పదండి ముందుకు (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
పోలీసులు ఇంటింటినీ గాలిస్తున్న సమయంలో సత్యదేవ్,అర్జున్‌లు డి.ఎస్.పి.శంకరరావు ఇంట్లోనే దాక్కొంటారు. శంకరరావు భార్య అర్జున్ పుట్టుమచ్చను చూసి చిన్నప్పుడు దొంగలెత్తుకుపోయిన తన కుమారుడే అర్జున్ అని గుర్తించి ఆనందం పట్టలేక భర్తతో చెబుతుంది. అయితే భాందవ్యాలకంటే ఉద్యోగ ధర్మానికే ఎక్కువ విలువనిచ్చే శంకరరావు వారిని నిర్బందించడానికి ప్రయత్నిస్తాడు. కానీ వారు పారిపోతారు.
 
వారిని పోలీసులకు లొంగిపొమ్మని చెప్పడానికి వచ్చిన శాంత పోలీసు కాల్పులలో మరణిస్తుంది. శాంత మరణంతో శంకరరావుకు కనువిప్పు కలిగి తన ఉద్యోగాన్ని వదిలివేస్తాడు. అతడిని సత్యదేవ్‌ను పోలీసులు అరెస్టు చేస్తారు. శంకరరావు ఖైదు శిక్షను సంతోషంతో స్వీకరిస్తాడు<ref name="ప్రభ రివ్యూ">{{cite news |last1=రాధాకృష్ణ |title=చిత్రసమీక్ష - పదండి ముందుకు |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=46069 |accessdate=18 February 2020 |work=ఆంధ్రప్రభ దినపత్రిక |date=4 February 1962}}</ref>.
 
==పాటలు==