ఆనాటి వాన చినుకులు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఆనాటి వాన చినుకులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ె → ే (2)
చి →‎ఈ పుస్తకంలోని కథలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 42:
 
===ఈ పుస్తకంలోని కథలు===
1. కరైకుడి నాగరాజన్; 2. బాచి; 3. నల్లమిల్లి పెదభామిరెడ్డిగారి గ్రామం; 4. అలా అన్నాడు శాస్త్రి; 5. సీరియల్ రాత్రులు; 6. ధారావహికం; 7. ఒక అనుబంధం-ఒక ప్రారంభం; 8. ది ఎండ్; 9. బొత్తిగా అర్ధం కాని మనిషి; 10. యానం ఏటిగట్టు మీద; 11. శిల; 12. బాబురావు మేష్టారు; 13. ఆకుపచ్చని జ్ఞాపకం; 14. ఎర్రశాలువా; 15. నల్లసుశీల; 16. ఆనాటి వాన చినుకులు; 17. ఒకశిథిలమైన నగరం; 18. కాకినాడలో రైలు బండెక్కి కోటిపల్లి వెళ్ళాం; 19. ఉప్పుటెరుమీద ఒక ఊరు; 20. రాజమండ్రిలో కైలాసం; 21. సీతారామా లాంచీ సర్వీస్-రాజమండ్రి; 22. రాజహంసలు వెళ్లిపోయాయి మరియు, 23. కల
 
ఈ కథల్లో 'కారైకుడి నాగరాజన్', 'శిల', 'బాబూరావు మేష్టారు'అనే మూడు సంగీతము ఇతివృత్తంగా నడిచిన కథలు. 'అలా అన్నాడు శాస్త్రి', 'ఆనాటి వాన చినుకులు' అనేవి కవిత్వపు నేపథ్యంలో పుట్టినవి. 'ది ఎండ్', 'బొత్తిగా అర్థం కాని మనిషి', 'ఒక అనుభవం ఒక ప్రారంభం' అనే కథలు వ్యక్తిగత సదసత్సంశయాల్లోంచి ఆవిర్భవించినవి. 'ఒక శిథిలమైన నగరం అనే కథ-శిథిల హంపి గురించి, 'రాజహంసలు వెళ్ళిపోయాయి'అను కథ [[యానాం]]-ఎదుర్లంక మధ్య [[గోదావరి]] పై [[వంతెన]] నిర్మాణ నేపథ్యంలో రాసినది. ఇక 'సీతారామా లాంచీ సర్వీస్-రాజమండ్రి' అనే కథ నేపథ్యం-కొత్తగా పెళ్ళైన ఒక యువజంట తమ హనీమూన్ ను సీతారామా లాంచిలో రాజమంద్రి నుండి పాపికొండల వరకు ప్రయాణిస్తూ జరుపుకోవడం, ఆ సమయంలో లాంచీవారితో పరిసరగ్రామ వాసులతో వారి సంబంధాలను మనోహరంగా వర్ణిస్తూ సాగుతుంది. ప్రస్తుతం చర్చలో వున్న [[పోలవరం]] డ్యాము నిర్మిస్తే, లాంచీలను నమ్ముకు బ్రతుకుతున్నవారి బ్రతుకులు ఎలా కకలావికలమవ్వుతాయో, గోదావరి వడ్డునున్న ఎన్ని గిరిజన గ్రామాలు నీటమునిగి, అక్కడి ప్రజలు వలసపొయ్యే స్ధితిని, కలిగే నష్టాన్ని కన్నులకు కట్టెటట్లు రాసేడు వంశీ. మిగిలిన కథలన్నీ మనుష్యుల్నీ, జీవిత మర్మాల్నీ, పరిశీలించిన అనుభవాలనుండి పుట్టినవి. ఈ కథలలోని పాత్రలు మన జ్ఞాపకాలలో వెంటాడుతునే వుంటాయి.
"https://te.wikipedia.org/wiki/ఆనాటి_వాన_చినుకులు" నుండి వెలికితీశారు