రిషికేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి గ్
పంక్తి 1:
రిషికేశ్ డెహరాడూన్ జిల్లాలోని ఒక మునిసిపాలిటీ.
==స్థల పురాణం==
 
[[బొమ్మ:Rish2.jpg|thumb|left|]]
రిషికేశ్ స్థితి కారకుడు విష్ణుమూర్తి నామాలలో ఒకటి.ఇది హిందువుల పవిత్ర క్షేత్రాలలో ఒకటి.ఇది హిమాలయాల దిగువ భాగంలో ఉంది.శ్రీరాముడు రావణ సంహారం తరవాత ఇక్కడ బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఇక్కడ పరిహార కర్మలాచరించినట్లు పురాణ కధనం.రిషికేశ్ హరిద్వార్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.హిమాలయ చార్ దామ్‌లుగా ప్రసిద్ధి చెందిన [[బద్రీనాథ్]],[[కేదార్‌నాథ్]],[[గంగోత్రి]] మరియు [[యమునోత్రి]].<br />
 
పంక్తి 8:
రిషికేశ్ పరిసర ప్రాంతంలో గంగా నదీ తీరంలో ఉన్న ఋషి వాటికలు కారణంగా ఈ ఊరికి ఈ పేరు వచ్చినట్లు విశ్వసిస్తున్నారు.ఇది వ్యాపార మరియు సమాచార కూడలిగా కూడా ప్రాముఖ్యత కలిగిన నగరం.రిషికేశ్ పరిసరాలలోని ఆకర్షణీయమైన పల్లె ఋషికీ రేటీ.శివానందనగలో స్వామి శివానందచే స్థాపించబడిన ' శివానంద ఆశ్రమం' మరియు 'డివైన్ లైఫ్ ఆఫ్ సొసైటీ' ఉన్నాయి.ఉత్తర రిషికేశ్,లక్ష్మణ్ ఝులా ఉత్తర భాగంలో కొంచందూరంగా ఉన్న స్వర్గ్ ఆశ్రమం దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆశ్రమాలు నీలఖంఠ మహాదేవ్ గుడి గంగానది తూర్పు తీరంలో ఉన్నాయి.నీలఖంఠ మహాదేవ్ గుడి రిషికేశ్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.త్రివేణీ ఘాట్‌లో ఇచ్చే హారతి దర్శించడానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు.<br />
 
రిషికేశ్‌లో 120 సంవత్సరాల క్రితం స్థాపించబడిన కైలాష్ ఆశ్రమ బ్రహ్మవిద్యాపీఠం ఉంది.ఇక్కడ విద్యార్ధులకు ప్రాచీన వేదవిద్యలో శిక్షణ ఇస్తారు.ఈ శిక్షణాలయంలో ప్రసిద్ధులైన స్వామి వివేకానంద,స్వామి రామతీర్ధ మరియు స్వామి శివానంద శిక్షణ తీసుకున్నారు.<br />
 
ప్రస్థుం మూసివేసిన మహేష్‌యోగి ఆశ్రమంకు 1960లలో బీటిల్స్ విదేశీ సంగీతకారుల బృందం వచ్చింది.మైక్ లవ్,ది బీచ్ బాయ్స్,డోనోవన్ మరియు జిప్ మిల్స్ లాంటి కళాకారులు ఈ నగరానికి ధ్యానం అభ్యసించటానికి వచ్చారు.సరికొత్తగా ఇక్కడకు విచ్చేసిన ప్రముఖ కాళాకారిణి హాలీవుడ్ నటి కాటే విన్స్‌లెట్.
 
==జనాభా==
"https://te.wikipedia.org/wiki/రిషికేశ్" నుండి వెలికితీశారు