"కందికొండ యాదగిరి" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎జీవిత విశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు
చి (→‎జీవిత విశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు)
 
==జీవిత విశేషాలు==
కందికొండ స్వస్థలం [[వరంగల్ జిల్లా]] [[నర్సంపేట]] మండలంలోని [[నాగుర్లపల్లి]] గ్రామం. ప్రాథమిక విద్య సొంతూర్లోనే పూర్తిచేసాడు. డిగ్రీ వరకు మహబూబాబాద్లో చదువుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి యం.ఎ (తెలుగు లిటరేచర్) మరియు, యం.ఎ (పొలిటికల్ సైన్స్) చేసారు. కందికొండ తాను చదువుకునే రోజుల నుంచే [[పాటలు]] రాయడం నేర్చుకున్నాడు
 
ఆయనకు ఇంటర్ చదివేటప్పుడు [[చక్రి]]తో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సినీ సంగీత దర్శకుడైన చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపాడు. తొలిసారిగా చక్రి సంగీత దర్శకత్వం వహించిన [[ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం]] చిత్రంలో ''మళ్లి కూయవే గువ్వా పాట'' రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. ఆ పాట చాలా ప్రాచుర్యం పొందింది. సంగీత దర్శకుడు చక్రి, దర్శకుడు పూరీ జగన్నాథ్ వరుస అవకాశాలతో పాటలు రాసి గేయరచయితగా నిలదొక్కుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2861205" నుండి వెలికితీశారు