"తాతా సుబ్బరాయశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

* ధర్మ ప్రబోధము
* గురుప్రసాదం - భారతదేశంలో ఉత్తమ వ్యాకరణ గ్రంథంగా పరిగణించబడుతున్న నాగేశభట్టు వ్రాసిన "శబ్దేందుశేఖరం" అనే గ్రంథంపై ఉత్తరాది వారు చేసిన విమర్శలను ఖండిస్తూ తన వాదనా పటిమతో ఈ గ్రంథాన్ని వ్రాశాడు. ఈ గ్రంథాన్ని [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] ముద్రించి పండితలోకానికి అందించింది. అయితే ఈయన ఈ గ్రంథంలో శబ్దేందుశేఖరంలోని స్వరగంథి వరకే తన వ్యాఖ్యను వ్రాశాడు. తరువాత ఇతని శిష్యుడు పేరి వేంకటేశ్వరశాస్త్రి ''గురుప్రసాద శేషం'' పేరుతో కారకాంతం వరకూ పూర్తి చేశాడు. ఈ గ్రంథాన్ని కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రచురించింది<ref name="అక్షర నక్షత్రాలు" />.
* శబ్దరత్న వ్యాఖ్య
==సత్కారాలు==
ఇతని ప్రజ్ఞకు పట్టం కడుతూ అనేక సంస్థలు ఇతడిని సన్మానించాయి. 1912లో ఇతడు మహామహోపాధ్యాయ బిరుదును పొందాడు. ఈ బిరుదు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఈయనే. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశానికి వచ్చినప్పుడు ఇతడిని మద్రాసుకు ఆహ్వానించి తన పేరు చెక్కబడిన బంగారు కంకణాన్ని స్వయంగా ఇతని చేతికి తొడిగి గౌరవించాడు. ఇది ఒక ఆంధ్రుడికి లభించిన అపూర్వ గౌరవం. ఇతడు కాశీ, దర్భంగా, పుదుక్కోట వంటి సంస్థానాలను దర్శించి శాస్త్ర చర్చలలో పాల్గొని విజేతగా నిలిచి అనేక బహుమతులు పొందాడు. ఇతని 63వ జన్మదినం సందర్భంగా ఇతని శిష్యులు వైభవంగా గురుపూజోత్సవం నిర్వహించారు<ref name="అక్షర నక్షత్రాలు" />.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2839836" నుండి వెలికితీశారు