ధవళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 50:
జనార్ధనస్వామి ఆలయం ఇక్కడ ప్రసిద్ధి. ఈ ఆలయం నవ జనార్ధన ఆలయములలో ఒకటి. ఈ ఆలయం 'ధవళగిరి' అను ఒక గుట్ట పైన ఉంది. స్వామి వారికి ప్రతి సంవత్సరం నిర్వహంచు కల్యాణం ఒక పెద్ద ఉత్సవం. ప్రతి సంవత్సరం [[భీష్మ ఏకాదశి]] దినమున జరుగు ఈ ఉత్సవం చుట్టు పక్కల జిల్లాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఆ రోజు జరుగు రథోత్సవం చాలా బాగుంటుంది. దీనినే తీర్థం అని కూడా అంటారు. మొదట్లో 5 రోజులు జరిగేదని పెద్దలు చెపుతారు. ఇపుడది 2 రోజులకు పరిమితమైంది. ప్రముఖులైన [[టంగుటూరి ప్రకాశం]] పంతులు గారు రాజమండ్రిలో చదువుకునే రోజుల్లో ఒకసారి ఈ తీర్థానికి విచ్చేశారు.
* '''లూథరన్ చర్చి''': ధవళేశ్వరం గ్రామంలో పురాతనమైన, అతి పెద్దదైన చర్చి ఉంది. దీనిని నిక్కం మెమోరియల్ ఇమ్మానుయెల్ లూథరన్ చర్చి అని అంటారు. విస్తీర్ణంలో పెద్ద కట్టడం అవడం వలన స్థానికులు దీనిని పెద్ద చర్చి అని అంటారు. ఇది ఆంధ్రా ఇవాంజిలికల్ లూథరన్ మిషన్ కు సంబంధించింది. మరొక ముఖ్యమైన విషయం, చర్చి కట్టడంలో ప్రముఖ విశేషం - చర్చి గోపురం, దానిలో ఉంచిన పెద్ద కంచు గంట. అ రోజులలో అంత భారీ గంటను అంత పైకి ఎక్కించటం అనేది నాటి పని వారి పనితనానికి మచ్చు తునక .
* '''అగస్త్యేశ్వర స్వామి ఆలయం''': అగస్త్యేశ్వర స్వామి[[అగస్త్యేశ్వరస్వామి ఆలయం]] పురాతన స్వయంభూ శివాలయం. శ్రీ అగస్త్యేశ్వర స్వామి అనే ముని వల్ల [[శివలింగం]] ఉద్భవించినది గనుక, ఈ గుడిని అగస్త్యేశ్వర స్వామి ఆలయం అని అంటారు.
* '''సుందర చైతన్యానంద స్వామి ఆశ్రమం''': సుందర చైతన్యానంద స్వామి ఆశ్రమం ఒక ఆధ్యాత్మిక ఆశ్రమం. ఇక్కడ గల వనం మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది.
* '''కంట్రి క్లబ్ విహార కేంద్రం''': గోదావరి నది ఒడ్డున గల కంట్రీక్లబ్ విహార కేంద్రంలో సేద తీరుటకు గల అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఒక మంచి రెస్టారెంట్ కూడా ఇక్కడ ఉంది.
"https://te.wikipedia.org/wiki/ధవళేశ్వరం" నుండి వెలికితీశారు