన రౌడీలని పంపించి పాపను చంపించాలని చూస్తాడు. కానీ వీరబాబు తన మాయలతో వారిని అడ్డుకుంటాడు. చివరికి వీరబాబు అప్పలకొండని తన ఇంద్రజాలంతో ముప్పుతిప్పలు పెట్టించి అతని చేత న్యాయస్థానంలో నిజం చెప్పించి నిర్దోషిగా విడుదలవుతాడు. పాపకు కూడా ఆపరేషన్ పూర్తై కంటి చూపు తిరిగి వస్తుంది.
 
== నిర్మాణం ==
దర్శకుడిగా ఇది ఎస్. వి. కృష్ణారెడ్డికి రెండవ చిత్రం. మొదటి సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్, సౌందర్యలే నాయకా నాయికలు.<ref>{{Cite web|url=https://www.hmtvlive.com/content/mayalodu-telugu-comedy-movie-11556|title=మన మనసుకి మాయ చేసే " మాయలోడు "!|last=arun|date=2018-11-24|website=www.hmtvlive.com|language=te|access-date=2020-02-03}}</ref>
 
== తారాగణం ==
Line 34 ⟶ 31:
* ఐ. జి గా [[సుబ్బరాయ శర్మ]]
* [[నర్సింగ్ యాదవ్]]
 
== నిర్మాణం ==
దర్శకుడిగా ఇది ఎస్. వి. కృష్ణారెడ్డికి రెండవ చిత్రం. మొదటి సినిమా [[రాజేంద్రుడు -గజేంద్రుడు]] సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్, సౌందర్యలే నాయకా నాయికలు. అప్పుడప్పుడే కథానాయికగా ఎదుగుతున్న సౌందర్యతో హాస్యనటుడైన బాబు మోహన్ తో జత కట్టించి ''చినుకు చినుకు అందెలతో'' అనే పాటకు నృతం చేయించాడు దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి. ఇదే పాటను మళ్ళీ 1994లో [[శుభలగ్నం]] సినిమాలో ఆలీ, సౌందర్యలతో చిత్రీకరించారు. <ref name="hmtv">{{Cite web|url=https://www.hmtvlive.com/content/mayalodu-telugu-comedy-movie-11556|title=మన మనసుకి మాయ చేసే " మాయలోడు "!|last=arun|date=2018-11-24|website=www.hmtvlive.com|language=te|access-date=2020-02-03}}</ref>
 
== విడుదల, ఫలితం ==
1993 లో విడుదలైన చిత్రం కొన్ని కేంద్రాల్లో 100, 175 రోజులు పూర్తి చేసుకున్నది. హైదరాబాదులోని శ్రీనివాస థియేటర్ లో రోజుకు నాలుగు ఆటల చొప్పున 252 రోజులు ప్రదర్శితమైంది. రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాల్లో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రం ఇదే.<ref name="hmtv"/>
 
== పాటలు ==
ఈ చిత్రంలోని పాటకు ఆకాష్ ఆడియో ద్వారా విడుదల అయ్యాయి.
* నీ మాయలోడిని నేనే (రచన: గూడురు విశ్వనాథ శాస్త్రి)
* చినుకు చినుకు అందెలతో చిటపట చిరుసవ్వడి (రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మాయలోడు" నుండి వెలికితీశారు