ప్లైస్టోసీన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భౌగోళిక కాలమానం ను తీసివేసారు; వర్గం:భూ వైజ్ఞానిక కాలమానం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 2:
'''ప్లైస్టోసీన్''' అనేది భౌగోళిక కాల మానంలో ఒక ఇపోక్. 25,80,000 సంవత్సరాల కిందటి నుండి, 11,700 సంవత్సరాల కిందటి వరకూ ఉన్న కాలమే, ప్లైస్టోసీన్. జనాంతికంగా దీన్ని మంచు యుగం అని కూడా పిలుస్తూంటారు. పదేపదే గ్లేసియేషన్లు ఏర్పడిన అత్యంత ఇటీవలి కాలమిది. ప్లైస్టోసీన్ ముగింపు, చివరి గ్లేసియల్ కాలపు ముగింపూ, [[పురావస్తు శాస్త్రం|పురావస్తు]] కాలమానం లోని [[ప్రాచీన శిలా యుగం|పాతరాతియుగపు]] ముగింపూ అన్నీ ఒకే సమయంలో జరిగాయి.
 
ప్లైస్టోసీన్, [[క్వాటర్నరీ పీరియడ్]] లోని మొదటి ఇపోక్. [[సెనోజోయిక్ ఎరా]] లోని ఆరవ ఇపోక్. ICS కాలమానంలో, ప్లైస్టోసీన్‌ను నాలుగు దశలుగా లేదా ఏజ్‌లుగా విభజించారు. గెలాసియన్, కాలాబ్రియన్, మధ్య ప్లైస్టోసీన్ (అనధికారికంగా "చిబానియన్"), ఎగువ ప్లైస్టోసీన్ (అనధికారికంగా "టరాన్టియన్").<ref name="Chiba1">{{Cite news|url=https://www.japantimes.co.jp/news/2017/11/14/national/science-health/japan-based-name-chibanian-set-represent-geologic-age-last-magnetic-shift|title=Japan-based name 'Chibanian' set to represent geologic age of last magnetic shift|date=14 November 2017|work=The Japan Times|access-date=17 March 2018}}</ref> ఈ అంతర్జాతీయ విభజనతో పాటు, వివిధ ప్రాంతీయ విభజనలు కూడా వినియోగంలో ఉన్నాయి.
 
2009 లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్ వారు ధృవీకరించిన మార్పుకు ముందు, ప్లైస్టోసీన్‌కు అంతకు ముందరి ప్లయోసీన్‌కూ మధ్య కాల సరిహద్దుగా 18.06 లక్షల సంవత్సరాల క్రితాన్ని పరిగణించేవారు. ప్రస్తుతం ఇది 25.8 లక్షల సంవత్సరాల క్రితంగా ఉంది. పాతకాలపు ప్రచురణల్లో ఈ రెంటిలో ఏ పద్ధతి నైనా అనుసరించి ఉండవచ్చు.
పంక్తి 23:
ప్లైస్టోసీన్‌లో గ్లేసియల్ చక్రాలు<ref name=":0" group="నోట్స్">హిమనదాలు విస్తరించడాన్ని ఒక ప్రధాన హిమనదీయ సంఘటనగా, "గ్లేసియల్" అని పిలుస్తారు. రెండు గ్లేసియల్‌ల మధ్య ఉండే వెచ్చటి కాలాన్ని "ఇంటర్‌గ్లేసియల్" అంటారు.
 
