ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 626:
 
Above all these, Now what's the point of sensible blocking me? Showing [[వాడుకరి:DeepakVarma31|DeepakVarma31]] ([[వాడుకరి చర్చ:DeepakVarma31|చర్చ]]) 19:32, 13 ఫిబ్రవరి 2020 (UTC)}}
:[[వాడుకరి:DeepakVarma31|DeepakVarma31]] గారూ, నేను తెలుగు వచ్చిన వారితో తెలుగులోనే సంభాషిస్తాను. మీరు నా చర్చ పేజీలో మొదటిసారి రాసారు కాబట్టి, ఇంగ్లీషులో రాసినా, సమాధానం ఇస్తున్నాను. ఇకపై తెలుగులోనే రాయగలరు.
:మీరు రాసినదానిలో రెండు విషయాలున్నాయి -ఒకదానితో ఒకటి సంబంధమున్నవి.. 1. బొమ్మలు పెడితే తప్పేంటి? 2. నన్ను ఎందుకు నిరోధించారు?
:బొమ్మలు పెడితే తప్పేంటి?:
:* దీనికి అనుకూలంగా వాదిస్తూ మీరు చూపిన "మీరూ నేనూ పుట్టింది అక్కడినుండి కాదా", "సెక్సు రహస్యం అన్నట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారు" లాంటి వాక్యాలు అనుచితం, మీ వాదనకు సమర్ధనగా పనికిరావు కూడా. వ్యక్తిగత విషయాలు అనవసరం. ఇక ముందు అలాంటివి రాయకండి.
:* ఇంగ్లీషు వికీలో ఉన్నాయన్నారు.. [[సంభోగం]] పాత కూర్పు, [[:en:Sexual intercourse|సెక్సువల్ ఇంటర్‌కోర్సు ఇంగ్లీషు పేజీ]] రెండూ చూసానిప్పుడు.. తెలుగు పేజీలో మీరు పెట్టిన బొమ్మలు ఇంగ్లీషు పేజీలో లేవు. ఆ విధంగా మీ వాదనలో పస లేదు. అక్కడ ఉంటే ఇక్కడా పెట్టవచ్చు అనేది నా భావం కాదు. ఎందుకంటే ఎన్వికీ, తెవికీల స్థాయి ఒకటి కాదు, వాటి పాఠకులు వేరు, వారి సామాజిక నేపథ్యాలు వేరు. ఆ బొమ్మలతో కూడిన తెలుగుపేజీలు చూసినవారిలో కొందరికి తెవికీపై కలిగే అభిప్రాయం తెవికీకి అంత మంచిది కాకపోవచ్చు కూడా.
:* సచిత్ర వివరణ కోసం బొమ్మలు పెడుతున్నానన్నారు. మీరు పెట్టిన బూతు బొమ్మలు ఆ భావంలో లేవు. ఇంకా ఆ పేజీలో మరికొన్ని బొమ్మలున్నై, వాటిని తీసెయ్యలేదు, గమనించండి.
:* "..లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్‌ప్లిసిట్" అన్నారు.. ఉందా లేదా అనే దాని గురించి కాదు మనిద్దరి వాదన, ఎంత అనే దాని గురించి. కూసింత అని మీరంటున్నారు, అనుచితమైనంత అని నేనంటున్నాను.
:* పాఠ్య పుస్తకాల్లో కూడా ఇలాంటి బొమ్మలు ఉంటాయంటున్నారు. నేను ఎక్కడా చూళ్ళేదు. ఏ స్థాయి చదువులో ఉంటాయవి? ఏ పుస్తకాల్లో ఉంటాయి ఈ బూతు బొమ్మలు, వీడియోలు? నాకైతే తెలియదు. ఏ పుస్తకాల్లో ఉంటాయో చూపెడుతూ రచ్చబండలో రాయండి, సముదాయం పరిశీలన కోసం.
:* బొమ్మల్లేకుండా ఉత్త పాఠ్యంతో కూడిన పేజీలు పెట్టడం చూస్తే తెలుగు ఎడిటర్లకు వికీపీడియా గురించి అసలు అవగాహన ఉందా అనే ఆలోచన కలగవచ్చు అని రాసారు. అలా భావించే వారు తెవికీలో ఎవరూ లేరు. సముచితమైన బొమ్మలు ఉండాలనే విషయమై ఎన్నో చర్చలు జరిగాయి, బొమ్మలు పెట్టారు, పెడుతున్నారు. మీకు ఆ విషయాలేమీ తెలియకుండా చులకనగా మాట్లడుతున్నారు. అది తప్పు.
:* అసలు వికీలో రాయడం తెలుసా మీకు అని అడిగారు. నాకు బోల్డు తెలుసు అని ఎప్పుడూ అనుకోను. తెలిసింది బిందువు, తెలియనిది సింధువు అనే అనుకుంటాను.
:* "వై ద హెల్లార్యూ .. రిమూవింగ్ దెమ్?" అని రాసారు. ఈ వాక్యానికీ, "వయార్యూ రిమూవింగ్ దెమ్?" అనే వాక్యానికీ తేడా ఏంటో తెలుసా... "మర్యాద"! -అదొకటుంది, మరువకండి.
: నిరోధం ఎందుకు? - బొమ్మలను తీసేసాక, ఆ బొమ్మల ఉచితానుచితాల గురించి మీ చర్చ పేజీలో రాసాను. స్పందన లేదు. మరో సారి రాసాను. మీనుండి ఒక్కసారీ సమాధానమూ రాలేదు. రెండు సార్లూ బొమ్మలను తిరిగి పెట్టారు. చర్చించేందుకు మీరు సుముఖంగా లేరు, కానీ బొమ్మలను మాత్రం మళ్ళీ మళ్ళీ పెడుతున్నారు కాబట్టి నిరోధించక తప్పలేదు. నిరోధాన్ని పాక్షికంగానే పెట్టాను -ప్రధాన పేరుబరిలో కాకుండా ఇంకెక్కడైనా రాయగలిగేలా. మీ వాదన చెప్పేందుకు వీలుగా ఉండాలనే ఇలా చేసాను.
:నా అభిప్రాయాలు చెప్పాను, మీకు నచ్చకపోవచ్చు. ఈ విషయమ్మీద, మీ వాదనను రాయవచ్చు. అయితే ఇకపై రచ్చబండలో రాయాలని కోరుతున్నాను. అక్కడైతే సముదాయంలో మరింతమంది పరిశీలిస్తారు.భిన్నాభిప్రాయాలుండవచ్చు. వారి అభిప్రాయాల మేరకు నా నిర్ణయాన్ని సమీక్షించుకోడానికి నాకే అభ్యంతరమూ లేదు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 06:53, 15 ఫిబ్రవరి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Chaduvari" నుండి వెలికితీశారు