హెచ్.వి.నంజుండయ్య: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 52:
 
==జీవిత విశేషాలు==
ఇతడు తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నత స్థానానికి ఎదిగాడు. ఇతడు [[1860]] [[అక్టోబర్ 13]]వ తేదీన [[మైసూరు]]లో సుబ్బయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఒక బీద కుటుంబంలో జన్మించాడు<ref name=హెచ్.వి.నంజుండయ్య>{{cite web|last1=వెబ్ మాస్టర్|title=ಎಚ್.ವಿ. ನಂಜುಂಡಯ್ಯ|url=http://kanaja.in/?tribe_events=ಎಚ್-ವಿ-ನಂಜುಂಡಯ್ಯ|website=కణజ|publisher=కణజ|accessdate=19 November 2017}}{{Dead link|date=ఫిబ్రవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. మైసూరు మహారాజు నుండి విద్యార్థి వేతనం పొంది మైసూరులోని వెస్లియన్ హైస్కూలు, మద్రాసులోని మద్రాసు క్రిస్టియన్ కళాశాలలలో చదివి 1880లో బి.ఎ., తరువాత బి.ఎల్.,1893లో ఎం.ఎల్.పట్టాలు పుచ్చుకున్నాడు. ఇతడు 1885లో [[నంజనగూడు]]లో మున్సిఫ్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించాడు. అటు పిమ్మట [[హసన్ జిల్లా|హసన్‌]]లో అసిస్టెంట్ కమీషనర్, [[బెంగుళూరు]]లో సబ్ జడ్జి, [[శివమొగ్గ]] జిల్లా కలెక్టర్‌, మైసూరు రాజ్య ముఖ్యకార్యదర్శి, ఛీఫ్ జస్టీస్ వంటి వివిధ పదవులను చేపట్టాడు. 1916లో మైసూరు విశ్వవిద్యాలయం ప్రారంభమైనప్పుడు దానికి మొదటి ఉపకులపతిగా నియమించబడి 1920లో మరణించేవరకు ఆ పదవిలో కొనసాగాడు. ఇతడు యుక్తవయసులో ఉన్నప్పుడే ఇద్దరు భార్యలను, ఒక కుమారుని కోల్పోయాడు. తన కుమారుని స్మృత్యర్థం [[విక్టర్ హ్యూగో]] వ్రాసిన ఫ్రెంచి కవితలను "టియర్స్ ఇన్ ద డార్క్" అనే పేరుతో ఆంగ్లంలోనికి అనువదించాడు.
==సంఘసేవ==
ఇతడు తన అక్కకు సంభవించిన వైధవ్యం చూసి చలించి విధవల ఉన్నతి కోసం "విడోస్ హోమ్" ను స్థాపించాడు. హరిజనోద్ధరణ కొరకు సెంట్రల్ బోర్డింగ్ స్కూలు, హాస్టలు, కుటీర పరిశ్రమ స్థాపించాడు. స్త్రీ విద్య గురించి ప్రచారం చేశాడు. పల్లెపల్లెలో తిరిగి విద్యావసతులలోని కొఱతను గుర్తించి జాతీయ విద్యావిధానానికి పిలుపునిచ్చాడు. అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నాడు<ref name=హెచ్.వి.నంజుండయ్య />.
"https://te.wikipedia.org/wiki/హెచ్.వి.నంజుండయ్య" నుండి వెలికితీశారు