మళ్ళీ గ్లేసియల్ కాలంలో అంతర్గతంగా, హిమనదం కొద్దిగా పురోగమించడం, కొద్దిగా తిరోగమించడం జరుగుతూంటుంది. చిన్నపాటి పురోగతిని "స్టేడియల్"అని, రెండు స్టేడియల్‌ల మధ్య కాలాన్ని "ఇంటర్‌స్టేడియల్" అనీ పిలుస్తారు.</ref> పునరావృతమౌతూ ఉండేవి. ఆ కాలంలో ఖండాంతర హిమానీనదాలు కొన్ని చోట్ల 40 వ అక్షాంశం వరకూ విస్తరించేవి. గరిష్ట గ్లేసియల్ సమయంలో, 30% భూమి మంచుతో కప్పబడి ఉండేదని అంచనా. దీనికి తోడు, మంచు పలకల అంచు దగ్గరి నుండి పెర్మాఫ్రాస్ట్ దక్షిణదిశలో విస్తరించి, [[ఉత్తర అమెరికా]]<nowiki/>లో కొన్ని వందల కిలోమీటర్ల మేర, [[యురేషియా]]<nowiki/>లో అనేక వందల కిలోమీటర్ల మేరా కప్పివేసేది. మంచుపలకల అంచు వద్ద సగటు వార్షిక ఉష్ణోగ్రత {{Convert|-6|°C|0}}, పెర్మాఫ్రాస్ట్ అంచు వద్ద, {{Convert|0|°C|0}} ఉండేది.
 
ప్రతిసారి గ్లేసియర్లు పెరిగినపుడు 1,500 నుండి 3,000 మీటర్ల మందాన ఖండాంతర మంచు పలకలలు ఏర్పడి, సముద్రాల్లోని నీటిని పెద్ద యెత్తున మింగివేసేవి. ఫలితంగా భూమ్మీద యావత్తు సముద్ర మట్టం తాత్కాలికంగా 100 మీటర్లకు పైగా పడిపోయేది. ప్రస్తుతం ఉన్నఇంటర్‌గ్లేసియల్ లాంటి కాలాల్లో, తీరప్రాంతాలు మునిగిపోయేవి.
 
గ్లేసియేషను<ref name=":0" group="నోట్స్" /> ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా ఉండేవి. ప్లైస్టోసీన్ కాలమంతటా, అంతకు ముందరి ప్లయోసీన్ కాలం లోనూ [[అంటార్కిటికా]] మంచుతో కప్పబడి ఉండేది. [[ఆండీస్ పర్వతాలు|అండీస్]] దక్షిణ భాగాన్ని పటగోనియన్ మంచు టోపీ కప్పేసి ఉండేది. [[న్యూజీలాండ్|న్యూజిలాండ్]], టాస్మానియాల్లో హిమానీనదాలు ఉండేవి. కెన్యా పర్వతం, [[కిలిమంజారో పర్వతం]], తూర్పు, మధ్య ఆఫ్రికాలోని రువెన్జోరి పర్వతశ్రేణుల్లో ప్రస్తుతం క్షీణిస్తూన్న హిమానీనదాలు, అప్పట్లో పెద్దవిగా ఉండేవి. [[ఇథియోపియా]] పర్వతాలలోను, పశ్చిమాన అట్లాస్ పర్వతాలలోనూ హిమానీనదాలు ఉండేవి.
 
ఉత్తరార్ధగోళంలో, అనేక హిమానీనదాలు ఒకటిగా మిళితమై పోయాయి. కార్డిల్లెరన్ ఐస్ షీట్ ఉత్తర అమెరికా వాయువ్య ప్రాంతాన్ని కప్పివేసేది; తూర్పును లారెన్టైడ్ కప్పివేసేది. ఫెన్నో-స్కాండియన్ మంచు పలక గ్రేట్ బ్రిటన్‌తో సహా, ఉత్తర ఐరోపాపై కూర్చునేది; [[ఆల్ప్స్ పర్వతాలు|ఆల్ప్ పర్వతాలను]] ఆల్పైన్ మంచు పలక కప్పివేసేది. [[సైబీరియా]], ఆర్కిటిక్ షెల్ఫ్ లపై అంతటా మంచు గోపురాలు అక్కడక్కడా విస్తరించి ఉండేవి. ఉత్తర సముద్రాలు మంచుతో కప్పబడి ఉండేవి.
 
