వంశధార: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 8:
 
==ఆంధ్రకు అదనపు నీరు==
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వంశధార నదినీరును అదనంగా వాడుకోవడానికని గుఱించిన ప్రాజెక్టు అడ్డంకులను ట్రిబ్యునల్ తొలగించింది. వంశధార నది ఆంధ్ర- ఒడిషా ఎల్లల్లో 29 కిలోమీటర్లు, ఆంధ్ర ప్రదేశ్‌లో 82 కిలోమీటర్లు పాఱుచున్నది. ఈ రెండు రాష్ట్రాల నడుమ 1962లో కుదిరిన ఒప్పందమునిఁబట్టి వంశధార నీటిని ఇద్దరు, చెఱి సగము (50:50 శాతం) వాడుకోవాలి. ఈ నదిపై కట్టించాల్సిన ప్రాజెక్టులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు దశలుగా విడఁగొట్టింది. మొదటి దశలో గొట్టా బ్యారేజీ, ఎడమ ప్రధాన కాల వలను కట్టించింది. 17,841 టిఎంసిల నది నీటిని వాడుకుంటోంది. అందు వల్లన 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. రెండో దశలో 16.048 టిఎంసిలతో 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే నేరడి ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీని కోసం ఒడిషాలోని 106 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుఁదల ఇవ్వనందున ఇంతకాలం జాగు జరిగింది. [[ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం]] ఈ పనిని కూడా రెండుగా విడఁదీసి మొదటి దశగా గొట్టా బ్యారేజీ నుంచి కుడి ప్రధాన కాలువ కట్టించింది. 0.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పనులు ముగించింది. ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పుతో కాట్రగడ్డ వద్ద సైడ్ వీయర్ కట్టడం చేపట్టి మరో 8 టిఎంసిలను వాడుకోవడానికి వీలుచిక్కింది:<ref>{{Cite web |url=http://www.andhrajyothy.com/node/45908#sthash.NLQhQvuW.dpuf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-12-28 |archive-url=https://web.archive.org/web/20131228061214/http://www.andhrajyothy.com/node/45908#sthash.NLQhQvuW.dpuf |archive-date=2013-12-28 |url-status=dead }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వంశధార" నుండి వెలికితీశారు