భమిడిపాటి రాధాకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

భమిడిపాటి రాధాకృష్ణ
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''భమిడిపాటి రాధాకృష్ణ''' ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. ప్రముఖ హస్య రచయిత, "హాస్య బ్రహ్మ" శ్రీ [[భమిడిపాటి కామేశ్వరరావు]]వీరి తండ్రి. '''భమిడిపాటి రాధాకృష్ణ''' బహుముఖ ప్రజ్ఞశాలి. భమిడిపాటి రాధాకృష్ణ 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి [[కన్నడ]], [[తమిళం|తమిళ]], [[హిందీ]] భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇదేమిటి, కీర్తిశేషులు, మనస్తత్వాలు, భజంత్రీలు, దంత వేదాంతం వంటి నాటికలు, నాటకాల వ్రాశారు. [[రావుగోపాలరావు]] 'కీర్తిశేషులు'లోని ఒక పాత్రద్వారా మంచి పేరు తెచ్చుకుని సినీ పరిశ్రమలోనూ అడుగుపెట్టి ప్రముఖులైయ్యారు. నిర్మాత [[దుక్కిపాటి మధుసూదనరావు]] ప్రోద్బలంతో సినీ రంగంలోకి ప్రవేశించి 150 సినిమాలకు కథలందించారు. ఇందులో [[కె.విశ్వనాథ్‌]] తొలి చిత్రమైన [[ఆత్మగౌరవం]] కూడా ఉంది. [[బ్రహ్మచారి]], [[కథానాయకుడు]], [[కీర్తిశేషులు]], [[మరపురాని కథ]], [[విచిత్ర కుటుంబం]], [[పల్లెటూరి బావ]], [[ఎదురులేని మనిషి]], [[గోవుల గోపన్న]], [[సీతారామ కళ్యాణం]], [[నారీనారీ నడుమ మురారి]], [[కాలేజీ బుల్లోడు]] వంటి చిత్రాలకు కథకుడు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ లకు ఆయన సన్నిహితుడు. 1994 తర్వాత క్రమంగా ఆయన సినిమా రంగానికి దూరమయ్యారు. తనకు ఎంతో ఇష్టమైన గణిత రంగంపై మక్కువ చూపారు. '''భమిడిపాటి రాధాకృష్ణ''' క్యాలెండర్‌ పేరిట క్రీస్తుపూర్వం 45 నుంచి క్రీస్తుశకం 5555 వరకు అంటే ఆరు వేల సంవత్సరాల క్యాలెండర్‌ రూపొందించారు. జ్యోతిషరంగంలో కూడా ఆయనకి పట్టు ఉంది. సంఖ్యాశాస్త్రపరంగానే కాకుండా చిన్నారుల నామకరణ సమయంలో బియ్యంలో రాసే అక్షరాలను బట్టి కూడా ఆయన జాతకాలు చెబుతారనే పేరుంది.
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:1929 జననాలు]]