కొల్లాపూర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా పురపాలక సంఘాలు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎విశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 71:
 
చరిత్ర
పిల్లలమర్రి బేతల రెడ్డి / నాయుడు జటప్రోలు సంస్థానాధీశుల యొక్క మూలపురుషుడే కాక, గంజాం జిల్లాలోని బొబ్బిలి రాజ వంశము, గోదావరి జిల్లాలోని పిఠాపురం, కృష్ణా జిల్లా లోని మల్లేశ్వరం మరియు, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి మొదలైన రాజ వంశములకు మూలపురుషుడని చరిత్రకారుల భావన. 15వ శతాబ్దం చివరిలో ఈ వంశానికి చెందిన మాదానాయుడు కృష్ణ, తుంగభద్ర సంగమ సమీపంలోని జటప్రోలు ప్రాంతానికి వచ్చి అక్కడ కోటను కట్టడం ప్రారంభించాడు. మూడు తరాల తర్వాత ఈయన వారసులలో ఒకడైన మల్ల భూపతినాయుడు 1507లో విజయనగర రాజులనుండి ఈ ప్రాంతాన్ని పాలించడానికి ఉత్తర్వును పొందాడు. కృష్ణదేవరాయల పట్టాభిషేకానికి వెలుగోటి నాయకునిగా విచ్చేసిన సామంతుడు ఈయనేనని చరిత్రకారుల అభిప్రాయం. కాకతీయ, విజయనగర సామ్రాజ్యాలు ఈ సంస్థానాధీశులకు సైనిక పోషణకై పట్టాలిచ్చారు. కానీ ఆయా సామ్రాజ్యల పతనం చెందినప్పుడు సంస్థానాధీశులు చాకచక్యంతో తమ రాజ్యాన్ని నిలబెట్టుకొని దక్షిణాపథంలో కొత్తగా ఆవిర్భవించిన శక్తులతో మనగలిగారు. 1513లో అప్పుడే కొత్తగా ఏర్పడిన గోల్కొండ సామ్రాజ్యంపై దండయాత్రకు సన్నాహాలు చేస్తూ, కృష్ణదేవరాయలు యుద్ధబలగాలను బేరీజు వేయటానికి, ఇతర సామంతులతో పాటు జటప్రోలు రాజు వెలుగోటి యాచమ నాయున్ని కూడా పిలిపించాడు. ఆ సంవత్సరం రాయచూరు అంతర్వేదిలో జరిగిన యుద్ధంలో జటప్రోలు సంస్థానము కూడా పాల్గొన్నది.
 
ఔరంగజేబు దక్షిణాపథంపై దండెత్తి కుతుబ్షాహీలను ఓడించినప్పుడు స్థానిక రాజవంశాలను నిర్మూలించక, వాటిని తన నియమించిన దండనాయకుని ఆధీనంలో వీటిని తన రాజ్యంలో సామంతులుగా విలీనం చేసుకున్నాడు. అప్పటి నుండి జటప్రోలు సంస్థానం యొక్క స్వాధికారత మరియు, ప్రాబల్యం పెరగటం ప్రారంభమైంది. అప్పటి సంస్థానాధీశుడు గోపాలరావు జటప్రోలు యొక్క ప్రాబల్యాన్ని దక్షిణాన జటప్రోలు నుండి ఉత్తరాన పానగల్, యల్జల్ల వరకు విస్తరించి పటిష్ఠపరచాడు. 1694లో సంస్థానాధీశుడైన నరసింగరావు మొఘలులపై తిరుగుబాటు చేసి మొఘులుల మల్లయోధున్ని బంధించి, గంజికోట (గండికోట) మరియు, శ్రీకాకుళంపై ఆధిపత్యం కావాలని పట్టుబట్టాడు. మొఘలులు ఈయన్ను తృప్తిపరచడానికి వీటిపై అధికారమిచ్చారు.
 
19వ శతాబ్దం చివరలో జటప్రోలు సంస్థాధీశునికి సంతానము కలుగక వారసుడు లేని పరిస్థితి వచ్చింది. అప్పటికే పొరుగు సంస్థానాలైన వనపర్తి, గద్వాలలో జరుగుతున్న వారసత్వపు పోరులను గమనించిన జటప్రోలు రాజు, ముందు జాగ్రత్త చర్యగా వెంకటగిరి రాజకుమారుడిని దత్తత పుచ్చుకున్నాడు. ఈయన జటప్రోలు రాజా సింహాసనము అధిరోహించిన తర్వాత తన అసలు పేరు నవనీతకృష్ణ యాచేంద్రను విడిచి రాజా వెంకట లక్ష్మణరావు బహుదూర్ అనే పట్టము స్వీకరించాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వెంకట లక్ష్మణరావు 1929లో మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/కొల్లాపూర్" నుండి వెలికితీశారు