మంచు పలకలకు దక్షిణాన అవుట్‌లెట్‌లు మూసుకుపోవడంతోను, చల్లటి గాలి వలన బాష్పీభవనం మందగించడం తోనూ పెద్ద పెద్ద సరస్సులు ఏర్పడేవి. లారెన్టైడ్ ఐస్ షీట్ వెనక్కి తగ్గినప్పుడు, ఉత్తర-మధ్య ఉత్తర అమెరికా అంతటా అగస్సిజ్ సరస్సు విస్తరించి ఉండేది. ఉత్తర అమెరికా పశ్చిమాన ప్రస్తుతం ఎండిపోయిన, లేదా దాపు ఎండిపోయిన వందకు పైగా బేసిన్లు అప్పట్లో పొంగిపొర్లుతూండేవి. ఉదాహరణకు, బోన్నెవిల్లే సరస్సు ఇప్పుడు గ్రేట్ సాల్ట్ లేక్ ఉన్న చోట ఉండేది. యురేషియాలో, హిమానీనదాల నుండి ప్రవహించిన నీటితో పెద్ద సరస్సులు ఏర్పడ్డాయి. నదులు పెద్దవిగాను, చాలా ఎక్కువ ప్రవాహాలతో, మధ్యలో చిన్నచిన్న ద్వీపాలతోనూ ఉండేవి. నీరు ఆవిరవడం తగ్గిన కారణంగా ఆఫ్రికా సరస్సులు నిండు కుండల్లా ఉండేవి. మరోవైపు, ఎడారులు పొడిగాను, మరింత విస్తృతంగానూ ఉండేవి. సముద్రాల నుండి, ఇతర చోట్ల నుండి నీటి బాష్పీభవనం తగ్గడం వల్ల వర్షపాతం తక్కువగా ఉండేది.
 
ప్లైస్టోసీన్ కాలంలో, తూర్పు అంటార్కిటిక్ మంచు పలక కనీసం 500 మీటర్ల దాకా పలచబడిందని అంచనా వేసారు. చివరి హిమనదీయ గరిష్ఠం నాటి నుండి ఈ పలచబడడం 50 మీటర్ల కన్నా తక్కువ గానే ఉందని, బహుశా ఇది 14 వేల ఏళ్ళ కిందట మొదలై ఉంటుందనీ అంచనా వేసారు <ref>{{Cite journal|last=Yusuke Suganuma, Hideki Miura, Albert Zondervan, Jun'ichi Okuno|date=August 2014|title=East Antarctic deglaciation and the link to global cooling during the Quaternary: evidence from glacial geomorphology and 10Be surface exposure dating of the Sør Rondane Mountains, Dronning Maud Land|journal=Quaternary Science Reviews|volume=97|pages=102–120|bibcode=2014QSRv...97..102S|doi=10.1016/j.quascirev.2014.05.007}}</ref>
పంక్తి 108:
 
==== మిలాన్కోవిచ్ సైకిల్స్ ====
ప్లైస్టోసీన్‌ కాలపు గ్లేసియేషనులో అనేక సార్లు గ్లేసియల్, ఇంటర్‌గ్లేసియల్, స్టేడియల్, ఇంటర్‌స్టేడియల్ఇంటర్‌స్టేడియల్‌లు<ref లుname=":0" group="నోట్స్" /> ఏర్పడేవి. వాతావరణంలో ఏర్పడిన కాలానుగుణ మార్పులకు ఇవి అద్దం పడతాయి. వాతావరణ చక్రభ్రమణానికి కారణం మిలాన్కోవిచ్ సైకిల్స్ అని ప్రస్తుతం భావిస్తున్నారు. భూమి చలనాల్లో పునరావృతమయ్యే మార్పుల వల్ల భూమికి చేరే సౌర వికిరణంలో పునరావృతమౌతూ ఉండే మార్పులే మిలాన్కోవిచ్ సైకిల్స్.
 
