"మహాలయ పక్షము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[భాద్రపదమాసము]]లో కృష్ణపక్షమును '''మహాలయ పక్షము''' అందురు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని 'పితృపక్షము' అని కూడా అంటారు. [[ఉత్తరాయణము]] దేవతల కాలము గనుక ఉత్తమకాలమని, [[దక్షిణాయణము]] పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము. ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని, ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను. అట్లు చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని [[స్కాంద పురాణము]] నాగర ఖండమున కలదు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/284126" నుండి వెలికితీశారు