గోరటి వెంకన్న: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 63:
*మా ఊరి దగ్గరున్న దుందుభి వాగు అపర గోదావరి. వానాకాలం మొదలవక ముందే, ఆశ్లేష కార్తె నుంచే అవతలి ఇవతలి ఒడ్డులను ఒరిసి పారేది. అటూఇటూ మనుషుల రాకపోకలకు వీలయ్యేదే కాదు. అందువల్ల నన్ను మూడో తరగతి తర్వాత అవతలి ఒడ్డున ఉన్న రఘురాంపల్లి గ్రామంలో హాస్టల్లో వేశారు. మా ఊళ్లో స్వేచ్ఛగా, ఆరోగ్యంగా పెరిగిన నేను అక్కడ అపరిశుభ్రమైన [[వాతావరణం]]<nowiki/>లో ఉండలేకపోయేవాణ్ని.
*ఇంకా తెల్లవారక ముందు, మూడున్నర గంటల సమయానికే మోట కొట్టే శబ్దాలు వినిపించేవి. వాటితో పాటు పాటలు, జారే నీళ్ల చప్పుడు, ఎద్దుల గిట్టల సవ్వడి - ఇవన్నీ చెవుల్లో దూరి గిలి పెట్టేవి. తెలవారుతూనే యోగి కీర్తనలు, భజనలు వినిపించేవి. తర్వాత రోజంతా బాలసంతులు, వీధి భాగవతులు, బుడబుడక్కలవాళ్లు - ఇలా ఎవరోఒకరు వస్తూనే ఉండేవారు. వాళ్లందరి నుంచీ పాటలు వినిపిస్తూనే ఉండేవి. ఇక సాయంత్రం మళ్లీ భజనలు, మేళాలు జరుగుతూ ఉండేవి. ఆలోచిస్తే, మా ఊరివాళ్లు అన్నం తినికాదు, ఆటపాటలతో బతికారు అనిపిస్తుంది. ఆత్మానందాన్ని శారీరక బలంగా మార్చుకుని జీవించారు వాళ్లు. ఆ పల్లెటూరి జీవనశైలి రాగమై నా పాటల్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. నా పాటల్లో కనిపించేది నేను అనుభవించిన జీవితం కాదు. మా ఊళ్లో నేను చూసిన జీవితం. చిన్నప్పుడు సినిమాల ప్రభావం తక్కువ మాపైన. దగ్గర్లో ఉన్న [[కల్వకుర్తి]], [[నాగర్‌కర్నూల్]] వంటి పట్టణాల్లో కొత్త సినిమాలు విడుదలైన విషయాన్ని ఇక్కడ బళ్ల మీద తిరుగుతూ చెప్పేవారు. నాకు తెలియక ఆ బండిలోనే సినిమా చూపిస్తారని అనుకునేవాణ్ని చాలారోజులు. నేను చూసిన తొలి సినిమా 'వీరాంజనేయ యుద్ధం' అని గుర్తు.
*ఒకరి ముందు చెయ్యి చాపకుండా, ఇచ్చినా తీసుకోకుండా గౌరవంగా బతికిన మా నాన్న ఒకసారి కరువును తట్టుకోలేక [[హైదరాబాదు|హైదరాబాదు‌]]<nowiki/>లో పనికి వెళ్లాడు. అక్కడ బట్టలన్నీ మట్టి కొట్టుకుపోయి, తలెత్తకుండా పనిచేస్తుంటే చూసి తట్టుకోలేకపోయి ఏడ్చేశాను.<ref>http://www.andhrajyothy.com/node/45375 {{Webarchive|url=https://web.archive.org/web/20131228061012/http://www.andhrajyothy.com/node/45375 |date=2013-12-28 }} ఆంధ్రజ్యోతి 22.12.2013</ref>
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/గోరటి_వెంకన్న" నుండి వెలికితీశారు