వాతావరణ వ్యత్యాసాలకు మిలన్కోవిచ్మిలాన్కోవిచ్ చక్రాలే ఏకైక కారణం అని చెప్పే వీలు లేదు. ఎందుకంటే అవి ప్లియో-ప్లైస్టోసీన్‌ కాలం నాటి దీర్ఘకాలిక శీతలీకరణ ధోరణిని గాని, గ్రీన్‌లాండ్ ఐస్ కోర్లలో వెయ్యేళ్ల వైవిధ్యాలను గానీ ఈ చక్రాలు వివరించలేదు. 100,000, 40,000, 20,000 సంవత్సరాల ఆవర్తనంతో ఉండే గ్లేసియేషను ఘటనలను మిలాన్కోవిచ్ చక్రాలు చక్కగా వివరిస్తాయి. ఇటువంటి నమూనా ఆక్సిజన్ ఐసోటోప్ కోర్లలో కనిపించే వాతావరణ మార్పులకు సంబంధించిన సమాచారానికి సరిపోతుంది.
 
== జంతుజాలం ==
[[దస్త్రం:Ice_age_fauna_of_northern_Spain_-_Mauricio_Antón.jpg|ఎడమ|thumb| ఉన్ని మముత్, [[పలవల దుప్పి|రెయిన్ డీర్]] లను తినే గుహ సింహాలు, టార్పాన్లు మరియు, ఉన్ని ఖడ్గమృగంఖడ్గమృగాలతో సహా ఉత్తర స్పెయిన్ యొక్కస్పెయిన్‌లో ప్లైస్టోసీన్ ]]
[[దస్త్రం:Pleistocene_SA.jpg|thumb| ''మెగాథెరియం,'' రెండు ''గ్లైప్టోడాన్లతో'' సహా ప్లైస్టోసీన్ కాలపు [[దక్షిణ అమెరికా]] ]]
సముద్ర, భూ జంతుజాలాలు రెండూ ఆధునికమైనవే. అయితే [[మామత్|మామత్‌లు]], మాస్టోడాన్స్, ''డిప్రొటోడాన్'', ''స్మిలోడాన్'', [[పులి]], [[సింహం]], అరోచ్స్, చిన్న ముఖం గల ఎలుగుబంట్లు, జెయింట్ స్లోత్‌లు, ''గిగాంటోపిథెకస్'' తదితర పెద్ద క్షీరదాలు నేలపై నివసించేవి. [[ఆస్ట్రేలియా]], [[మడగాస్కర్]], [[న్యూజీలాండ్|న్యూజిలాండ్]], పసిఫిక్ ద్వీపాల వంటి ఏకాంత ప్రాంతాల్లో ఏనుగు పక్షి, మోవా, హాస్ట్ డేగ, ''క్వింకానా'', ''మెగాలానియా, మీయోలానియా'' వంటి పెద్దపెద్ద పక్షులు సరీసృపాలు వృద్ధి చెందాయి.
 
మంచు యుగాల్లో తీవ్రమైన వాతావరణ మార్పులు వృక్ష, జంతుజాలాలపై తీవ్ర ప్రభావాలు కలిగించాయి. మంచు పెరుగుతూ ముందుకు వచ్చేకొద్దీ ఖండాల్లోని విశాలమైన ప్రాంతాలు పూర్తిగా నిర్జనమై పోయేవి. చొచ్చుకు వచ్చే హిమానీనదానికి ముందు దక్షిణ దిశగా వెళ్తూ పోయే మొక్కలు, జంతువులూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. జీవన ప్రదేశం తగ్గడం, ఆహార సరఫరా తగ్గడం తీవ్రమైన వాతావరణ మార్పులు తెచ్చిపెట్టిన పెద్ద ముప్పు. ప్రధాన విలుప్త సంఘటన, ఇందులో [[మామత్|మామత్‌లు]], మాస్టోడాన్లు, సేబర్-పళ్ళ పిల్లులు, ''గ్లిప్టోడాన్లు'', ఉన్ని ఖడ్గమృగం, శివాతేరియం వంటి వివిధ జిరాఫిడ్‌లు; నేల స్లోత్‌లు, ఐరిష్ ఎల్క్, గుహ ఎలుగుబంట్లు, గోమ్‌ఫోథేర్, తోడేళ్ళు, చిన్న ముఖం గల ఎలుగుబంట్లు వంటి పెద్ద [[క్షీరదాలు]] అంతరించిపోయిన ఘటన ప్లైస్టోసీన్‌ చివర్లో మొదలై హోలోసిన్‌లో కొనసాగింది. ఈ కాలంలోనే [[నియాండర్తల్]]<nowiki/>లు కూడా అంతరించి పోయారు. ఆఖరి మంచు యుగం చివరిలో, శీతల రక్తపు జంతువులు, చెక్క ఎలుకల వంటి చిన్న క్షీరదాలు, వలస పక్షులు, తెల్లతోక జింక వంటి వేగవంతమైన జంతువులూ మెగాఫౌనా స్థానాన్ని ఆక్రమించి ఉత్తరానికి వలస వెళ్ళాయి.
 
