కలిమిలేములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
# నొసట వ్రాసిన వ్రాలు తప్పదులే చెరిపివేసిన - వైదేహి బృందం - రచన: కొసరాజు
==కథ==
రామయ్య కుమ్మరివృతీ చేసుకుంటూ ఉన్న రెండెకరాల పొలంతో సుఖంగా కాలం గడుపుతూ ఉంటాడు. తల్లి లక్ష్మమ్మ తమ్ముడు రాజు భార్య మాణిక్యమ్మ, చిన్నకొడుకు రామయ్య కుటుంబ సభ్యులు. రామయ్య బావమరిది సుబ్బయ్య కూడా ఆ గ్రామంలోనే ఉంటున్నాడు. అప్పులతో మునిగిపోయాడు. బ్రతుకుతెరువు లేక నరకయాతన పడుతున్నాడు. అతణ్ణి ఎలాగైనా కష్టాలనుంచి తొలగించాలని రామయ్య అనుకుంటాడు. తన ఇల్లు, రెండెకరాల భూమి షావుకారు నరసయ్యకు తనఖాపెట్టి రెండు వేల రూపాయలు అప్పు తెచ్చి సుబ్బయ్య రుణాలన్నీ తీర్చివేస్తాడు. ఒక నూనె గానుగ కూడా కొనియిస్తాడు. సుబ్బయ్య చిక్కులు తొలిగిపోయి డబ్బు సంపాదిస్తాడు. రామయ్య తమ్ముడు రాజు, సుబ్బయ్య కుమార్తె విమల బాల్యస్నేహితులు. ఆ స్నేహం వయసు పెరిగి యౌవనం అంకురించడంతో అనురాగంగా మారుతుంది. తమ్ముణ్ణి రామయ్య పట్నంలోని వృత్తి శిక్షణాలయానికి పంపిస్తాడు. సుబ్బయ్య నాలుగు రాళ్ళు సంపాదించగానే నరసయ్య అతనిని కలుసుకుని ఒక్క షరతు మీద తన అల్యూమినియం వ్యాపారంలో వాటా ఇస్తానంటాడు. రామయ్యను బాకీ కోసం ఒత్తిడిపెట్టి అతని ఆస్తిని కబళిస్తాననీ, తను ఏమీ అభ్యంతరం చెప్పరాదనీ ఆ షరతు. సుబ్బయ్య బాధపడతాడు. తన వ్యాపారం మీద వచ్చే లాభాలలో రామయ్యకు సగం వాటా ఇస్తానని అంతకు ముందే పదిమంది సమక్షంలో వాగ్దానం చేసిన సుబ్బయ్య కొంచెం తటపటాయించి ఎట్టకేలకు ఒప్పుకుంటాడు. నరసయ్య తన బాకీ యిమ్మని రామయ్యపై ఒత్తిడి పెడతాడు. "నీకోసం చేసింది కదా ఈ ఋణం. ఆ డబ్బు ఇవ్వ"మని రామయ్య సుబ్బయ్యను హెచ్చరిస్తాడు. సుబ్బయ్య దొంగలెక్కలు వేసి రామయ్య వాటాకు వచ్చింది రెండువేల రూపాయల నష్టమని తేల్చి వంచనకు పాల్పడ్డాడు. గత్యంతరం లేక తన భూమి, ఇల్లు నరసయ్యకు అప్పగించి ఊరిబయట పాకవేసుకుని యాతనామయమైన జీవితం ప్రారంభించాడు.
 
==వనరులు==
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
"https://te.wikipedia.org/wiki/కలిమిలేములు" నుండి వెలికితీశారు