మీరాబాయి: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 20:
మీరాబాయి బావ మరణం తరువాత మేవాడ్‌కు విక్రమ్ సింగ్ రాజయ్యాడు. మీరాబాయి అత్తమామలు ఆమెను చంపడంకోసం చాలాసార్లు ఉరితీయడానికి ప్రయత్నించారని, మీరాకు ఒక గ్లాసు విషం, పువ్వులకు బదులుగా పాముతో ఉన్న బుట్టను పంపించారని చరిత్రకారులు తమ పరిశోధనలో పేర్కొన్నారు.<ref name=brit1/><ref name=usha13/> పాము కృష్ణ విగ్రహం (పువ్వుల దండ)గా మారడంతో ఆమెకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని హాజియోగ్రాఫిక్ ఇతిహాసాలలో చెప్పబడింది.<ref name=nancy/><ref name=usha13/>తనను తాను మునిగిపోమని విక్రమ్ సింగ్ కోరగా మీరాబాయి నీటిలో మునగగా, ఆమె నీటిలో మనగకుండా పైకి తేలిందని మరికొన్ని ఇతిహాసాలలో రాయబడింది.<ref name=usha17>Usha Nilsson (1997), Mira bai, Sahitya Akademi, {{ISBN|978-8126004119}}, pages 16-17</ref> మొఘల్ చక్రవర్తి [[అక్బర్]], మీరాబాయిని చూడడానికి [[తాన్‌సేన్]] తో వచ్చి ఆమెకు ఒక ముత్యాల హారాన్ని సమర్పించాడని మరొక చోట రాయబడింది. ఇది నిజంగా జరిగిందా లేదా అన్నదానిపై పరిశోధకులకు అనుమానాలు ఉన్నయి. ఎంటుకంటే, మీరాబాయి మరణించిన 15 సంవత్సరాల తరువాత, అనగా 1562లో అక్బర్ కోర్టులో తాన్‌సేన్ చేరాడు.<ref name=usha17/> అదేవిధంగా, కొన్నింటిలో గురు రవిదాస్ మీరాబాయి గురువు అని రాసివుంది, అయితే దీనిని ధృవీకరించే చారిత్రక ఆధారాలు లేవు. ఈ విషయం ఇతరులు అంగీకరించలేదు.<ref name=usha17/>
 
మీరాబాయి గురించి ప్రస్తావించిన మూడు వేర్వేరు పురాతన రికార్డులు అన్నీ 17వ శతాబ్దం నుండి (మీరాబాయి మరణించిన 150 సంవత్సరాలలో) వ్రాయబడ్డాయి.<ref>These are Munhata Nainsi's Khyat from [[Jodhpur]], Prem Ambodh from [[Amritsar]] and Nabhadas's Chappay from [[Varanasi]]; see: JS Hawley and GS Mann (2014), Culture and Circulation: Literature in Motion in Early Modern India (Editors: Thomas De Bruijn and Allison Busch), Brill Academic, {{ISBN|978-9004264472}}, pages 131-135</ref> వాటిల్లో ఆమె బాల్యం గురించి లేదా భోజరాజ్‌తో ఆమె వివాహం చేసుకున్న పరిస్థితుల గురించి ఏమీ ప్రస్తావించబడలేదు. ఆమెను హింసించిన వ్యక్తులు ఆమె అత్తమామలు లేదా కొంతమంది రాజ్‌పుత్ రాజకుటుంబానికి చెందినవారని కూడా పేర్కొనబడలేదు.<ref>JS Hawley and GS Mann (2014), Culture and Circulation: Literature in Motion in Early Modern India (Editors: Thomas De Bruijn and Allison Busch), Brill Academic, {{ISBN|978-9004264472}}, pages 131-135</ref>
 
== రచనలు ==
"https://te.wikipedia.org/wiki/మీరాబాయి" నుండి వెలికితీశారు