ఈ విలుప్త ఘటనల ప్రభావం ఆఫ్రికాపై పెద్దగా లేదు. [[ఉత్తర అమెరికా|ఉత్తర అమెరికాలో]] మాత్రం చాలా తీవ్రంగా ఉంది. అక్కడ స్థానిక [[గుర్రము|గుర్రాలు]], [[ఒంటె|ఒంటెలు]] తుడిచిపెట్టుకు పోయాయి.
పంక్తి 124:
* ఆసియా భూ క్షీరద యుగాల్లో జౌకౌడియానియన్, నీహేవానియన్, యూషియన్ ఉన్నాయి.
* యూరోపియన్ భూ క్షీరద యుగాల్లో (ELMA) గెలాసియన్ (2.5–1.8 [[సంవత్సరము|మా]] ) ఉన్నాయి.
* ఉత్తర అమెరికా భూ క్షీరద యుగాల్లో (NALMA) బ్లాన్కన్ (4.75-1.8), ఇర్వింగ్టన్ (1.8-0.24) రాంకోలాబ్రియన్ (0.24-0.01) లు ఉన్నాయి. బ్లాంకన్ ప్లియోసిన్లోకి విస్తరించింది.
* దక్షిణ అమెరికా భూ క్షీరద యుగాల్లో (సల్మా) యుక్వియాన్ (2.5-1.5), ఎన్సెనాడాన్ (1.5-0.3) లుజానియాన్ (0.3-0.01) లు ఉన్నాయి. యుక్వియాన్ గణనీయంగా ప్లియోసిన్లోకి విస్తరించింది. కొత్త నిర్వచనం మాత్రం దాన్ని పూర్తిగా ప్లైస్టోసీన్‌లోనే ఉంచింది.
 
2018 జూలైలో, [[ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం|ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయ]] సహకారంతో రష్యన్ శాస్త్రవేత్తల బృందం 42,000 సంవత్సరాల క్రితం పెర్మాఫ్రాస్ట్‌లో కూరుకుపోయిన రెండు ఆడ [[నెమటోడ|నెమటోడ్‌లను]] (రౌండ్‌వార్ం అని కూడా అంటారు) తిరిగి బ్రతికించినట్లు ప్రకటించింది.<ref>{{Cite web|url=https://nypost.com/2018/07/30/scientists-just-brought-40000-year-old-worms-back-to-life/|title=శాస్త్రవేత్తలు 40,000 ఏళ్ళనాటి క్రిమికి జీవం పోసారు|last=వేనర్|first=మైక్|last2=బిజిఆర్|date=2018-07-30|website=న్యూయార్క్ పోస్ట్|language=en|url-status=live|archive-url=|archive-date=|access-date=2019-11-26}}</ref> ఆ సమయంలో ఈ రెండు నెమటోడ్లే అత్యంత పురాతనమైన జీవులు.<ref>http://siberiantimes.com/science/casestudy/news/worms-frozen-in-permafrost-for-up-to-42000-years-come-back-to-life</ref>
 
