న్యాయపతి రాఘవరావు: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు
→‎బాల్యం: పెళ్ళి వివరం
పంక్తి 1:
[[ఫైలు:Radio annaya-malleshwari.jpg|250px|right|thumb|న్యాయపతి రాఘవరావు [[మల్లీశ్వరి]] సినిమాలో]]
'''న్యాయపతి రాఘవరావు''' ([[ఏప్రిల్ 13]], [[1905]] - [[ఫిబ్రవరి 24]], [[1984]]) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, [[ఆంధ్ర బాలానంద సంఘం]] సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత.<ref>[http://www.balanandam.co.in/pages/radio_annayya.html బాలానందం.కాం లో ఆయన గూర్చి విశేషాలు]</ref>
==జీవిత విశేషాలు==
==బాల్యం==
[[1905]]వ సంవత్సరం [[ఏప్రిల్ 13]] న [[ఒరిస్సా]]లోని [[బరంపురం]] లో జన్మించాడు. తండ్రి న్యాయపతి రామానుజస్వామి ప్రముఖ న్యాయవాది. పాఠశాల చదువు అనంతరం [[విజయనగరం]] లోని [[మహారాజ కళాశాల]] లో డిగ్రీ పూర్తిచేసాడు. 1934 లో కామేశ్వరితో పెళ్ళయింది. రేడియో అక్కయ్యగా ప్రుగాంచిన న్యాయపతి కామేశ్వరి ఈమెయే. రాఘవరావుకి బాల్యం నుంచి పిల్లలంటే ప్రాణం. వారికి కథలు చెప్పటమన్నా, నటించి చూపటమన్నా మహా ఇష్టం. [[పాఠశాల]]లో వక్తృత్వ పోటీల్లో కథలు చెప్పే పోటీల్లో ప్రథమ బహుమతులన్నీ అతని సొత్తే.
 
==రేడియో అన్నయ్య==
పాఠశాలడిగ్రీ చదువు అనంతరంఅయ్యాక, [[విజయనగరంమద్రాసు]] లోనిలో [[మహారాజది కళాశాలహిందూ]] లో డిగ్రీ పూర్తిచేసి [[మద్రాసు]] లో పత్రికాపత్రికలో విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసితరువాత, దానికి రాజీనామా చేసి. [[ఆకాశవాణి]] లో కాంట్రాక్టు పద్ధతిపైనపద్ధతిపై చేరాడు. ఆ రోజుల్లో [[బీ.బీ.సీ]] లోని పిల్ల కార్యక్రామాల తరహాలో మనదేశంలో కూడ రేడియో చిన్న పిల్లల కొరకు [[రేడియో]] ప్రసారలను ఆరంబించాలని అప్పటి ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంది. [[మద్రాసు]] రేడియోలో పిల్లల కార్య క్రమాలను [[దుర్గాబాయి దేశ్‌ముఖ్|దుర్గాబాయి దేశముఖ్]] నిర్వహించేవారు. 1933 లో రాఘవ రావు, కామేశ్వరి జంటకు ఆ అవకాశం వరించింది. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు ''రేడియో అన్నయ్య'' గా పేరొందారు. ప్రతి [[ఆదివారం]] ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, [[తెలుగు]] బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి [[న్యాయపతి కామేశ్వరి]] అండగా నిలిచి ఆ కార్యక్రమాలను విజయవంతం చేసి [[రేడియో అక్కయ్య]] గా పేరొందారు. రేడియోలో పనిని వారు ఉద్యోగంగా కాకుండా ఒక ఉద్యమంగా భావించారు.
 
'''ఆటవిడుపు''' కార్యక్రమానికి శ్రోతల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతోపాటే ఆ కార్యక్రమంలో పాల్గొనే పిల్లల సంఖ్యకూడా ఎక్కువ కావటంతో పది సంవత్సరాలలోపు పిల్లలకి శనివారం [[బాలానందం]] అనీ, పది సంవత్సరాలు పైబడిన వారికి మరో కార్యక్రమం పెట్టి బాలబాలికల సృజనాత్మక శక్తిని పెంపొందించే ప్రయత్నంలో ఈ రేడియో అన్నయ్య ఎంతో కృషి చేశాడు. వారిని ఒడిలో కూర్చోపెట్టుకుని లాలించి, ముద్దాడి, ముద్దు ముద్దు పాటలు పాడిస్తూ, వారి పాట కనుగుణంగా నోటితో రకరకాల ధ్వనులను చేస్తూ మధ్య మధ్యలో అగ్గిపెట్టితో చిత్రవిచిత్ర ధ్వనులు చేస్తూ ఆ కార్యక్రమం వింటున్న వారికి గిలిగింతలు పెట్టేవాడు. వాస్తవానికి ఆ కార్యక్రమం కోసం పిల్లలకన్నా పెద్దలే ఆతృతగా వేచి చూసేవారు.
"https://te.wikipedia.org/wiki/న్యాయపతి_రాఘవరావు" నుండి వెలికితీశారు