కావలి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మండలము → మండలం
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు|శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలముమండలం}}'''కావలి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]కు చెందిన ఒక పట్టణము మరియు మునిసిపాలిటీ.
 
కావలికి తూర్పు వైపున సముద్రము ఇక్కడ నుంచి 7 కి.మీ. దూరంలో ఉంది. కావలి అంటే తెలుగులో కాపలా అని అర్ధము. [[ఉదయగిరి]] రాజు తన సైన్యాన్ని ఇక్కడ మొహరించాడు అందుకే ఆ పేరు వచ్చింది. ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెద్ద మునిసిపాలిటి. [[చెన్నై]] నుంచి [[కోల్కతా|కలకత్తా]] ప్రధాన రహదారి మరియు రైల్వే మార్గములు కావలి పట్టణం గుండా వెళ్ళడం కావలి అభివృద్ధికి దోహదపడ్డాయి. కావలి ప్రకాశం జిల్లాకు అతి సమీపంలో ఉండడంతో ఇక్కడి భాష రెండు జిల్లాల కలయికగా ఉంటుంది. కావలి వస్త్ర వ్యాపారానికి చాలా పేరు గాంచింది. కావలిలో ఎన్నో బ్రిటీషువాళ్ళు కట్టించిన కట్టడాలు ఉన్నాయి. బ్రిటీష్ వారు వాటిని కావలిలో ప్రత్యేకంగా దొరికే బొంతరాయితో నిర్మించారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకో తగ్గవి, తాలూకాఫీసు, కోర్టులు, ఎ.బి.యం.స్కూలు, జిల్లా పరిషత్ (పాత బోర్డ్ ఉన్నత పాఠశాల). అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/కావలి" నుండి వెలికితీశారు