బెంగుళూరు నాగరత్నమ్మ: కూర్పుల మధ్య తేడాలు

7 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: గ్రామము → గ్రామం
చి (వర్గం:కర్ణాటక ప్రముఖులు తొలగించబడింది; వర్గం:కర్ణాటక వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (clean up, replaced: గ్రామము → గ్రామం)
}}
 
'''[[బెంగుళూరు నాగరత్నమ్మ]]''' ([[నవంబరు 3]], [[1878]] - [[మే 19]], [[1952]]) భరత నాట్యానికి, [[కర్ణాటక సంగీతము]]నకు, అంతరించిపోతున్న భారతదేశ [[కళ]]లకు ఎనలేని సేవ చేసి అజరామరమైన కీర్తి సాధించిన మహా వనిత. ఏటికి ఎదురీది, పట్టుదలతో తాదలచిన [[కార్యము]]<nowiki/>లు సాధించి తరువాయి తరముల మహిళలకు ఆదర్శప్రాయురాలైన గొప్ప విదుషీమణి. భోగినిగా జీవితము ఆరంభించి, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా తన బ్రతుకు ముగించింది.
 
==జననము==
 
[[మైసూరు]] దగ్గరలోని [[నంజనగూడు]] ఒక చిన్న [[గ్రామముగ్రామం]]. అచట నాగరత్నమ్మ [[1878]] [[నవంబరు 3]] వ తేదీకి సరియైన [[బహుధాన్య]] [[కార్తీక శుద్ధ నవమి]]రోజు పుట్టలక్ష్మమ్మ అను [[దేవదాసి]]<nowiki/>కి, సుబ్బారావు అను వకీలకు జన్మించింది. ఒకటిన్నర సంవత్సరముల పిదప సుబ్బారావు తల్లీ బిడ్డలను వదిలివేశాడు. పుట్టలక్ష్మమ్మ ఎన్నోకష్టాలకు ఓర్చి, బాధలను సహించి పట్టుదలతో కూతురుని పెంచింది.
 
==బాల్యము, విద్య==
 
తల్లిప్రేమలో నాగరత్నమ్మ బాల్యము ఒడిదుడుకులు లేకుండా గడిచింది. గిరిభట్ట తమ్మయ్య అను గురువు వద్ద [[సంస్కృతము]], వివిధ [[కళలు]] నేర్చుకుంది. వయసుకు మించిన తెలివితేటలవల్ల ప్రతివిషయమూ చాలా త్వరగా ఆకళింపు చేసుకొనేది. మాతృభాష [[కన్నడము]], [[తెలుగు]], [[తమిళము]], [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] భాషలు నాగరత్నమ్మకు కొట్టిన పిండి. తొమ్మిది ఏండ్లకే గురువుని మించిన శిష్యురాలై గురువు అసూయకు గురైయింది. పుట్టలక్ష్మమ్మ కూతురిని గొప్ప విదుషీమణిగా తీర్చిదిద్దిన తరువాతే మైసూరుకు తిరిగివస్తానని ప్రతినపూని మద్రాసు (చెన్నయి) చేరింది. మంచి గురువు కోసం అన్వేషణలో కంచి, చివరకు [[బెంగళూరు]] చేరింది. అచట మునిస్వామప్ప అను [[వాయులీన]] విద్వాంసుడు నాగరత్నమ్మకు సంగీతము నేర్పుటకు అంగీకరించాడు. [[త్యాగరాజు ]] శిష్యపరంపరలోని వాలాజాపేట వేంకటరమణ భాగవతార్, ఆతని కొడుకు కృష్ణస్వామి భాగవతార్ల శిష్యుడు మునిస్వామప్ప. ఈవిధముగా నాగరత్నమ్మ జీవితము త్యాగరాజస్వామి వారి [[సేవ]]<nowiki/>తో ముడిపడింది. కిట్టణ్ణ అను వానివద్ద నాట్యాభ్యాసము, తిరువేంగడాచారి వద్ద అభినయకౌశలము నేర్చుకుంది. తల్లి కనుసన్నలలో, గురువుల పర్యవేక్షణలో నాలుగు సంవత్సరాలు కఠోర శ్రమచేసి సంగీత నాట్యాలలో నిష్ణాతురాలయింది. పుట్టలక్ష్మమ్మ ఆనందానికి అవధులు లేవు. దురదృష్ఠవశాత్తు, నాగరత్నమ్మ పదునాలుగవ ఏట తల్లి మరణించింది.
 
==రంగ ప్రవేశము==
29,434

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2842954" నుండి వెలికితీశారు