పదండి ముందుకు (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
శ్రీరాంపురంలో శాంతమ్మ, ఆమె కుమారుడు సత్యదేవ్ సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నారు. శాంతమ్మ పెంపుడు కొడుకు పదేళ్ళ వయసుగల అర్జున్ కూడా ఉత్సాహంతో సమరాంగణాల ఉరికాడు. మైదానంలో వేలాది ప్రజల జయజయధ్వానాలమధ్య స్తంభం ఎక్కి బ్రిటిష్ పతాకాన్ని దించివేసి, జాతీయపతాకాన్ని ఎగురవేశాడు. దిగమని చెప్పినా వినకపోతే పోలీసులు లాఠీ విసురుతారు. ఆ దెబ్బకు స్తంభం నుండి క్రిందపడి అర్జున్ గాయపడతాడు. కోర్టులో విచారణ చేసి అర్జున్‌కు శిక్ష విధిస్తారు. జైలులో ఉండగా తీవ్రమైన జ్వరం వస్తుంది. అర్జున్‌ను వదిలివేయవలసిందని ప్రజలు అధికార్లను కోరుతారు. కాని వారు అందుకు నిరాకరిస్తారు.
 
వాస్తవానికి అర్జున్ పోలీస్ డిప్యుటీ సూపరింటెండెంట్ శంకరరావు కుమారుడే.అయితే ఆ సంగతి ఆయనకు తెలియదు. అలాగే శాంతి కూడా ఆయన చెల్లెలే. ఇరవై సంవత్సరాల క్రితం ఆమెను శంకరరావు ఇంటి నుండి గెంటివేశాడు. గర్భవతి అయిన ఆమె రైలుప్రమాదంలో చిక్కుపడి భర్తకు దూరమైపోతుంది. ఆ భర్త మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు. శాంతకు మగబిడ్డ జన్మిస్తాడు. అతడే సత్యదేవ్. దొంగలు అపరహరించి వదిలివేసిన అర్జున్‌తోను, సత్యదేవ్‌తోను ఆమె జీవిస్తూ ఉంటుంది. అమరవీరుడు భగత్ సింగ్ పద్దతిలో దౌర్జన్య విప్లవోద్యమం వల్ల కానీ స్వాతంత్ర్యం సాధించలేమని సత్యదేవ్, అహింసా విధానాలనే అనుసరించాలని శాంత అభిప్రాయపడుతూ తమలో తాము ఏకీభవించలేక ఘర్షణ పడుతూ వుంటారు. ఇరవై ఏళ్ళ తర్వాత శాంత తన అన్న శంకరరావును కలుసుకుంటుంది. కాని అతడు కసిరివేస్తాడు. శంకరావు కుమార్తె సరళ, సత్యదేవ్ ఒక సందర్భంలో కలుసుకుంటారు. తాము మేనత్త మేనమామ బిడ్డలమని తెలుసుకుని ప్రేమించుకొంటారు. అయితే శంకరరావు ఆమెను సురేష్ అనే సంపన్న యువకుని ఇచ్చి పెళ్ళి చేయాలని అనుకుంటాడు. సురేష్ అవినీతి ప్రవర్తనను చూసి సరళ అతడిని పెళ్ళి చేసుకోవడానికి నిరాకరిస్తుంది. సురేష్ ధర్మారావు రెండవ భార్య కుమారుడు. సరళ తనను తిరస్కరించడంతో ఆమెపై పగబడతాడు. రాజాపురం జైలుకు మార్చబడిన అర్జున్‌ను సత్యదేవ్ ఎత్తుకుపోతూ ఉండగా పోలీసులు తుపాకీతో కాలుస్తారు. గాయపడి కూడా తప్పించుకొన్న సత్యదేవ్‌ను, అర్జున్‌ను ఆ దారిలో కారులో వస్తున్న ధర్మారావు తన కారులో ఎక్కించుకుని తన ఇంటికి తెచ్చి పోలీసుల నుండి దాచివేస్తాడు. సరళ సహాయంతో ధర్మారావు సత్యదేవ్‌ను, అర్జున్‌ని శాంత ఇంటికి చేరుస్తాడు. ఇరవై ఏళ్ళ అనంతరం అతడు తన మొదటిభార్య అయిన శాంతను తిరిగి తొలిసారిగా కలుసుకుంటాడు.
వాస్తవానికి అర్జున్ పోలీస్ డిప్యుటీ సూపరింటెండెంట్ శంకరరావు కుమారుడే.అయితే ఆ సంగతి ఆయనకు తెలియదు. అలాగే శాంతి కూడా ఆయన చెల్లెలే. ఇరవై సంవత్సరాల క్రితం ఆమెను శంకరరావు ఇంటి నుండి గెంటివేశాడు.
 
==పాటలు==