గుడ్లవల్లేరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మండలము → మండలం, typos fixed: ె → ే
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 159:
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
మంచినీటి చెరువు:- 18 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువుకు మార్చి నుండి జూన్ వరకు, నీరు చిత్రం పంట కాలువనుండి జి.యి.సి.పక్కనుండి బోదే ద్వారా వస్తుంది. [14]
కొత్త చెరువు:- గ్రామంలోని అంబేడ్కర్ నగర్ లో, ఆరు ఎకరాల విస్తీర్ణంలో, 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ఈ మంచినీటి చెరువు ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ చెరువు నీటిని, అంబేడ్కర్ నగర్, నీలకంఠేశ్వరపురం మరియు, కొత్తగా ఏర్పాటు చేయుచున్న చంద్రబాబునగర్ కాలనీ వాసుల త్రాగునీటి అవసరాలకు ఉపయోగించెదరు. [18]
 
అగ్రహారం చెరువు:- ఇటీవల ఈ చెరువును 2.6 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధిచేసారు. [28]
పంక్తి 190:
స్థానిక [[గౌడ]] వంశీయులకు చెందిన ఈ ఆలయం, బస్సుస్టాండ్ కూడలిలోని కొత్త వంతెన ప్రక్కన ఉంది.
===శ్రీ బాలరెడ్డెంకమ్మ తల్లి ఆలయం===
మండలంలోని '''చింతలగుంట '''లో వేంచేసియున్న బెజవాడవారి ఇలవేలుపు అయిన శ్రీ బాలరెడ్డెంకమ్మ తల్లి (దేవరమ్మ తల్లి) వార్షిక ఉత్సవాలను 2016,మే-13వ తేదీ శుక్రవారం మరియు, 14వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. జిల్లా నలుమూలలనుండి '''బెజవాడ ''' వంశస్థులు వేలాదిగా ఈ ఉత్సవానికి తరలివచ్చారు. గౌడ సంఘీయులలోని బెజవాడ వంశస్థుల ఇలవేలుపుగా అమ్మవారికి, ప్రతి మూడు సంవత్సరాలకొకసారి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వచ్చుచున్నది. 14వ తేదీ శనివారం ఉదయం మాత వివాహం, సానికి చెరగడం, మద్యాహ్నం పిల్లా పాపలతోసహా వందలాది కుటుంబాలు స్థానిక పుట్టపొలం వద్ద పేగుచుట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి చుట్టూ పేగు చుట్టడంతో సందడి నెలకొన్నది. రాత్రికి బంగారు పుట్టలో అమ్మవారిని పెట్టడం, తదుపరి గజాల కొలువు జరిపినారు. 15వ తేదీ ఆదివారం ఉదయం అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారి ఘటం పోతురాజు గడలతో భక్తులు ఊరేగింపులో పాల్గొని పూజాధికాలు నిర్వహించారు. అనంతరం మహిళలు కుంభ, పాల నైవేద్యాలను నిర్వహించారు. పెద్ద యెత్తున పోటుగొర్రెను జరిపినారు. మొక్కుబడులను చెల్లించుకొని పెద్దయెత్తున విందుభోజనాలు చేసారు. [18]
===శ్రీ అంకమ్మ తల్లి ఆలయం===
మండలంలోని తాడిచెర్లలో వేంచేసియున్న, '''పల్లెం''' వంశస్థుల ఇలవేలుపు అయిన శ్రీ అంకమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఏడు సంవత్సరాల తరువాత 2016,[[మే]]-18వ తేదీ [[బుధవారం]]నుండి 22వ తేదీ [[ఆదివారం]] వరకు వైభవంగా నిర్వహించెదరు. 18వతేదీ బుధవారం పసుపు, కుంకుమలు తీసికొనిరావడం, గామోత్సవం, చల్దినైవేద్యాలు, 22వతేదీ ఆదివారంనాడు కోరలబండి మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. ప్రతి రోజూ గ్రామోత్సవం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. []
"https://te.wikipedia.org/wiki/గుడ్లవల్లేరు" నుండి వెలికితీశారు