"ఇడ్లీ" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగు: 2017 source edit
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
 
| creator =
| course = బ్రేక్ ఫాస్ట్,
| served = సాంబార్ మరియు, చట్నీ తో వేడిగా
| main_ingredient = మినపగుళ్ళు,బియ్యం నూక
| variations = బటన్ ఇడ్లీ, తల్లె ఇడ్లీ, సన్నా, సంబార్ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ
 
[[దస్త్రం:DSC01368.JPG|thumb|ఇడ్లీలు]]
'''[[ఇడ్లీ]]''' ([[ఆంగ్లం]]: Idli or Idly) [[దక్షిణ భారత దేశం]]లో విరివిగా వాడే [[అల్పాహారం|అల్పాహార]] వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. [[మినప పప్పు]] మరియు, బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి [[ఆవిరి]]తో ఉడికించి తయారుచేస్తారు. మినప్పప్పు లోని ప్రోటీన్లు, [[బియ్యం]]<nowiki/>లోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన [[శక్తి]]<nowiki/>ని ఇస్తాయి. పిండి పులియడం వల్ల శరీరం సులభంగా జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. అందుకే దీన్ని పసి పిల్లలకూ, అనారోగ్యంతో బాధ పడేవారికీ తరచుగా తినిపిస్తూ ఉంటారు.
 
సాధారణంగా ఉదయం పూట అల్పాహారంగా తినే ఇడ్లీలను, వాటితో పాటు నంజుకుని తినటానికి [[చట్నీ]] లేదా [[సాంబారు]] లేదా కారంపొడిగానీ, [[పచ్చడి]]<nowiki/>తో గానీ వడ్డిస్తారు. ఎండు మసాలాలను కలిపి దంచి తయారుచేసిన ముళగాయి పొడి వంటి పొడులు ఇడ్లీలను ప్రయాణాలలో వెళుతూ వెళుతూ తినటానికి అనువుగా ఉంటాయి. అంతే కాకుండా, ఇడ్లీలు [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోని పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది.<ref>http://completewellbeing.com/article/the-light-list/</ref>
[[బొమ్మ:Idli1.jpg|thumb|ఇడ్లీ|left]]
 
[[దోశ]]<nowiki/>కు మరియు, వడకు [[తమిళనాడు|తమిళ]] దేశాన రెండు వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర కలదు కానీ, ఇడ్లీ మాత్రము విదేశీ దిగుమతి. [[సాహిత్యము]]<nowiki/>లో తొలిసారి ఇడ్లీ వంటి వంటకము యొక్క ప్రస్తావన (ఇడ్డలిగే) [[920]]లో శివకోట్యాచార్య యొక్క “వడ్డారాధనే” అనే [[కన్నడ]] రచనలో ఉంది. ఆ తరువాత [[1130]]లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి [[మూడవ సోమేశ్వరుడు]] రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము ''[[మానసోల్లాస]]''లో ఇడ్లీ తయారు చేసే విధానము ఇవ్వబడింది. అయితే ఈ రచనలలో ఆధునిక ఇడ్లీ తయారీకి ప్రధాన భాగలైన మినపప్పుతో పాటు బియ్యపుపిండి కలపడము, పిండిని పులియబెట్టడము, పిండి పొంగడానికి ఆవిరిపట్టడము మొదలైన విషయాల గురించిన ప్రస్తావన లేదు.
[[బొమ్మ:IDli.jpg|thumb|right|ఇడ్లీ-వడ, [[తిరుపతి]] దగ్గరలోని [[శ్రీనివాస మంగాపురం]] దగ్గర రోడ్డుపక్క హోటలు నుండి.]]
 
[[తెలుగు]]<nowiki/>లో ఇడ్లీలను ఇడ్డెనలు అంటారు. ప్రస్తుతము ఈ పేరు వాడకం తగ్గినది.
 
