పీర్ పంజాల్ శ్రేణి: కూర్పుల మధ్య తేడాలు

"Pir Panjal Range" పేజీని అనువదించి సృష్టించారు
 
+వర్గం
పంక్తి 1:
[[దస్త్రం:Pir_Panjal_2478293509_8000ae5902_o.jpg|thumb| పీర్ పంజాల్ రేంజ్ ]]
[[దస్త్రం:Kashmir-sat-nasa.jpg|thumb| ఉపగ్రహం నుండి కాశ్మీర్ లోయ దృశ్యం. చిత్రంలో ఎడమ, దిగువ భాగంలో మంచు కప్పేసిన పీర్ పంజాల్ శ్రేణి ఉంటుంది. ]]
'''పీర్ పంజాల్ శ్రేణి''' అంతర [[హిమాలయాలు|హిమాలయాల్లోని]] పర్వత సమూహం. [[హిమాచల్ ప్రదేశ్|హిమాచల్ ప్రదేశ్‌]], [[జమ్మూ కాశ్మీరు]], పాక్ ఆక్రమిత కాశ్మీరుల్లో తూర్పు-ఆగ్నేయం నుండి పశ్చిమ-వాయువ్యంగా ఇది విస్తరించి ఉంది. దీన్ని హిందూ మత గ్రంథాల్లో ''పాంచాలదేవ'' అని పేర్కొన్నారు. ఇక్కడ సగటు ఎత్తు 1400 మీ. - 4,100 మీ. మధ్య ఉంటుంది. ధౌలాధార్, పీర్ పంజాల్ శ్రేణుల వైపు పోతూ ఉంటే హిమాలాయల ఎత్తు పెరుగుతూ పోతుంది. మధ్య హిమాలయాల్లో పీర్ పంజాల్ అత్యంత పెద్ద శ్రేణి. [[సత్లజ్ నది|సట్లెజ్ నది ఒడ్డున]], ఇది హిమాలయాల నుండి విడిపోయి, [[బియాస్ నది|బియాస్]], [[రావి నది|రావి]] నదులను వేరు చేస్తూ పోతుంది.
 
== పేరు వ్యుత్పత్తి ==
పీర్ పంజాల్ కనుమ పేరిట పీర్ పంజాల్ శ్రేణికి ఈ పేరు వచ్చింది. దీని అసలు పేరు పాంచాలదేవ. [[పాంచాలము|పాంచాల]] అనేది [[మహా భారతము|మహాభారతంలో]] పేర్కొన్న దేశం. ప్రస్తుత వాయవ్య [[ఉత్తర ప్రదేశ్]] లోని ప్రాంతం. అయితే, మహాభారత ప్రాంతాలను పశ్చిమ పంజాబ్, దక్షిణ కాశ్మీర్లకు చెందినవిగా చూపించే సంప్రదాయాలు కూడా ఉన్నాయి. పండిత దినేశ్‌చంద్ర సిర్కార్ ''శక్తి -సంగమ తంత్రంలో'' వివరించిన భౌగోళిక విశ్లేషణ ప్రకారం కూడా ఇలాగే ఉంది. ఈ ప్రాంతం ఇస్లామీకరించబడిన తరువాత దేవత అనే భావన పీర్‌గా మారిందని ఎం ఏ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు.
 
== శిఖరాలు, పర్వత శ్రేణి ==
పంక్తి 21:
'''హాజీ పీర్''' కనుమ (ఎత్తు 2,637 మీ.) పశ్చిమ పీర్ పంజాల్ శ్రేణిలో పూంచ్, యురి రహదారిపై పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉంది.
 
[[పీర్ పంజల్ కనుమ|పీర్ పంజాల్ కనుమ]] (''పీర్ కీ గలీ'' అని కూడా పిలుస్తారు) కాశ్మీర్ లోయను రాజౌరి, పూంచ్ లతో 'మొఘల్ రోడ్' ద్వారా కలుపుతుంది. మొఘల్ రహదారి మొత్తమ్మీద ఇదే ఎత్తైన ప్రదేశం (3,490 మీ.). ఇది కాశ్మీర్ లోయకు నైరుతి దిశలో ఉంది. కాశ్మీర్ లోయలో యాపిల్ పట్టణంగా పేరొందిన షోపియన్, ఈ కనుమకు సమీపంలో ఉన్న పట్టణం.
[[దస్త్రం:Banihal_Pass.jpg|ఎడమ|thumb| బనిహాల్ నుండి చూస్తే పీర్ పంజాల్ శ్రేణి (పిక్చర్: ''షోయబ్ టాంట్రే'' ) ]]
బనిహాల్ కనుమ (2,832 మీ.) కాశ్మీర్ లోయకు దక్షిణ కొనన జీలం నది ఉద్భవించే స్థానం వద్ద ఉంది. బనిహాల్, ఖాజిగుండ్ పట్టణాలు కనుమకు చెరొక వైపున ఉంటాయి.
పంక్తి 30:
 
=== జవహర్ సొరంగం ===
బనిహాల్ కనుమ కింద పీర్ పంజాల్ పర్వతం గుండా వెళ్ళే 2.5 కి.మీ. పొడవైన జవహర్ సొరంగం బనిహాల్‌ను, ఖాజిగుండ్‌ను కలుపుతుంది. ఏడాది పొడుగునా నిరంతరాయంగా ప్ర్యాణీంఛేందుకు వీలుగా 1950 ల ప్రారంభంలో మొదలు పెట్టి 1956 అంతానికి పూర్తైన ఈ సొరంగానికి భారత మొదటి ప్రధానమంత్రి పేరిట జవహర్ సొరంగం అని పేరు పెట్టారు. ఇది సుమారు 2,100 మీ. ఎత్తున ఉంది. రోజుకు 150 వాహనాల కోసం ఈ సొరంగాన్ని నిర్మించగా, ఇప్పుడు రోజుకు 7,000 కంటే ఎక్కువ వాహనాలు దీని గుండా ప్రయాణిస్తున్నాయి. అందువల్ల, కొద్దిగా తక్కువ ఎత్తులో ఓ కొత్త, మరింత వెడల్పైన, మరింత పొడవైన సొరంగం నిర్మించేందుకు ప్రణాళిక చేపట్టారు.
 
=== బనిహాల్ ఖాజిగుండ్ రోడ్ సొరంగం ===
పంక్తి 39:
 
=== బనిహాల్ రైల్వే సొరంగం ===
పీర్ పంజాల్ రైల్వే సొరంగం, 11.215 కి.మీ. పొడవైన రైల్వే సొరంగం. ఇది కాజీగౌండ్, బనిహాల్‌లను కలుపుతుంది. ఇది ఉధంపూర్ - శ్రీనగర్ - బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగం. 2013 జూన్ 26 న ఈ సొరంగంలో రాకపోకలు మొదలయ్యాయి. ఇది భారతదేశపు అత్యంత పొడవైన రైల్వే సొరంగం, ఆసియాలో నాల్గవది. <ref name="TOI">{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2011-10-14/india/30278754_1_jawahar-tunnel-tunnel-excavation-baramulla|title=India's longest railway tunnel unveiled in Jammu & Kashmir|date=14 October 2011|work=The Times of India}}</ref>
 
== ఇవి కూడా చూడండి ==
పంక్తి 48:
== మూలాలు ==
{{Reflist}}
[[వర్గం:హిమాలయాలు]]
"https://te.wikipedia.org/wiki/పీర్_పంజాల్_శ్రేణి" నుండి వెలికితీశారు