=== మానవులు ===
శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల [[మానవ పరిణామం|పరిణామం]] ప్లైస్టోసీన్ సమయంలో జరిగింది.<ref>{{Cite journal|last=Rogers|first=A.R.|last2=Jorde|first2=L.B.|year=1995|title=Genetic evidence on modern human origins|url=|journal=Human Biology|volume=67|issue=1|pages=1–36|jstor=41465052|pmid=7721272}}</ref><ref>{{Cite journal|last=Wall|first=J.D.|last2=Przeworski|first2=M.|year=2000|title=When did the human population start increasing?|journal=[[Genetics (journal)|Genetics]]|volume=155|issue=|pages=1865–1874|pmc=1461207|pmid=10924481}}</ref> ప్లైస్టోసీన్ ప్రారంభంలో ''పరాంత్రోపస్పారాంత్రోపస్'' జాతిప్రజాతి ఉనికిలో ఉంది. కాని దిగువ పాతరాతియుగం కాలానికిఅవికాలానికి అవి కనుమరుగయ్యాయి. అలాగే మానవుల తొలి పూర్వీకులూ ఉన్నారు. ప్లైస్టోసీన్‌లో ఎక్కువ భాగానికి చెందిన శిలాజ రికార్డులలో కనిపించే ఏకైక [[హోమినిని|హోమినిన్]] జాతి ''[[హోమో ఎరెక్టస్]]'' . సుమారు 18 లక్షల సంవత్సరాల క్రితం నాటి ''హోమో ఎరెక్టస్‌తో'' పాటు అషూలియన్ రాతి పనిముట్లు కూడా కనిపించాయి. ''ఎ. గార్హి'' జాతి, తొలి ''హోమో'' జాతులూ ఉపయోగించిన మరింత ప్రాచీనమైన ఓల్డోవాన్ పనిముట్ల స్థానంలో ఇవి వచ్చాయి. మధ్య పాతరాతియుగంలో ''హోమోలో'' మరింత వైవిధ్యమైన పరిణామం కనిపిస్తుంది. 2002,00,000 సంవత్సరాల క్రితం కనిపించిన ''[[హోమో సేపియన్స్]]'' కూడా ఇందులో భాగమే
 
మైటోకాన్డ్రియల్ టైమింగ్ టెక్నిక్స్ ప్రకారం, ఈమియన్ స్టేజ్ లోని మధ్య పాతరాతియుగంలో రీస్ గ్లేసియేషను తరువాత [[హోమోఆధునిక మానవుల ఇటీవలి ఆఫ్రికా సేపియన్స్మూలం|ఆధునిక మానవులు]] ఆఫ్రికా నుండి వలస]] వచ్చారు. ప్లైస్టోసీన్ చివర్లో మంచు లేని ప్రపంచం అంతటా వీరు విస్తరించారు.<ref>{{Cite journal|last=Cann|first=R.L.|last2=Stoneking|first2=M.|last3=Wilson|first3=A.C.|date=1 January 1987|title=Mitochondrial DNA and human evolution|url=|journal=Nature|volume=325|issue=6099|pages=31–36|bibcode=1987Natur.325...31C|doi=10.1038/325031a0|pmid=3025745}}</ref><ref>{{Cite journal|last=Templeton, A. R.|date=7 March 2002|title=Out of Africa again and again|url=http://www.bioguider.com/ebook/biology/pdf/Templeton_n2002.pdf|journal=[[Nature (journal)|Nature]]|volume=416|issue=6876|pages=45–51|bibcode=2002Natur.416...45T|doi=10.1038/416045a|pmid=11882887}}</ref> ఈ మానవులు అప్పటికే ఆఫ్రికా నుండి బయట పడ్డ [[పురాతన మానవులు|పురాతన మానవ]] రూపాలతో జాత్యంతర సంపర్కం చేసుకుని, పురాతన మానవ జన్యు పదార్థాన్ని ఆధునిక మానవ జన్యు కొలనులో చేర్చుకున్నారు.<ref>{{Cite journal|last=Eswarana|first=Vinayak|last2=Harpendingb|first2=Henry|last3=Rogers|first3=Alan R|date=July 2005|title=Genomics refutes an exclusively African origin of humans|journal=Journal of Human Evolution|volume=49|issue=1|pages=1–18|doi=10.1016/j.jhevol.2005.02.006|pmid=15878780}}</ref>
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ప్లైస్టోసీన్" నుండి వెలికితీశారు