కోటిలింగాల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 5:
''కోటిలింగాల'' అంటే ఇక్కడ కోటి శివలింగాలు లేవు. కోటలో లింగముండటం వల్ల కోటలింగమైంది. శాతవాహనుల కాలంలో ఇక్కడ 110 ఎకరాల విస్తీర్ణంలో దీర్ఘచతురస్రాకారంలో పెద్దకోట ఉండేది. దానికి ఎత్తైన గోడలతో పాటు నాలుగు మూలాల ఎత్తైన కోట బురుజులు ఉండేవి. వాటి ఈశాన్య మూలన ఉన్న కోట బురుజు శిథిలమై ఎత్తైన గడ్డగా మారిన తర్వాత కాలంలో ఈ గడ్డపైన గుడికట్టి, లింగాన్ని ప్రతిష్ఠించగా దానిని కోటలింగం అని, అదే కాలక్రమేణ కోటిలింగంగా రూపాంతరం చెందింది. అందులోని దేవుడు కోటేశ్వరస్వామిగా పిలవబడుతున్నాడు.
 
ఈ కోట గోడలు గోదావరి నది ఒడ్డు వెంబటి తూర్పు పడమరగా, మరియు పెద్దవాగు ఉత్తర దక్షిణములుగా దాదాపు 300 మీటర్ల ఆనవాళ్లను బట్టి తెలియుచున్నది. ఇక్కడ పురావస్తు శాఖ వారు రెండు సార్లు త్రవ్వకాలు జరిపారు. మొదట 1979 నుండి 1984 వరకు, రెండవసారి ఫిబ్రవరి 2009లో జరిగాయి. మొదటిసారి 1979లోత్రవ్వకాలు జరిపినపుడు ఈ ప్రాచీన నగరం బయల్పడింది.
==చరిత్ర==
మూడు దశాబ్దాల క్రితం చారిత్రక పట్టణంగా వెలుగులోకి వచ్చిన కోటిలింగాల శాతవాహనుల రాజధానిగా చారిత్రక పరిశోధకులు భావించారు. క్రమక్రమంగా త్రవ్వకాలలో లభించిన ఆధారాలను బట్టి ఇదే శాతవాహనుల తొలి రాజధానిగా నిర్థారించారు. కోటిలింగాలలో లభించిన శ్రీముఖుని నాణేలు వారి రాజధాని కోటలింగాల అని నిరూపించినట్లు ప్రముఖ చారిత్రక పరిశోధకుడు రాజారెడ్డి వాదించగా ఇది నిస్సందేహంగా శాతవాహనుల రాజధాని అని ఏటుకూరి బలరామయ్య అన్నాడు.<ref>తెలంగాణ చరిత్ర, డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 42</ref> పైఠాన్, ధాన్యకటకంలకు ముందు ఇదే శాతవాహనులకు రాజధానిగా పనిచేసిందని జైశెట్టి రమణయ్య, శాతవాహనుల జన్మభూమి తెలంగాణయే అనే విషయంలో సందేహానికీ తావులేకుండా పోయిందని శ్రీరామశర్మ, శాతవాహనులు తొలుత కోటిలింగాలలోనే రాజ్యమొనర్చినారని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు బి.ఎన్.శర్మ వివరించారు.
"https://te.wikipedia.org/wiki/కోటిలింగాల" నుండి వెలికితీశారు