గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు

8 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 6:
[[దస్త్రం:AP village kallachervu.jpg|thumb|ఆంధ్ర ప్రదేశ్ రాష్ఠ్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం]]
 
గ్రామ రాజ్యం ఏర్పాటు చేయాలని గాంధీజీ కలలు కన్నారు. ఆయన దృష్టిలో ప్రతి [[గ్రామ పంచాయితీ]] ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధే. అందువల్ల గ్రామాభ్యుదయానికి గ్రామ పంచాయితీల ఏర్పాటు, వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడటానికి వీలు కల్పించారు. ప్రాచీనకాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో పనిచేసేవి. అయితే ఇవి ఎక్కువగా అణచివేతకు గురయ్యేవి. బ్రిటిష్ పాలన ప్రారంభంలో అంతగా ఆదరించబడనప్పటికీ గవర్నర్ జనరల్ రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919 మరియు, 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలం చేకూర్చాయి. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా, 1959 నవంబరు 1న, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో దేశంలోనే రెండవదిగా [[మహబూబ్ నగర్]] జిల్లా, షాద్‌నగర్ లో ప్రారంభమైంది. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయితీ, బ్లాకు స్ధాయిలో పంచాయతి సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ గా ఏర్పడింది.
 
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీలు 1964లో రూపొందించిన చట్టాన్ని అనుసరించి పనిచేస్తున్నాయి. చట్టరీత్యా కమీషనర్ అనే అధికారి (జిల్లా కలెక్టర్) ఒక రెవెన్యూ గ్రామం లేదా దానిలోని ఏదైనా ఒక భాగాన్ని గ్రామ పంచాయితీగా సృష్టించవచ్చు. [[గ్రామ పంచాయితీ|పంచాయితీ రాజ్]] లో గ్రామ స్థాయి పరిపాలనా వ్యవస్థ '''గ్రామ పంచాయితీ''' <ref>{{Cite web |url=http://www.apard.gov.in/grampanchayat-handbook.pdf |title=గ్రామ పంచాయతి కరదీపిక |website= |access-date=2010-04-25 |archive-url=https://web.archive.org/web/20140327133709/http://apard.gov.in/grampanchayat-handbook.pdf |archive-date=2014-03-27 |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.apard.gov.in/finalgramapanchayat.pdf |title=గ్రామ పంచాయతి సమాచార దర్శిని |website= |access-date=2010-04-25 |archive-url=https://web.archive.org/web/20140327131915/http://apard.gov.in/finalgramapanchayat.pdf |archive-date=2014-03-27 |url-status=dead }}</ref>.పంచాయితీరాజ్ వ్యవస్థలో గ్రామ స్థాయిలో పరిపాలన సాగించే విభాగమే [[గ్రామ పంచాయితీ]]. ప్రతి గ్రామానికి ఒక [[గ్రామ పంచాయితీ]] వుంటుంది. నూతన పంచాయతీ వ్యవస్థ చట్టం ప్రకారం మూడంచెల విధానం అమల్లో ఉంది.
పంక్తి 315:
 గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలు. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా గ్రామంలోని ప్రజల కోసమే రూపొందించబడుతుంది. అయితే గ్రామాభివృద్ధి కోసం రూపొందించిన వ్యూహాలు, పథకాలు ప్రజల దగ్గరకు చేరేందుకు, గ్రామీణ స్థాయిలో అన్ని ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షించేందుకు ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించేందుకు గ్రామంలో ప్రభుత్వ ప్రతినిధి ఉండటం అవసరం.
 
గ్రామపంచాయితీ అధిపతిగా, ప్రజలకు బాధ్యునిగా సర్పంచి ఉండినా, ప్రభుత్వ పథకాలు, ఉత్తర్వులు, ఇతర సంబంధిత సమాచారం అందక ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడేవారు. గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి, సమగ్ర సమాచారం సేకరించి, ప్రజాప్రతినిధులకు అందజేయడానికే, ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సిన అవసరాన్నీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలలో గ్రామ పంచాయితీల పరిపాలనా విధానాల్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి గ్రామ పంచాయితీకి ఒక [[గ్రామ పంచాయితీ కార్యదర్శి]] పోస్టును సృష్టించి తేదీ 1.1.2002 నుంచి అమలులోకి తెచ్చింది. (జి.ఒ నెం 369 : పంచాయితీ రాజ్‌ మరియు, గ్రామీణాభివృద్ధి శాఖ (మండల్‌ -2) తేదీ. 9.12.2001)
 
