చిదిద్దుబాటు సారాంశం లేదు
"తెలుగు" మాట సహాయం
పంక్తి 12:
{{పాత చర్చల పెట్టె|[[/పాతచర్చలు 1|1]] .. [[/పాతచర్చలు 2|2]].. [[/పాతచర్చలు 3|3]].. [[/పాతచర్చలు 4|4]].. [[/పాతచర్చలు 5|5]]}}
 
==ఒక సలహా==
కాసుబాబుగారూ! నమస్తే. వ్యాసాలు వ్రాసేటప్పుడు చాలాసార్లు ఒక చిత్రమైన సమస్యను ఎదుర్కొంటున్నాను. అదేమిటంటే, వాడవలసిన పదం ఆంగ్ల భాషలో స్పురిస్తుంది. ఆ పదానికి సరయిన తెలుగు పదం ఎంత గింజుకున్నా గుర్తుకురాదు. అతి సామాన్యమైన మాటలు "verify" "allotted" వంటి మాటలకు మంచి నాణ్యమైన తెలుగు మాటలు (ధూమ శకటము లాంటి భయం పుట్టించే మాటలు కాకుండా)దొరికితే బాగుంటుంది. "FREQUENCY" అనే ఆంగ్ల పదానికి తెలుగులో ఒక కంకర్రాయి లాంటి మాట "దైర్ఘ్యమానము" అనుకుంటాను ఉన్నది. ఇటువంటి ఉచ్చరించటానికి కూడా శ్రమ పడవలసిన పదానికి బదులు, ఆంగ్ల పదమే తెలుగులో ఫ్రీక్వెన్సీ అని వ్రాస్తే అందరికీ సులభంగా ఉండగలదు. ఈ సమస్య నాలా చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది. నా సలహా లేక వినతి ఏమంటే, మన తెలుగు వికీపీడియాలో ఒక ప్రత్యేక పుట ఏర్పరిచి, అందులో ఎవరికైనా ఏ పదానికైనా సరయిన తెలుగు పదం దొరకకపోతే, సహాయం పొందటానికి వీలుగా ఏర్పరిస్తే బాగుంటుంది. ఇతర సభ్యులు తమ అనుభవంద్వారా ఆ మాటకు సరయిన తెలుగు పదం సూచించవచ్చు, కొంత చర్చ (అవసరమైతే) జరిగిన తరువాత దాదాపు అందరికీ అమోదయోగ్యమైన చక్కటి తెలుగు మాట తయారు అవుతుంది. నిఘంటువులలోని పదాలకన్నా, నలుగురూ చర్చించి ఒక పదానికి రూపకల్పన చేస్తే మంచి ఫలితాల్నిస్తుందని నా ఉద్దేశ్యం. దయచేసి పరిశీలించి, మీ అభిప్రాయం తెలియచెయ్యండి. ఇప్పటికే, ఇటువంటి సౌలభ్యం లభిస్తున్నట్లయితే, వివరాలు తెలుపగలరు.--[[సభ్యులు:Vu3ktb|SIVA]] 02:33, 30 మార్చి 2008 (UTC)
==ఏక వచన ప్రయోగం==