తల్లిలేనిపిల్ల (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
==సంక్షిప్తకథ==
వరలక్ష్మి భర్త గణేష్ జూదరి. ఎప్పుడోగాని ఇంటికి రాడు. వరలక్ష్మి తన చిన్నారి కుమార్తె మల్లికతో కన్నవారింట్లో ఉంటుంది. వరలక్ష్మికి మల్లిక అన్నా, మల్లికకు వరలక్ష్మి అన్నా పంచప్రాణాలు. భర్త అఘాయిత్యానికి గురి అయిన వరలక్ష్మి ఆసుపత్రిలో మరణిస్తుంది. ఈ విషయం మల్లికకు తెలియదు. అమ్మకోసం పరితపిస్తూ జ్వరానికి గురి అవుతుంది. తల్లి దగ్గర ఉంటేనే గాని ఆ అమ్మాయి కోలుకోదని డాక్టర్లు చెబుతారు. మల్లిక తాతగారైన భూషయ్య ఎటూ దిక్కుతోచని స్థితిలో ఉండగా అచ్చం వరలక్ష్మిలా ఉన్న ఒక అమ్మాయి మల్లిక దగ్గర కూర్చుని కనిపిస్తుంది. ఇక్కడ నుండి కథ చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతుంది<ref>{{cite news |last1=వెంకట్రావు |title=తల్లి లేని పిల్ల చిత్రసమీక్ష |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=56630 |accessdate=8 February 2020 |work=ఆంధ్రపత్రిక దినపత్రిక |date=6 March 1977}}</ref>.
అచ్చు వరలక్ష్మిలా ఉన్న అమ్మాయి పేరు చిత్ర. చిత్ర విదేశాలలో చదువుకున్న ఆధునిక యువతి. ఆమె మేనమామ, మేనమామ కొడుకు ఆమె ఆస్తిని కాజేయడానికి కుట్ర పన్నుతారు. చిత్ర బుల్‌ఫైట్‌లో మొనగాడైన వీరయ్య అనే సామాన్యుని ప్రేమిస్తుంది. కానీ మేనమామలు ఆమెను బంధిస్తారు. ఆమె తప్పించుకుని పారిపోయే క్రమంలో మేనమామ పంపిన రౌడీలు వెంబడించగా అనుకోకుండా భూషయ్య ఇంట్లోకి వస్తుంది. అప్పటి నుండి తప్పించుకోవడానికి మల్లిక తల్లి అన్నపూర్ణగా నటించాల్సి వస్తుంది. మొదట ఇష్టం లేకపోయినా రానురాను అనుబంధం పెరిగి మల్లికను విడిచిపెట్టలేని స్థితికి చేరుతుంది చిత్ర. పతాక సన్నివేశంలో మల్లికకు తన తల్లి చనిపోయిన విషయం తెలిసినా చిత్రను తన తల్లిగా అంగీకరించడం, చిత్ర మేనమామ, బావల పన్నాగాలు విఫలం అయ్యి చిత్ర వీరయ్యల వివాహంతో కథ సుఖాంతమౌతుంది<ref name="ప్రభ రివ్యూ">{{cite news |last1=రెంటాల |title=చిత్ర సమీక్ష తల్లిలేనిపిల్ల |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=49667 |accessdate=8 February 2020 |work=ఆంధ్రప్రభ దినపత్రిక |date=11 March 1977}}</ref>.
 
==మూలాలు==