'''పంచాయితీ కార్యదర్శి విధులు - బాధ్యతలు:'''
పంక్తి 326:
 
* పంచాయితీ కార్యదర్శి గ్రామపంచాయితీకి చెందిన అందరు అధికారులూ, సిబ్బందిపై నియంత్రణ కలిగి ఉంటాడు.
* సెక్షన్‌ 268 (2) (15) మరియు, జి.ఒ 72, తేదీ 29.2.2000 ప్రకారం పన్నులు, లైసెన్సులు మరియు, అనుమతుల విషయంలో సంబంధించిన వ్యక్తుల నుంచి ఏదైనా సమాచారం రాబట్టే అధికారం ఉంది. అవసరమైనప్పుడు సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, 1908 సూచించిన విధంగా సాక్షులను హాజరుపరచి, పరీక్షించే అధికారం కూడా ఉంది. సరైన కారణం లేకుండా ఎవరైనా సెక్షన్లు అతిక్రమిస్తే రూ.100 వరకూ జరిమానా విధించవచ్చు. సమన్లు అందుకున్న తరువాత ఏదైనా కారణంచేత హాజరుకాలేకపోతే కనీసం రెండు లేక మూడు రోజుల ముందుగా కార్యదర్శికి, అధికారికి తెలియజేయాలి.
* నిధులు దుర్వినియోగమైతే సర్పంచితో పాటు కార్యనిర్వహణాధికారి (కార్యదర్శి) కూడా బాధ్యుడు అవుతాడు. (జి.ఒ 53, తేదీ : 4.2.1999)
 
పంక్తి 338:
 
* గ్రామపంచాయితీ సమావేశాలు, ఇతర కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలి.
* గ్రామ పంచాయితీ మరియు, కమిటీల తీర్మానాలను అమలుచేయాలి.
* ప్రభుత్వ మరియు, పంచాయితీ ఆస్తులకు, భూములకు రక్షణ కల్పించాలి. గ్రామ చావడిలను నిర్వహించాలి.
* ప్రభుత్వ భూములను, భవనాలను ఇతర ఆస్థులు అన్యాక్రాంతం అయినప్పుడు లేదా ఇతరులు దుర్వినియోగం చేసినప్పుడు పైఅధికారులకు తెలియజేయాలి.
* గ్రామపంచాయితీకి అవసరమైన రిజిస్టర్లు నిర్వహించాలి. మరియు పంచాయితీ పన్నులను సక్రమంగా నూటికి నూరుపాళ్లు వసూలు చేయాలి.
 
'''సాధారణ పరిపాలనా పరమైన విధులు:'''
 
ప్రభుత్వం తరపున పన్నులు వసూలు చేయాలి. మరియు గ్రామ రికార్డులు, అకౌంట్లు సక్రమంగా సకాలంలో నిర్వహించాలి.
 
* 100% పంటల అజమాయిషీ, సర్వే రాళ్ల తనిఖీ చేయాలి.
పంక్తి 358:
* జనన మరణాల రిజిష్టర్లను సంబంధిత చట్టం ప్రకారం నిర్వహించాలి. దీనికోసం రెండు రిజిష్టర్లు మెడికల్‌ డిపార్టుమెంట్‌ నుంచి పొంది, నెలవారీ నివేదికలు డి.ఎం.హెచ్‌.ఓ.కు పంపాలి.
* సంబంధిత చట్టం ప్రకారం వివాహాలకు సంబంధించిన విధులను నిర్వహించాలి. వివాహాలను రిజిష్టర్లలో నమోదు చేయాలి. బాల్య వివాహాలు జరగకుండా చూడాలి. అట్లా జరిగితే పోలీసు రిపోర్టు ఇవ్వాలి.
* లబ్ధిదారులను గుర్తించడంలోనూ, రుణాల పంపిణీ మరియు, వసూళ్లలోనూ గ్రామసభకు సహాయపడాలి.
 
== '''గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థకు నిధులు''' ==
"https://te.wikipedia.org/wiki/గ్రామ_పంచాయతీ" నుండి వెలికితీశారు