పులి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
[[Category:Articles with 'species' microformats]]
'''పులి''' ''(పాంథెరా టైగ్రిస్)'' [[ఫెలిడే]] కుటుంబంలో కెల్లా అతిపెద్ద [[జాతి]]. ఇది పాంథెరా [[ప్రజాతి]]<nowiki/>లో భాగం. ఆరెంజి-బ్రౌన్ బొచ్చు పైనచర్మంపై చిక్కటి నిలువు చారలు దీని ప్రత్యేకత. ఈ నిలువుచారలు కిందికి వెళ్ళే కొద్దీ పలచబడతాయి. ఇది, ఆహారపు గొలుసులో శీర్షభాగాన ఉండే వేటవేటాడే జంతువు. ప్రధానంగా జింక, అడవి పంది వంటి [[ఖురిత జంతువు|ఖురిత జంతువులను]] (గిట్టలు కల జంతువులు) వేటాడుతుంది. ఇది ఒక ప్రదేశానికి పరిమితమై ఉంటుంది. సాధారణంగా ఒంటరిగా జీవించే వేట జంతువు. దీనికి విశాలమైన, తగినంత ఆహారం లభించే, తన సంతానాన్ని పోషించుకునేందుకు వీలైన ఆవాస ప్రాంతాలు అవసరమవుతాయి. పులి పిల్లలు స్వతంత్రంగా మారడానికి ముందు, రెండేళ్లపాటు తల్లితో కలిసి ఉంటాయి. ఆ తరువాత, విడిపోయి, తల్లి ఇంటి పరిధిని దాటి వెళ్ళి, స్వతంత్రంగా జీవిస్తాయి.
 
పులి ఒకప్పుడు పశ్చిమాన తూర్పు అనటోలియా ప్రాంతం నుండి అముర్ నదీ పరీవాహక ప్రాంతం వరకు, దక్షిణాన [[హిమాలయాలు|హిమాలయాల]] పర్వత ప్రాంతాల నుండి సుంద ద్వీపాలలో బాలి వరకూ విస్తృతంగా ఉండేది. 20 వ శతాబ్దం ఆరంభం నుండి, పులి జనాభా కనీసం 93% తగ్గిపోయింది. పశ్చిమ, [[మధ్య ఆసియా|మధ్య ఆసియాలో]], [[జావా (ద్వీపం)|జావా]], బాలి ద్వీపాల నుండి, [[ఆగ్నేయ ఆసియా|ఆగ్నేయ]], [[దక్షిణాసియా|దక్షిణ ఆసియా]], [[చైనా|చైనాల్లోని]] విశాలమైన ప్రాంతాలలో పులి కనుమరుగై పోయింది. నేటి పులి జనాభా సైబీరియా సమశీతోష్ణ అడవుల నుండి [[భారత ఉపఖండము|భారత ఉపఖండం]], సుమత్రాల్లోని ఉపఉష్ణమండల, ఉష్ణమండల అడవుల మధ్య ప్రదేశాల్లో చెదురుమదురుగా విస్తరించి ఉంది. పులిని, 1986 నుండి ఐయుసిఎన్ రెడ్ జాబితాలో [[అంతరించే జాతులు|అంతరించిపోతున్న]] జాబితాలో చేర్చారు. 2015 నాటికి, ప్రపంచ పులి జనాభా 3,062 - 3,948 మధ్య ఉన్నట్లు అంచనా వేసారు. 20 వ శతాబ్దం ప్రారంభంలో సుమారు 100,000 నుండి ఈ స్థాయికి తగ్గింది. నివాస విధ్వంసం, నివాస విభజన, వేట జనాభా క్షీణతకు ప్రధాన కారణాలు. ఇది భూమిపై ఎక్కువ [[జన సాంద్రత|జనసాంద్రత గల ప్రదేశాలలో]] నివసిస్తూండడంతో, మానవులతో గణనీయమైన ఘర్షణలు ఏర్పడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/పులి" నుండి వెలికితీశారు