[[చైనా]] యాత్రికుడు [[హుయాన్ త్సాంగ్]] (7వ శతాబ్దము) రచనల వలన [[భారత దేశము]]లో ఆ కాలములో ఆవిరిపట్టే పాత్రలు లేవని తెలుస్తున్నది కానీ భారతీయులు మరుగుతున్న గిన్నెపై బట్టకప్పి ఆవిరిపట్టి ఉండవచ్చని భావిస్తారు. ఇండొనేషియన్లు అనేకరకాల పులియబెట్టే వంటకాలు వండేవారు అందులో ఇడ్లీకి పోలికలున్న కేడ్లీ అనే వంటకము కూడా ఉంది. 800 - 1200 మధ్య కాలములో [[ఇండోనేషియా]]కు హిందూ రాజులతో పాటు వెళ్లిన వంటవాళ్లు, పులియపెట్టే పద్ధతులు, అవిరిపెట్టే పద్ధతులు మరియు, వాళ్ల వంటకము కేడ్లీని దక్షిణ భారతదేశానికి తెచ్చారని ఒక భావన కానీ కచ్చితముగా నిర్ధారించుటకు ఆధారములు లేవు.
 
ఇడ్డెన అని తెలుగు దేశ్యపదం ఉన్నది. ఇప్పటికీ పల్లెటూరివాళ్ళు ఇడ్డెన, ఇడ్డెన్లు, ఇడ్నీలు అంటుంటారు. పల్లెటూరి వాడుక ప్రకారం ఇడ్నీ క్రమంగా ఇడ్లీ అయిఉండవచ్చును.నలారానికి లకారం వాడుకలో ఉన్నది. తెనుగు;తెలుగు, మునగ;ములగ, లంజ;నంజ, చాలా;చానా ఇట్లాంటివి కొన్ను చూపవచ్చును.ఈపద్దతిలో ఇడ్లీ ఏర్పడి ఉండాలి. ఇంతకీ ఇడ్డెన ఎలా ఏర్పడినది అన్న ప్రశ్నకి దువ్వెన, ఈర్చెన, నిచ్చెన, బచ్చెన వంటి పదాలతో ఇడ్డెనకు సామ్యం చూపవచ్చును.దువ్వు+ఎన దువ్వుటకు ఉపయుక్తమైన సాధనమని శబ్దరత్నాకరం అర్ధం ఉన్నది. ఉబ్బు=ఉప్పు, ఉప్పు+ఎన= ఉప్పెన, దువ్వు+ఎన=దువ్వెన, వడ్డించు=వడ్డెన, వడ్డి+ఎన=వడ్డెన. కావున ధాతువుల ప్రకారం "ఎన" అనే కృత్ ప్రత్యయం వచ్చి కృదంతరూపం ఏర్పడుతుంది. దువ్వు అనే మాట క్రియ. దువ్వడం అనే పనిని తెలుపుతుంది. దీనిమీద సదరు ప్రత్యయం వచ్చి దువ్వెన అయింది. దువ్వే సాధనము అని అర్ధం ఏర్పడింది. ఇట్లానే ఇడ్డెన ఏర్పడుతుంది? ఇడ్డెన అంటే వాసెన కుడుము అని అర్ధం. అనగా ఆవిరి కుడుము ఆని అర్ధమన్నమాట.సారాంశ మేమిటంటే ఇడ్లీ అనేది ఆవిరి గుడ్డమీద పెట్టి (ఇడి) ఉడికించిన పదార్ధం అన్నమాట.
== చిత్రమాలిక ==
<gallery>
File:ఇడ్లీలు (4).jpg|thumb|ఇడ్లీలు - (నెయ్యి మరియు, కొత్త ఆవకాయ)
File:ఇడ్లీలు (2).jpg|thumb|ఇడ్లీలు - (నెయ్యి, కొబ్బరి చట్నీ మరియు, అల్లం పచ్చడి)
File:ఇడ్లీలు (3).jpg|thumb|ఇడ్లీలు - (నెయ్యి,ఇడ్లీ పొడి మరియు, అల్లం పచ్చడి)
File:ఇడ్లీ (2).jpg|ఇడ్లీ - (నెయ్యి మరియు, కొత్త మాగాయ)
[[File:ఇడ్లీలు (6).jpg|thumb|ఇడ్లీలు - (నెయ్యి, ఇడ్లీ పొడి మరియు, అల్లం పచ్చడి)]]
</gallery>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2860929" నుండి వెలికితీశారు