దక్షయజ్ఞం (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
మిగిలిన నక్షత్రకాంతలను ఆదరించక చంద్రుడు రోహిణీలోలుడై కాలం గడపటంతో తమకు అన్యాయం జరిగిందని వారంతా దక్షునికి చెబుతారు. దక్షుడు కోపించగా ఆయన భార్య వైరిణి సామరస్యంగా వారి కాపురాలను చక్కదిద్దమని కోరింది. భార్యలనందరినీ సమాన ప్రేమతో చూడమని దక్షుడు చంద్రునికి సలహా ఇవ్వగా, ఇది నా స్వంత వ్యవహారం నీ జోక్యం అక్కరలేదని చంద్రుడు దక్షునికి కటువుగా సమాధానం చెబుతాడు. దానికి కోపోద్రిక్తుడైన దక్షుడు చంద్రుని క్షయ గ్రస్తుడు కమ్మని శాపం ఇస్తాడు. చంద్రుడు శివుని శరణు కోరతాడు. శివుడు చంద్రునికి అభయమిస్తాడు. నారదుని ద్వారా ఈ సంగతి తెలుసుకున్న దక్షుడు కోపావేశంతో శివుని వద్దకు వచ్చి వాదనకు దిగుతాడు. ఇరువురూ కోపంతా ఆయుధాలు తీస్తారు. విష్ణువు వచ్చి వారిద్దరికీ రాజీ కుదురుస్తాడు. ఫలితంగా చంద్రునకు వృద్ధి క్షయాలు (కృష్ణ శుక్ల పక్షాలు) సంభవించాయి. శివుడు చంద్రశేఖరుడైనాడు.
 
దక్షునికి శివునిపై కోపం పోలేదు. సతీదేవి స్వయంవరానికి శివుని ఆహ్వానించకుండా అతని ప్రతిమ ఒకచోట పెట్టి స్వయంవరం నిర్వహిస్తాడు. సతి ఆ ప్రతిమ మెడలోనే హారం వేస్తుంది. దక్షుడు ఆమెను చంపబోతాడు. శివుడు ప్రత్యక్షమై సతిని కైలాసానికి తీసుకుపోయి వైభవంగా వివాహం చేసుకుంటాడు. విశ్వశాంతికై సప్తరుషులు తలపెట్టిన యాగానికి దక్షుడు రాగా శివుడు లేచినిలబడక అవమానించాడని కుపితుడైన దక్షుడు నిరీశ్వరయాగం తలపెడతాడు<ref name="ప్రభ రివ్యూ">{{cite news |last1=రాధాకృష్ణ |title=చిత్ర సమీక్ష - దక్షయజ్ఞం |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=59978 |accessdate=23 February 2020 |work=ఆంధ్రపభ దినపత్రిక |date=18 May 1962}}</ref>.
 
సతి ఆడపిల్ల కనుక తండ్రి ఆహ్వానించకపోయినా పుట్టింటి మమకారంతో యజ్ఞానికి వెళ్ళి అక్కడ అవమానం పాలై దేహత్యాగం చేస్తుంది. శివుడు తాండవమాడి వీరభద్రుణ్ణి సృష్టించి యాగాన్ని ధ్వంసం చేయమని పంపుతాడు. వీరభద్రుడు దక్షుని తల నరికి యాగగుండంలో పడవేస్తాడు. కాని అతని భార్య పాతివ్రత్య మహిమ వల్ల తిరిగి సజీవుడై లెంపలు వేసుకుంటాడు<ref name="పత్రిక రివ్యూ">{{cite news |last1=కృష్ణానంద్ |title=చిత్ర సమీక్ష దక్షయజ్ఞం |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=7367 |accessdate=23 February 2020 |work=ఆంధ్రపత్రిక దినపత్రిక |date=13 May 1962}}</ref>.
 
==పాటలు==