దశావతారములు (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
అధికార వ్యామోహితులైన దేవదానవులు పరస్పర ద్వేషంతో కక్ష సాధించుకుంటూ వుంటారు. దేవేంద్రుడు తరచుగా రాక్షసరాజు సోమకాసురునుండి తప్పించుకోవడానికి భృగుమహర్షి శరణుకోరి ఆశ్రమంలో తలదాల్చుకుంటాడు. అది తప్పు అని చెప్పి ఇంద్రుని భృగుపత్ని తృణీకరిస్తుంది. ఆమెకు నచ్చచెప్పడానికి యత్నించిన మహావిష్ణువును ఆమె నిర్లక్ష్యం చేస్తుంది. జీవన్ముక్తురాలవు కమ్మని మహావిష్ణువు ఆమెను శపిస్తాడు. భృగు మహర్షి సతీవియోగం భరించలేక మహావిష్ణువును శపిస్తాడు. ఆ భృగుమహర్షి శాపఫలితంగా దశావతారాలను ఆయన ధరిస్తాడు.
 
వేద శిశువుల నపహరించిన సోమకాసురుని చంపి, తిరిగి గొనిరావడానికి మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరిస్తాడు. క్షీరసాగర మధనంలో అమృతాన్ని దేవదానవుల మధ్య పంచిపెట్టడానికి మోహిని అవతారాన్ని ధరిస్తాడు.
 
సనకసనందాదులచే శపించబడిన జయవిజయులు మూడు జన్మలు తనకు శతృవులుగా వుండి చివరకు ముక్తి పొందగలరని చెబుతాడు. అదే విధంగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మించిన వారిని వరాహ, నృసింహావతారాలు ధరించి వధిస్తాడు. తదుపరి వామనావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధ, కలికావతారాలను ధరిస్తాడు<ref name="ప్రభ రివ్యూ">{{cite news |last1=రాధాకృష్ణ |title=చిత్ర సమీక్ష - దశావతారములు |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=59965 |accessdate=23 February 2020 |work=ఆంధ్రప్రభ దినపత్రిక |date=4 May 1962}}</ref>.
 
==పాటలు==